You are here
Home > Latest News > కరీంనగర్ ను నిర్లక్ష్యం చేసిందే కాంగ్రెస్ పార్టీ పొన్నం…

కరీంనగర్ ను నిర్లక్ష్యం చేసిందే కాంగ్రెస్ పార్టీ పొన్నం…

Spread the love
  • ఆ జిల్లా వ్యక్తివై ఉండి నువ్వు కరీంనగర్ కు చేసిందేమీ లేదు..
  • అధికారంలో ఉన్నప్పుడు చేసిందేమీ లేదు.. కాని ఇప్పుడు వచ్చి చేస్తారా?
  • సీఎం కేసీఆర్ కరీంనగర్ పై ప్రత్యేక శ్రద్ధ చూపించారు..

కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఎంపీగా ఉన్నప్పుడు కరీంనగర్ ను ఏమాత్రం పట్టించుకోలేదు. పట్టించుకోవడం కాదు కరీంనగర్ ను అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంచాడు. ఇప్పుడేమో శుద్ధపూస లెక్క మాట్లాడుతున్నడు. అసలు ఈయనుకు ఏమన్నా సిగ్గూ శరం ఉన్నదా? కాంగ్రెస్ పార్టీ హయాంలో తెలంగాణను సర్వ నాశనం చేసి కడుపు నింపుకున్నారు ఈ కాంగ్రెస్ నాయకులు. కరీంనగర్ నగర అభివృద్ధి కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులను వెచ్చిస్తున్నది. మరిన్ని అభివృద్ధి పనులతో పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నది. బస్టాండ్ చౌరస్తాలో జంక్షన్ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఇదివరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాను తాకుతూ ఒక్క జాతీయ రహదారి కూడా లేదు. కాని.. ఇప్పుడు ఐదు జాతీయ రహదారులు మంజూరు అయ్యాయి. కొత్త రైలు మార్గాల కోసం రైల్వే బడ్జెట్ లో నిధులు సాధించింది తెలంగాణ ప్రభుత్వం.

ఇదంతా నీకు అభివృద్ధిగా అనిపించట్లేదా మిస్టర్ పొన్నం. నువ్వేం మనిషివయ్యా. నువ్వు ఎంపీగా ఉన్నప్పుడు.. మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేయలేకపోయారు. ఇప్పుడేమో తెగ నీతులు పలుకుతున్నారు. ఈ కాంగ్రెస్ నాయకులు మారరు. ఎప్పుడూ ఒకరి మీద పడి ఏడ్వటమో. మానేడు డ్యాంను ఎప్పుడైనా అభివృద్ధి చేయాలనే ఆలోచన మీకు వచ్చిందా? కరీంనగర్ ప్రత్యేకతను దృష్టిలో ఉంచుకొనే.. నగరం సమీపంలోని మానేరు డ్యాం రివర్ ఫ్రంట్ ను అభివృద్ధి చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. మానేర్ డ్యాంను ప్యాటక కేంద్రంగా, కరీంనగర్ పట్టణాన్ని టూరిస్ట్ హబ్ గా డెవలప్ చేస్తున్నది తెలంగాణ ప్రభుత్వం.

మీకు నిజంగా తెలంగాణపై, కరీంనగర్ పై చిత్తశుద్ధి ఉంటే ఎందుకు మీకు ఈ ఆలోచనలు రాలేదు. రావు.. ఎందుకంటే.. మీకు అభివృద్ధి చేయాలనే ఆలోచన ఉంటే కదా. ఎప్పుడూ దోచుకొని తినడం, వేరే వాళ్ల మీద పడి ఏడ్వడమే మీకు తెలుసు. అందుకే.. తెలంగాణ సంక్షేమం కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం అహర్నిశలు పాటుపడుతున్న సీఎం కేసీఆర్ మీద బురద జల్లుతున్నారు. మీరు ఈ జన్మలో మారరు. మీరు తెలంగాణ ద్రోహులు.

 

 

 

 

 

Top