You are here
Home > Latest News > కరెక్టే.. నిద్ర పోయేది కేంద్ర ప్రభుత్వమే!

కరెక్టే.. నిద్ర పోయేది కేంద్ర ప్రభుత్వమే!

Spread the love

బీజేపీ రాష్ట్ర శాసనసభాపక్ష నాయకుడు కిషన్ రెడ్డి.. పొరబాటున ఓ నిజం చెప్పేశారు. ప్రభుత్వం నిద్రపోతోందని అన్నాడు. అది నిజమే. కానీ.. ఆయన రాష్ట్ర ప్రభుత్వం గురించి ఆ మాట అంటే.. జనం మాత్రం కేంద్రానికి అయితేనే ఆ మాట సరిగ్గా సరిపోతుందని చెబుతున్నారు. వ్యవసాయాన్ని దండగలా మార్చారని అంటున్న కిషన్ రెడ్డి.. కేంద్రం నుంచి మద్దతు ధరపై ప్రకటన ఎందుకు రావడం లేదన్న వాస్తవాన్ని మాత్రం ప్రస్తావిస్తున్నాడు. రైతులకు ఉచితంగా 24 గంటల కరెంటు ఇవ్వడమే కాదు.. వారికి ఎకరాలకు ప్రతి పంటకూ 4 వేల సహాయాన్ని ఇచ్చే పథకం గురించి కూడా మాట్లాడలేకపోతున్నాడు.

అంతే కాదు.. ప్రభుత్వ దవాఖానల్లో సిబ్బంది పనితీరు పెంచి.. ఒకప్పుడు ఖాళీగా ఉండే దవాఖానలను ఇప్పుడు కిటకిటలాడేలా మార్చిన ప్రభుత్వ పనితీరును ఆయన అంగీకరించలేకపోతున్నాడు. తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరించిన రాజశేఖరరెడ్డిని కీర్తిస్తూ.. కాంగ్రెస్ తో తనకున్న అంతర్గత స్నేహాన్ని కిషన్ రెడ్డి బయటపెట్టుకున్నాడు.

కేసీఆర్ ప్రభుత్వం నిద్ర పోతోందని అంటున్న కిషన్ రెడ్డి.. తమ పార్టీ అధికారంలో ఉన్న కేంద్రం తెలంగాణకు ఏమీ చేయకున్నా కూడా.. నిద్రపోయినట్టుగా వ్యవహరిస్తున్న తనలాంటి రాష్ట్ర నేతల వైఖరిపై మాత్రం నిద్ర పోయినట్టుగానే వ్యవహరిస్తున్నాడు. తెలంగాణనుంచి ఉన్న ఒక్కగానొక్క కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయను కేబినెట్ నుంచి తొలగిస్తే.. మోడీ నిరంకుశ వైఖరిపై మాట కూడా మాట్లాడని తీరును మరిచిపోతూ.. రాజకీయ గజినీలా వ్యవహరిస్తున్నాడు.

అందుకే.. కిషన్ రెడ్డి మాటలను వింటున్న జనం.. నవ్విపోతున్నారు. మంచి గురించి తెలియని వాళ్ల గురించి.. సంక్షేమానికి అర్థం తెలియని వాళ్ల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదంటూ.. లైట్ తీసుకుంటున్నారు.

Top