You are here
Home > Uncategorized > కరెక్ట్ కిషన్ రెడ్డి.. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీని గెలిపించాలో ప్రజలే నిర్ణయిస్తారు..

కరెక్ట్ కిషన్ రెడ్డి.. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీని గెలిపించాలో ప్రజలే నిర్ణయిస్తారు..

Spread the love

 

  • మరి.. నువ్వెందుకు అంత టెన్షన్ పడుతున్నావు..
  • నువ్వు గెలుస్తావా? లేదా? అని భయపడుతున్నావా?
  • అందుకే టీఆర్ఎస్ ప్రభుత్వం మీద బురద జల్లుతున్నావు..

వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీని గెలిపించాలో, ఎన్ని సీట్లు ఇవ్వాలో, ఎవరు అధికారంలోకి రావాలో ప్రజలే నిర్ణయిస్తారని బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి అంటున్నాడు. కరెక్టే కిషన్ రెడ్డి.. అందరు చెప్పేది అదే.. ఎవరు గెలిచేది, గెలవనిది ప్రజలు డిసైడ్ చేస్తరు. మరి.. నువ్వెందుకు ప్రభుత్వం మీద బట్ట కాల్చి మీదేస్తున్నవు. నువ్వు గెలుస్తావో, గెలువవో అనే భయం పట్టుకున్నది నీకు అందుకే.. ఇలా సీఎం కేసీఆర్ మీద, టీఆర్ఎస్ ప్రభుత్వం మీద బురద జల్లుతున్నావు.

కేంద్ర ప్రభుత్వానికి మంచి పేరొస్తుందని కేంద్ర పథకాలను రాష్ట్ర ప్రభుత్వం నీరుగారుస్తున్నదని కిషన్ రెడ్డి ఆరోపిస్తున్నాడు. మిస్టర్ కిషన్ రెడ్డి.. అసలు రాష్ట్రానికి కేంద్రం ఏమిచ్చింది చెప్పు. కేంద్రం ఏనాడైనా తెలంగాణను పట్టించుకున్నదా? పోనీ.. మీరైనా ఏనాడైనా విభజన హామీలను అమలు చేయాలని ప్రధాని మోదీని నిలదీశారా? లేదు. మరి.. మీకు తెలంగాణపై ఎట్లా ప్రేమ ఉన్నట్లు? మీరా తెలంగాణ సంక్షేమాన్ని కోరుకునేది? మీ పప్పులు అక్కడ ఉడకవు కదా.. అందుకే ఇక్కడ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నరు. నువ్వన్నట్టుగానే తెలంగాణ ప్రజలు అంతా గమనిస్తున్నరు. వాళ్లే మీకు తగిన బుద్ధి చెబుతారు.

తెలంగాణలో ప్రవేశపెట్టిన పథకాలు దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఏ ప్రభుత్వమూ ప్రవేశపెట్టలేదు. కేంద్ర ప్రభుత్వం కూడా ఇన్ని పథకాలను ప్రవేశపెట్టలేదు. కేంద్రం నుంచి రూపాయి రాకున్నా.. సీఎం కేసీఆర్ తెలంగాణలోని ప్రతి వర్గం సంక్షేమం కోసం అహర్నిషలు కృషి చేస్తున్నారు. దూరదృష్టితో పథకాలను ప్రవేశపెడుతున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న మీ ప్రభుత్వం ఎందుకు ఇటువంటి పథకాలను ప్రవేశపెట్టలేకపోయింది కిషన్ రెడ్డి. కేంద్రంలో అధికారంలో ఉన్న మీ ప్రభుత్వం నుంచి తెలంగాణకు మీరు తీసుకొచ్చిందేముంది. ఏమీలేదు. మీరు నిజంగా దమ్మున్న నాయకులైతే ముందుగా కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయండి. తెలంగాణకు రావాల్సిన నిధులు రప్పించండి. విభజన హామీలను అమలు చేయించండి. అవేమీ చేయకుండా.. ఇక్కడే ఉండి నోటికొచ్చినట్లు మాట్లాడితే మీరు తెలంగాణ ద్రోహులుగా మిగిలిపోతారు.

Top