You are here
Home > Latest News > కలలు కంటూనే ఉండండి.. దుర్మార్గులారా!

కలలు కంటూనే ఉండండి.. దుర్మార్గులారా!

Spread the love

కలలు కంటూనే ఉండండి.. దుర్మార్గులారా!

కాంగ్రెస్ నేతల కామెంట్లకు హద్దూ పద్దూ లేకుండా పోతోంది. జనామోదం లేని తమ పార్టీలోకి నేతల వలసలు జోరందుకోబోతున్నాయని ఆ పార్టీ కలలు కంటోంది. సంక్రాంతి తర్వాత.. టీఆర్ఎస్ నుంచి తమ పార్టీలోకి ఎమ్మెల్యేల వలసలు ఉంటాయని.. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పడంతో.. జనాలు వింతగా చూస్తున్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలేంటి? కాంగ్రెస్ లో చేరడం ఏంటి? అని ఉత్తమ్ తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

తమ పార్టీతో అధికార పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారంటున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి.. వారు ఎవరు అన్నది చెప్పకపోవడంలోనే తమ ఓటమిని అంగీకరించినట్టు అని జనం అంటున్నారు. అంతే కాదు.. వరంగల్ లాంటి ఉద్యమ కేంద్రంలో కాంగ్రెస్ బహిరంగ సభ పెట్టాలనుకునే ముందు.. తెలంగాణ ఏర్పాటులో ఆలస్యం కారణంగానే బలవన్మరణాలు జరిగిన వాస్తవాన్ని అంగీకరించి.. క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. తమకు 70 స్థానాలు వస్తాయని నమ్మకంగా చెబుతున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి.. మానసిక వైద్యుడి దగ్గరకు వెళ్తే మంచిదని సూచిస్తున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి టీఆర్ఎస్ లో ఉన్నట్టుగా భావించి మాట్లాడితే… తాము ఏమీ చేయలేమని.. టీఆర్ఎస్ కు వచ్చే స్థానాలను తమ ఖాతాలో కలుపుకుని చెబుతుంటే.. ఉత్తమ్ ను ఏమని పొగడాలో అర్థం కావడం లేదని.. కాంగ్రెస్ నేతలు కూడా తప్పుబడుతున్నారు.

Top