You are here
Home > Latest News > కాంగ్రెసోళ్లం ఉన్నాం అని చెప్పుకోవడానికి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారా?

కాంగ్రెసోళ్లం ఉన్నాం అని చెప్పుకోవడానికి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారా?

Spread the love

 

  • కాంగ్రెసోళ్లం ఉన్నాం అని చెప్పుకోవడానికి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారా?
  • తెలంగాణలో కాంగ్రెస్ నేతలు ఉన్నారు… అని చెప్పుకుంటున్నారా?
  • కాంగ్రెస్ కు తెలంగాణ ప్రజలు ఏగతి పట్టించారో మరిచిపోయినట్టున్నారు
  • 40 ఏళ్ల పాలనలో మీరు చేసిందేంటో లోకమంతా తెలుసు

తెలంగాణలో కాంగ్రెస్ ఉంది. కాంగ్రెస్ నాయకులు కూడా ఉన్నారు. కాంగ్రెస్ నాయకులు అంటే అంత ఆషామాషీనా. తెలంగాణ ప్రభుత్వం ఏం చేసినా.. దాంట్లో వేలు పెడతాం. భూతద్దంలో చూస్తాం. కోడిగుడ్డు మీద ఈకలు కూడా పీకుతాం.. అంటూ తమకు తామే జబ్బలు చరుచుకుంటున్నారు కాంగ్రెస్ నేతలు. ఏదో ఉన్నాం కాబట్టి… ప్రభుత్వంపై విమర్శలు చేయాలి కాబట్టి.. చేస్తున్నాం అన్నట్టుగా ఉంటున్నాయి కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు. సీఎం కేసీఆర్ బడ్జెట్ ప్రవేశపెట్టారో లేదో… అంతే వెంటనే కాంగ్రెస్ నేతలు బడ్జెట్ పై పలు రకాల విమర్శలు చేయడం ప్రారంభించారు. ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది కాబట్టి… దానిపై విమర్శలు చేయాలి కాబట్టి చేస్తున్నాం… అన్నట్టుగా ఉంటే వేస్ట్. తెలంగాణలో మేం ఉన్నాం అని నిరూపించుకోవడానికి తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేయాలా? ఇదేనా కాంగ్రెస్ నాయకుల తీరు.

అసలు.. ఏం మాట్లాడుతున్నారో? ఏం చేస్తున్నారో మీకైనా అర్థం అవుతోందా? పొన్నాల అంటాడు ఇది అవాస్తవ బడ్జెట్. అయ్యా పొన్నాల… మీ 40 ఏళ్ల పాలనలో మీరు ఎన్నిసార్లు వాస్తవ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. 40 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో మీకు తెలంగాణను అభివృద్ధి చేయాలన్న ఆలోచనే రాలేదు. కేవలం నాశనం చేశారు. ఇప్పుడేమో శుద్ధపూసల్లా మాట్లాడుతున్నారా? భట్టి… నువ్వు నీ నోటి నుంచి ఏది వస్తే అది మాట్లాడటం కాదు.. కాస్త విజ్ఞతతో మాట్లాడటం నేర్చుకో. నీ దశాబ్దాల రాజకీయ అనుభవం ఇదేనా? పదవుల కోసం ఏమైనా చేసేలా ఉన్నారు మీరు. పదవులు లేకపోతే బతికేలా లేరు. అందుకే ఇలా తెలంగాణ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారా?

కాంగ్రెస్ నేతలు చాలా బాగా మైకుల ముందు మాట్లాడుతున్నారు కానీ.. ఒక్క విషయాన్ని మాత్రం మరిచిపోతున్నారు. కాంగ్రెస్ తెలంగాణను పాలించిన సమయంలో వీళ్లంతా ఎక్కడికి పోయారు. 40 ఏళ్ల పాటు తెలంగాణను పాలించినప్పుడు వీళ్లకు తెలంగాణ అస్సలు గుర్తుకు రాలేదు. అప్పుడు ప్రేమ లేదు. ఇప్పుడు కపట ప్రేమను చూపిస్తున్నారు. మీరు నిజంగా తెలంగాణను అప్పుడే అభివృద్ధి చేసి ఉంటే.. ఇప్పుడు తెలంగాణ అభివృద్ధి, తెలంగాణ సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం ఇంత కష్టపడాల్సిన అవసరమే ఉండేది కాదు. తప్పు ఎక్కడుందో మీరే తెలుసుకోండి. పదవుల కోసమో.. దేని కోసమో దిగజారకండి. తెలంగాణ ద్రోహులుగానే మిగిలిపోతారు.

Top