You are here
Home > Latest News > కాంగ్రెస్ కర పత్రికలా మారిన ఏషియా నెట్!

కాంగ్రెస్ కర పత్రికలా మారిన ఏషియా నెట్!

Spread the love

విలువలు దిగజారుతున్న పాత్రికేయంపై.. చాలా మంది చాలా రకాలుగా మాట్లాడగా విన్నాం కానీ.. ఇప్పుడు ఏషియా నెట్ తీరును చూస్తుంటే.. అది నిజమే అని అనాలనిపిస్తోంది. ఎందుకంటే.. కాంగ్రెస్ కు కరపత్రికగా మారి.. అబద్ధాలను నిజాలుగా ప్రచారం చేస్తూ.. లేని పాపులారిటీని ఉందని చెబుతూ.. తప్పుల తడకలు వార్తలు సర్క్యులేట్ చేస్తూ.. సోషల్ మీడియాను భ్రష్టు పట్టిస్తూ.. అడ్డగోలు పాత్రికేయానికి అసలైన చిరునామాగా మారింది ఆ సంస్థ.

ఉత్తమ్ సభలకు అంత జనం వచ్చారు.. ఇంత జనం వచ్చారు అని రాయడం తప్పు కాదు కానీ.. అంతకంటే ఎక్కువ జనం టీఆర్ఎస్ సభలకు కూడా వస్తున్నారు. జగన్ సభలకు వస్తున్నారు. ఇతర పార్టీల సభలకు కూడా హాజరవుతున్నారు. కానీ.. వాటికి లేని ప్రాధాన్యత ఒక్క ఉత్తమ్ కుమార్ రెడ్డి సభలకే ఎందుకు? ఇలా దాగుడు మూతల కోలాటం ఆడకుండా.. అసలు రంగును బయట పెట్టుకోవచ్చు కదా.

అది చాతకాని ఈ దద్దమ్మల రాతగాళ్లు.. ప్రతిపక్షానికి వస్తున్న ఆరదణ చూస్తుంటే.. రాజకీయ మార్పు తథ్యం అన్న అర్థం వచ్చేలా రాతలు రాస్తున్నారు. ఆ రాతలే.. రేపు వాళ్ల చేతులు కాల్చబోతున్నాయన్న వాస్తవాన్ని మాత్రం.. కాంగ్రెస్ మాయలో పడి మరిచిపోతున్నారు. ఎవరి ఖర్మకు ఎవరు బాధ్యులన్న మాట.. ఇలాంటి వాళ్లను చూసే వచ్చి ఉంటుంది.

Top