You are here
Home > Latest News > కాంగ్రెస్ కుట్రలు.. బయటపడిన వాస్తవాలు

కాంగ్రెస్ కుట్రలు.. బయటపడిన వాస్తవాలు

Spread the love

 

  • ఇప్పట్లో కాంగ్రెస్ నాయకులు మారేలా కనిపించడం లేదు.
  • వారు.. పూర్తిగా.. తమ పార్టీని తామే సర్వ నాశనం చేసుకునేంత వరకూ..
  • నోటి దూల వదులుకునేలా లేరు.

 

అధికారాన్ని పోగొట్టుకున్న అక్కసుతో.. అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. కోర్టుల్లో కేసులతో పథకాలను అమలు కాకుండా చూస్తూ.. తమ బుద్ధిని బయటపెట్టుకుంటున్నారు. కోర్టులు.. ఆ కేసులను కొట్టేస్తున్నా.. తాము మాత్రం.. తీరు మార్చుకునేందుకు సిద్ధపడడం లేదు.

 

ఇప్పటికే.. మల్లన్నసాగర్ ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ నేతలు వేసిన పిటిషన్లు మట్టికొట్టుకుపోయాయి. సుందిళ్ల బ్యారేజీని అడ్డుకునేందుకు వేసిన పిటిషన్లను.. ప్రజల ఆగ్రహంతో.. వారికి వారే వెనక్కు తీసుకోవాల్సి వచ్చింది. కాళేశ్వరంపై సుప్రీం, గ్రీన్ ట్రిబ్యునళ్లలో వేసిన పిటిషన్లు.. నీరుగారిపోయాయి. జడ్జిలతో చివాట్లు తినాల్సి వచ్చింది. అయినా.. సింగరేణి వారసత్వ ఉద్యోగాలను అడ్డుకున్నారు.. కార్మికుల కుటుంబాలతో శాపనార్థాలు పెట్టించుకున్నారు. గ్రూప్ 2, కానిస్టేబుల్ నియామకాలు ఆగిపోయాలా చేసి.. నిరుద్యోగుల ఉసురు పోసుకున్నారు. మల్లన్నసాగర్ కు క్లియరెన్స్ వచ్చినా కూడా.. రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేసి.. నవ్వులపాలయ్యారు. విద్యుత్ ఉద్యోగులను పర్మినెంట్ చేయడంపైనా దాఖలైన పిటిషన్ ను.. హై కోర్టు కొట్టేయడంతో.. బిక్కచచ్చిపోయారు.

 

ఇదీ.. ప్రతిపక్షంగా కాంగ్రెస్ నేతల చరిత్ర. అధికారపక్షంగా తాము సాధించలేని పనులను.. టీఆర్ఎస్ ప్రభుత్వం చేసి చూపిస్తుంటే.. సహించలేక.. భరించలేక.. ఓర్వలేక.. క్షుద్ర రాజకీయాలు చేస్తున్నా.. ప్రజలు ఛీ కొడుతూనే ఉన్నారు. న్యాయస్థానాల్లో భంగపాట్లు ఎదురవుతూనే ఉన్నాయి. అయినా వారి తీరులో మార్పు లేదు. అరవై ఏళ్ల పాలనలో.. తెలంగాణను రాకుండా అడ్డుకున్న చరిత్రను.. అడుగడుగునా.. సొంతం చేసుకున్న దుర్మార్గులు కాంగ్రెస్ నేతలు. కాంట్రాక్టు ఉద్యోగుల భవిష్యత్తును గాలికొదిలేసిన నీఛులు. అభివృద్ధి జరగకుండా.. ప్రతి అడుగులో అవినీతిని వెనకేసుకున్న దగుల్బాజీలు. సింగరేణి వారసత్వ ఉద్యోగాలు.. విద్యుత్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్లు అడ్డుకుంటున్న పరమ త్రాష్టులు.

 

అలాంటి.. కాంగ్రెస్ నేతలు.. ఇవాళ తెలంగాణ గురించి.. కేసీఆర్ పాలన గురించి మాట్లాడుతుంటే.. ఇలాంటి నేతల మధ్య మనం మనగలగాల్సి వస్తుంటే..  సిగ్గుపడడం తప్ప.. మనం ఏం చేయలేం.

 

 

Top