You are here
Home > Latest News > కాంగ్రెస్ నేతలారా.. బడుగులను అడగండి కేసీఆర్ గురించి!

కాంగ్రెస్ నేతలారా.. బడుగులను అడగండి కేసీఆర్ గురించి!

Spread the love

ఉత్తమ్ కుమార్ రెడ్డి.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లాంటి దుర్మార్గులు ఉన్నంత కాలం.. కాంగ్రెస్ బతుకు కుక్కలు చింపిన విస్తరి అన్న మాట ఖాయంగా కనిపిస్తోంది. ఇన్నాళ్లూ ప్రజల నుంచి ఈ కామెంట్లు తీవ్రంగా వినిపించేవి. కానీ.. ఇప్పుడు స్వయానా.. ఆ ఇద్దరు నేతలకు తోడు.. తానా అంటే తందానా అంటున్న పార్టీలోని ఇతర నేతలు కూడా.. స్వయానా రాష్ట్ర కాంగ్రెస్ ను రాజకీయాల్లో ఖూనీ చేసేస్తున్నారు.

శాసనసభలో చేసిన తప్పును మరిచిపోయి ప్రజాస్వామ్య ద్రోహానికి పాల్పడిన కాంగ్రెస్ నేతలు.. తిరిగి ప్రభుత్వాన్నే నిందిస్తున్నారు. ప్రతిపక్షాన్ని తొక్కేసి.. తమ కుటుంబాన్ని బాగు పరుచుకోవడం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ తాపత్రయ పడుతున్నారని ఉత్తమ్ లాంటి నేతలు అంటున్నారు. కానీ.. ఈ ఆవేశంలో అసలు వాస్తవాలను మరుగున పడేస్తున్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్.. తన కుటుంబమే బాగు పడాలని కోరుకుంటే.. ఎందుకు ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తారు? ఎందుకు వ్యవసాయానికి కాంగ్రెస్ చేసిన కుట్రలను రైతులు మరిచిపోయేలా.. 24 గంటల పాటు ఉచిత కరెంటు ఇస్తారు? ఎందుకు పంటలకు పెట్టుబడి సహాయాన్ని అందిస్తారు? ఎందుకు.. పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఇస్తూ.. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు పెంచుతారు? ఎందుకు నిరుద్యోగ భృతి అందించేందుకు కసరత్తు చేస్తున్నారు? ఎందుకు సంక్షేమానికి ఏటా 35 వేల కోట్ల రూపాయలకు పైగా నిధులు కేటాయిస్తున్నారు? ఎందుకీ గురుకులాలు.. షాదీ ముబారఖ్.. కల్యాణ లక్ష్మి.. కేసీఆర్ కిట్.. పెన్షన్ల పథకాలు?

ఈ విషయాలపై ముందు కాంగ్రెస్ నేతలు జనాల్లోకి వెళ్లి వాస్తవాలు తెలుసుకోవాలి. అప్పుడు కానీ.. వారికి సమాధానం దొరకదు. తన కుటుంబాన్ని బాగుపరచడం కోసం కాదు.. తన కుటుంబాన్ని కూడా ప్రజాసేవలో సంపూర్ణంగా వినియోగిస్తున్న కేసీఆర్ గురించి మాట్లాడే నైతిక హక్కే కాంగ్రెస్ నేతలకు లేదు. ఆ వాస్తవాన్ని వాళ్లు అర్థం చేసుకోలేనంత కాలం.. కాంగ్రెస్ పార్టీ బాగుపడే అవకాశమే లేదు.

Top