You are here
Home > Uncategorized > కాంగ్రెస్ నేతలు లోఫర్లని ఒప్పుకున్న షబ్బీర్!

కాంగ్రెస్ నేతలు లోఫర్లని ఒప్పుకున్న షబ్బీర్!

Spread the love

కాంగ్రెస్ నేతలను మంత్రి కేటీఆర్.. లోఫర్లు అనగానే జనం కూడా స్వాగతించారు… నిజమే చెప్పారు కదా అనుకున్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ నేతలు అక్కడితోనే వదిలేస్తే సరిపోయేది. కానీ.. తమకు తాముగానే లోఫర్లమని చెప్పుకుంటూ.. కేటీఆర్ వ్యాఖ్యలను తప్పుబట్టే క్రమంలో తమ గురించి తామే వాస్తవాలు చెప్పుకుంటూ.. జనంతో ఛీ కొట్టించుకుంటున్నారు.

కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ ఏమన్నారయ్యా అంటే.. ఒకప్పుడు కాంగ్రెస్ లోనే ఉన్న కేసీఆర్ కూడా లోఫరేనా అంటూ తనేదో గొప్ప విమర్శ చేసినట్టుగా మాట్లాడారు. సరే.. ఆయన కేసీఆర్ ను ఉద్దేశించి అన్నమాటకు జనాలే సమాధానం చెబుతారు. ఆ విషయం పక్కన పెడితే.. కేసీఆర్ లోఫరేనా అని అడగడంలో.. తమను తాము లోఫర్లే అని అంగీకరించినట్టే అన్న వాస్తవాన్ని షబ్బీర్ అలీ మరిచిపోయారు.

ఇంత అమాయకుడిని.. రాజకీయం గురించి తెలియని వాడిని మండలిలో ప్రతిపక్ష నేతగా కాంగ్రెస్ నేతలు ఎన్నుకుంటే.. ఇదిగో.. ఇట్లాంటి ఫలితాలే ఏడుస్తాయి అని కాంగ్రెస్ శ్రేణులు కూడా విమర్శిస్తున్నారు. తమను తాము లోఫర్లు అని చెప్పుకునే నేతలు.. బహుషా షబ్బీర్ అలీ తప్ప.. ఇంకెవరూ ఉండకపోవచ్చని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఓ వైపు కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ జననేతగా మరింత ఎత్తుకు ఎదుగుతుంటే.. అది చూసి తట్టుకోలేకనే ఇలా షబ్బీర్ అలీ లాంటి నేతలు ప్రగల్భాలు పలుకుతున్నట్టు.. జనం భావిస్తున్నారు. ఈ తీరు.. కాంగ్రెస్ కు ఎంత మాత్రం మేలు చేయదని స్పష్టం చేస్తున్నారు.

Top