You are here
Home > Latest News > కాంగ్రెస్ పార్టీ ఏనాడూ రాజన్న గుడిని పట్టించుకోలేదు పొన్నం..

కాంగ్రెస్ పార్టీ ఏనాడూ రాజన్న గుడిని పట్టించుకోలేదు పొన్నం..

Spread the love

 

  • సమైక్య పాలనలో తెలంగాణలోని ఆలయాలు నిరాధరణకు గురయ్యాయి..
  • సీఎం కేసీఆర్ వేములవాడను దక్షిణ కాశిగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఉన్నారు..
  • రాజరాజేశ్వరస్వామి దేవస్థానం పరిధిని 25 నుంచి 30 ఎకరాలకు పెంచే ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి..

సమైక్య పాలనలో తెలంగాణలోని ఆలయాలన్నీ నిరాధరణకు గురయ్యాయి. తెలంగాణలోని ప్రాచీన చరిత్ర కలిగిన ప్రధాన ఆలయాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారు. దానిలో భాగంగానే యాదాద్రి, వేములవాడ ఆలయాలను అభివృద్ధి చేస్తున్నారు. వేములవాడ పుణ్యక్షేత్రాన్ని దక్షిణ కాశీగా తీర్చిదిద్దడమే సీఎం కేసీఆర్ ధ్యేయం. వేములవాడలో ఆధ్యాత్మికత వెల్లివిరిసేలా అభివృద్ధి చేస్తానని సీఎం కేసీఆర్ ఇదివరకే ప్రకటించారు. అదే మాట మీద వేములవాడను అభివృద్ధి చేస్తున్నారు.

ఏదీ ఒక్క రోజులో పూర్తి కాదు. కొంత సమయం పడుతుంది. అన్నీ అనుకున్నట్లుగా జరగవు కదా. మనసులో సంకల్పం ఉండాలి. ముఖ్యమంత్రి కార్యదీక్షతో ఉన్నారు. రాత్రికి రాత్రే అన్నీ జరిగిపోవాలని కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అంటున్నాడు. ఏమయ్యా.. పొన్నం దశాబ్దాలు పాలించిన మీ కాంగ్రెస్ పార్టీ వేములవాడ రాజన్న ఆలయాన్ని ఏమన్నా పట్టించుకున్నదా? రాజరాజేశ్వర స్వామి మీద ఒట్టేసి చెప్పు పొన్నం.. చివరకు ఆలయాల్లోనూ అక్రమాలు వెలుగు చూసిన సంఘటనలు కోకొల్లలు మీ హయాంలో.

ఇప్పుడేమో నువ్వు శుద్ధపూసలెక్క మాట్లాడుతున్నావు. సీఎం కాదు… కాంగ్రెస్ పార్టీ పెట్టింది, మీ పాలకులు పెట్టారు రాజన్నకు శఠగోపం. నువ్వు పాదయాత్ర చేసినా.. ఏ యాత్ర చేసినా అవన్నీ మీరు చేసిన తప్పులను కప్పి పుచ్చుకోవడానికే తప్పితే తెలంగాణకు ఏదో చేద్దామని కాదు. రాజన్న సన్నిధిలో ఈ టికెటింగ్ విధానం అమలుతో నిత్య పూజలు, అద్దె గదుల నిర్వహణ, ప్రసాదాల విక్రయాలపై పక్కా సమాచారం ఆన్ లైన్ లో అందుబాటులోకి రానున్నది. ఈ టికెటింగ్ విధానం ద్వారా రాజన్న దర్శనానికి వచ్చే భక్తులకు నిత్య సేవల్లో పాల్గొనే వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలు ఉండటంతో పాటు టికెట్ల విక్రయాల్లో అవకతవకలను చెక్ పెట్టొచ్చు. ఆలయ శిల్పుల సహకారంతో డిజైన్లు రూపొందించి దానికి అనుగుణంగా నిర్మాణాలు చేపట్టాలన్న సంకల్పంతో ప్రభుత్వం ఉంది. రూ. 62 కోట్లతో వేములవాడ గుడి చెరువును పునరుద్దరించింది తెలంగాణ ప్రభుత్వం. వేములవాడ ఆలయ అభివృద్ధి కోసం ప్రతి బడ్జెట్ లోనూ కొన్ని నిధులను మంజూరు చేస్తున్నది. యాదాద్రి తరహాలోనే వేములవాడ ఆలయాన్ని అభివృద్ధి చేయడానికి సంకల్పించారు సీఎం కేసీఆర్. దేవాలయ రెండో ప్రాకరణ, మహా మండల నిర్మాణం, వేద పాఠశాల ఏర్పాటు, గుడి చెరువు చుట్టూ విస్తరణ పనులు, రింగ్ రోడ్డు నిర్మాణం,  గుడి చెరువు దగ్గర ఆధ్యాత్మిక పార్కు, వేములవాడ టెంపుల్ డెవలప్ మెంట్ అథారిటీ, 25 నుంచి 30 ఎకరాలకు దేవస్థానం పరిధిని పెంచడం.. ఇలా వేములవాడను ఓ ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దడానికి సీఎం కేసీఆర్ పూనుకుంటే ఈ కాంగ్రెస్ నేతలు పిచ్చి కూతలు కూస్తున్నారు. వీటిలో ఏ ఒక్కటైనా మీకు చేతనయిందా? మీ హయాంలో ఏనాడైనా వందల కోట్లు పెట్టి వేములవాడను అభివృద్ధి చేశారా? కాంగ్రెస్ హయాంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉండేది వేములవాడ పరిస్థితి. కానీ.. నాలుగేండ్లలోనే సీఎం కేసీఆర్ అసాధ్యాల్ని సుసాధ్యం చేస్తూ ముందుకు వెళుతున్నారు. వేములవాడను దక్షిణ కాశిగా మహోన్నతంగా తీర్చిదిద్ది తీరుతారు.

Top