You are here
Home > Latest News > కాంగ్రెస్ బస్సు యాత్ర తుస్సు యాత్ర అయిందని మతి భ్రమించింది రేవంత్ కు

కాంగ్రెస్ బస్సు యాత్ర తుస్సు యాత్ర అయిందని మతి భ్రమించింది రేవంత్ కు

Spread the love

 

  • ప్రాజెక్టులను కట్టొద్దని మోకాలడ్డేసి.. ఇప్పుడు నీతిమంతుడిలెక్క మాట్లాడుతున్నవు..
  • తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటే.. నీకు పుట్టగతులు ఉండవు..
  • నెర్రెలు వారిన బీడు భూములను మీరు ఏనాడూ పట్టించుకోలేదు..

డౌటే లేదు.. కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డికి మతి భ్రమించింది. వాళ్ల బస్సు యాత్ర తుస్సు యాత్ర అయింది కదా. అలాగే అందరివీ అయితాయనుకున్నాడో ఏమో. నేను పోటుగాడిని.. నేను అది చేస్తా.. నేను ఇది చేస్తా.. నేను పులిని.. నేను సింహాన్ని.. అంటూ నడిరోడ్డు మీద తొడలు కొట్టుకొని కొట్టుకొని ఏం చేసినవు. నువ్వు తెలంగాణ ప్రజలకు చేసిందేమీ లేదు. నీ స్వార్థం కోసం.. నీ ప్రయోజనం కోసం కాంగ్రెస్ పార్టీలో చేరినవు తప్పితే తెలంగాణ ప్రజలకు ఏదో సేవ చేద్దామని కాదు.

ఇక.. కాంగ్రెస్ పార్టీలో ఈగలు, దోమలు తోలుకుంటూ సప్పుడుసేక కూర్చోక ఎందుకు అనవసర రాద్ధాంతాలు చేస్తున్నవు. నువ్వు ముఖ్యమంత్రి కేసీఆర్ ను విమర్శిస్తున్నావంటే తెలంగాణ ప్రజలను విస్మరిస్తున్నట్టే. తెలంగాణ ప్రజలు కేసీఆర్ కు ఓటేసి గెలిపించి అప్పుడే పుట్టిన పసికూనలాంటి తెలంగాణను అప్పగించారు. గత పాలకుల నిర్లక్ష్యంతో తెలంగాణలో అభివృద్ధి కుంటుపడింది. అటువంటి సమయంలో.. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి కడుపు కట్టుకొని తెలంగాణ అభివృద్ధి కోసం రాత్రింబవళ్లు కష్టపడుతున్న సీఎం కేసీఆర్ పై నిందలు వేస్తున్నవు.. నువ్వసలు మనిషివేనా?

గద్వాల ప్రజల దశాబ్దాల కల అయిన గట్టు ప్రాజెక్ట్ కు ముందడుగు పడటంతో ఆ ప్రాంత ప్రజలంతా ఎంతో సంతోషంగా ఉన్నారు. గద్వాల చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయేలా బహిరంగ సభ నిర్వహించేసరికి నీకు కండ్లు కుట్టినయి రేవంత్. గట్టు ప్రాజెక్ట్ తో గద్వాల ఏరియా ప్రజల కష్టాలు తొలిగిపోనున్నాయనే సంతోషం మీలో లేదు. ప్రాజెక్ట్ ఎక్కడ నిర్మాణం అవుతుందోననే బాధే మీలో కనపడుతుంది. ఇలా అడుగడుగునా తెలంగాణ అభివృద్ధిలో అడ్డుతగిలితే చివరకు మీ గతి అధోగతి అవుతుంది రేవంత్.

Top