You are here
Home > Latest News > కాంగ్రెస్, బీజేపీవి ఆశలు కాదు… అడియాశలు

కాంగ్రెస్, బీజేపీవి ఆశలు కాదు… అడియాశలు

Spread the love
  • కాంగ్రెస్, బీజేపీవి ఆశలు కాదు… అడియాశలు
  • ఒకటి రెండు చోట్ల సీట్లు గెలిచినంత మాత్రాన మీరు తోపులేమి కాదు
  • నిజంగా కాంగ్రెస్, బీజేపీకి అంత సీను ఉంటే మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు గెలవలేదు
  • ఎండమావిని చూసి అవే నీళ్ళు అనుకుంటే ఎలా?
    చీకట్లో రాళ్ళు విసిరితే ఎన్ని తాకుతాయి. మా అంటే ఒకటి రెండు తాకుతాయి కానీ అన్ని తాకుతాయా? అన్నీ తాకుతాయి అని అనుకోవడం మూర్ఖుల లక్షణమ్. ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్ అదే పరిస్థితి లో ఉంది. ఏదో ఒకటి రెండు సీట్లలో గెలవగానే ఇక మేము తోపులం అని అనుకుంటే ఎట్లా.
    ముందుంది మొసళ్ల పండగ. నిజంగా మీరు తోపులే అయితే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్ని గెలిచారు. బీజేపీకి డిపాజిట్లు కూడా దక్కలేదు. బీజేపీ గెలిచిన సీట్లు ఒకటి. ఇక కాంగ్రెస్ ప్రజా ఫ్రంట్ అంటూ తెలంగాణ కు వ్యతిరేఖంగా పోరాడిన చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్నారు. కానీ ఏమైంది.. తెలంగాణ జనాలు ప్రజా ప్రంట్ ను అడ్డంగా బొంద పెట్టారు.
    ఇక లోకసభ ఎన్నికల్లో రెండు మూడు సీట్లు వచ్చాయి కదా అని పరిషత్ ఎన్నికల్లోనూ మీరే గెలుస్తారు అని అనుకోవడం అవివేకం. మీ రాజకీయ పరిణతి ఎంత అనేది అది చెబుతుంది. తెలంగాణ ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోయే పార్టీ టీఆర్ఎస్. మధ్యలో ఎన్నో పార్టీలు వస్తుంటాయి పోతుంటాయి..  వాటి వల్ల తెలంగాణకు రూపాయి లాభం లేదు. ఆ విషయాన్ని జాతీయ పార్టీలు గుర్తుంచుకుంటే మంచిది.
Top