You are here
Home > Latest News >  కాంగ్రెస్ లో మరో కుట్రల ముఠా మొదలైంది!

 కాంగ్రెస్ లో మరో కుట్రల ముఠా మొదలైంది!

Spread the love

కాంగ్రెస్ నేతలే రాష్ట్రానికి శత్రువులుగా మారారంటే.. వారిని చూసి ఇంకొందరు దుర్మార్గులు తయారవుతున్నారు. బహుభార్యత్వంతో ఇప్పటికే ఊచలు లెక్కపెట్టిన వ్యక్తి.. మహిళల ఉసురు పోసుకున్న ఏపూరి సోమన్న లాంటి సామాజిక దుర్మార్గుడి నాయకత్వంలో కాంగ్రెస్ సాంస్కృతిక సేన అంటూ.. ఓ దుకాణం మొదలైంది. ఆయనకు తోడు.. రఘు అనే మరో కాబోయే దుర్మార్గుడు.. కాంగ్రెస్ కుట్రల బ్యాచ్ లో భాగమైపోయాడు.

ఆ ఇద్దరూ చేరగానే ఏదో అద్భుతం జరిగిపోయినట్టు.. ఇప్పటికిప్పుడు తమ చేతికి అధికారం దక్కేసినట్టు కాంగ్రెస్ నేతలు చేసుకుంటున్న పండగ చూడటానికి రెండు కళ్లు సరిపోవట్లేదు. ఇప్పటికే రేవంత్ రెడ్డి లాంటి రాజకీయ వ్యభిచారి, దొంగను పార్టీలో చేర్చుకుని పరువు పోగొట్టుకున్న కాంగ్రెస్ నేతలు.. ఏపూరి సోమన్నలాంటి వాళ్లను కూడా దగ్గరికి తీయడంతో.. వాళ్ల దుకాణంలో ఉన్నవాళ్లలో ఎక్కువ మంది సామాజిక ద్రోహులే అని నిరూపితమవుతోంది.

దీంతో.. జనం కూడా కాంగ్రెస్ తీరును అసహ్యించుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారం మాదే అని ప్రచారం చేసుకుంటున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్లను చూసి నవ్వుకుంటున్నారు. సభలో కనీసం సరిగా మాట్లాడ్డం కూడా రాని ఉత్తమ్ ను చూసి జోకులేసుకుంటున్నారు. ఇక కుంతియా వంతు. ఆయన ఎక్కడివాడో.. ఏ రాష్ట్రం వాడో కూడా రాష్ట్ర ప్రజలకు తెలియదు. కానీ.. రాష్ట్రంపై ఆయన చేస్తున్న కుట్రలు.. కాంగ్రెస్ నేతలు చేస్తున్న దారుణాలను మాత్రం జనాలు ఓ కంట గమనిస్తూనే ఉన్నారు. అందుకే.. వారి కలలు కల్లలు కాబోతున్నాయని.. వచ్చే ఎన్నికల్లో మరోసారి టీఆర్ఎస్ కే అధికారం అప్పగిస్తామని 31 జిల్లాల ప్రజలు ముక్తకంఠంతో నినదిస్తున్నారు.

ఎవరెన్ని కుట్రలు చేసినా.. కేసీఆర్ నాయకత్వంలోనే ముందుకు సాగుతామని జనాలు స్పష్టం చేస్తున్నారు.

Top