You are here
Home > Latest News > కాళేశ్వరం పథకంలో మరో అద్భుత ఘట్టం

కాళేశ్వరం పథకంలో మరో అద్భుత ఘట్టం

Spread the love
  • కాళేశ్వరం పథకంలో మరో అద్భుత ఘట్టం
  • ప్రపంచంలోనే అతి పెద్ద భూగర్భ పంప్ హౌస్ సిద్ధం
  • ఐఫిల్ టవర్ కన్నా పెద్దదైన పంప్ హౌస్
  • 5 బాహుబలి మోటర్లు సిద్దం

ఇది కదా తెలంగాణ ప్రజలు కోరుకున్నది. దీనికోసమే కదా యావత్తు తెలంగాణ ఎదురు చూసింది. తెలంగాణలో ప్రపంచంలోనే అతి పెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరం నిర్మితం అవుతుందని ఎవ్వరైనా ఏనాడైనా ఊహించారా? ఒకే ఒక్క ప్రాజెక్టులో 50 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుందని ఎవరైనా కల కన్నారా? దశాబ్దాల పాటు పాలించిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణను సర్వనాశనం చేసింది కానీ.. తెలంగాణను ఏనాడూ పట్టించుకోలేదు.

కానీ.. కేవలం అధికారంలోకి వచ్చిన ఐదేళ్లలోనే సీఎం కేసీఆర్ ఎన్ని చేసి చూపించారు చూడండి. ప్రపంచమంతా ఇప్పుడు సగర్వంగా తెలంగాణ వైపు చూస్తోందంటే దానికి కారణం సీఎం కేసీఆర్. ఆయన కృషి, పట్టుదల, చిత్తశుద్ది. కాళేశ్వరం ప్రాజెక్టు అనేది అసాధ్యం. కానీ.. దాని సుసాధ్యం చేశారు. ఆ ప్రాజెక్టును ప్రారంభించి సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు.

ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టులో మరో అద్భుతం చోటు చేసుకోబోతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద భూగర్భ పంప్ హౌస్ సిద్దమయింది. ఐఫిల్ టవర్ కన్నా పెద్దదైన పంప్ హౌస్ సిద్దమయింది. దాంట్లో 5 బాహుబలి మోటర్లు ఉంటాయి. 111.4 మీటర్ల ఎత్తుకు 2 టీఎంసీల నీటిని పంపు చేయగల సామర్థ్యం దాని సొంతం. ఒక మోటర్ కు విజయవంతంగా ట్రయల్ రన్ జరిగింది.

ఇది తెలంగాణ సాధించిన ఘనత. మరే రాష్ట్రం కూడా ఇటువంటి ప్రాజెక్టును ఇంతవరకు నిర్మించలేదు. ఇంజినీరింగ్ చరిత్రలోనే ఇది సరికొత్త అధ్యాయం. 139 మెగా వాట్ల సామర్థ్యం ఉన్న బాహుబలి మోటర్ 111 మీటర్ల ఎత్తుకు నీటిని ఎత్తిపోయడం ప్రారంభించింది. ఇది సీఎం కేసీఆర్ చెప్పిన అసలు బంగారు తెలంగాణ. ఐదేళ్లలో సీఎం కేసీఆర్ చేయగలిగినప్పుడు.. 40 ఏళ్లలో కాంగ్రెస్ ఎందుకు చేయలేకపోయిందో తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇది తెలంగాణ సత్తా అని ప్రపంచానికి చాటి చెప్పేలా కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారు సీఎం కేసీఆర్. కేసీఆర్ తెలంగాణ కోసం పోరాడటం, తెలంగాణను సాధించడం, ఇప్పుడు తెలంగాణను ప్రపంచంలోనే నెంబర్ వన్ గా తీర్చిదిద్దడం అనేది జరిగింది అంటే అది తెలంగాణ ప్రజలు చేసిన అదృష్టం.

Top