You are here
Home > Telangana > కాళేశ్వరం ప్రాజెక్టులో మరో మైలు రాయి.. 

కాళేశ్వరం ప్రాజెక్టులో మరో మైలు రాయి.. 

Spread the love
  • కాళేశ్వరం ప్రాజెక్టులో మరో మైలు రాయి..  
  • సీఎం కేసీఆర్ వల్లనే ఇది సాధ్యమయింది..
  • కాంగ్రెస్ అధికారంలో ఉంటే ఇంత పెద్ద ప్రాజెక్టు విజయవంతం అయ్యేదా?
  • కాళేశ్వరం ప్రాజెక్టుతో రైతుల తలరాతలు మారనున్నాయి..

కాళేశ్వరం ప్రాజెక్టు ఓ చరిత్ర. వచ్చే తరాలకు గొప్ప ప్రాజెక్టు. వందల ఏళ్ల తర్వాత కూడా రైతు సాగునీటి కోసం బాధ పడుకుండా ఉండేందుకు తీర్చిదిద్దిన పథకం అది. ఆ ప్రాజెక్టు ఆది నుంచి ఇప్పటి వరకు ఏ పని చేపట్టినా విజయవంతమే. తెలంగాణ రైతుల గోసలు తీర్చడానికి, తలరాతలు మార్చడానికి రూపొందుతున్న కాళేశ్వరంలో మరో ముందడుగు పడింది. నందిమేడారం పంపుహౌజ్ లో చేపట్టిన మొదటి పంపు వెట్న్ విజయవంతం అయింది.

124.4 మెగావాట్ల సామర్థ్యం ఉన్న ఈ పంపు… 105 మీటర్ల ఎత్తు వరకు నీటిని తోడేస్తుంది. అంత ఎత్తు నీటిని ఎత్తిపోసే ప్రక్రియ విజయవంతం అయింది. ఇంత భారీ సామర్థ్యం ఉన్న పంపులను ఏ ప్రాజెక్టులోనూ ఉపయోగించలేదు. మొట్టమొదటి సారి… ఆసియా ఖండంలోనే ఈ ఘనత సాధించిన దేశంగా భారత్ చరిత్రకెక్కగా… భారత్ లో ఏకైక రాష్ట్రంగా తెలంగాణ చరిత్రకెక్కింది.

తెలంగాణ ప్రజలు దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న రెండు ప్రధాన సమస్యలు సాగు నీరు, సాగుకు కరెంట్. రెండింటిలో కరెంట్ సమస్య పోయింది. ఇప్పుడు రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్ అందుతోంది. ఇక మిగిలిన ప్రధాన సమస్య సాగు నీరు. గత ప్రభుత్వాలు ఎలాగూ సాగు నీటి కష్టాలపై స్పందించలేదు. దశాబ్దాలు పాలించిన కాంగ్రెస్ పార్టీ, టీడీపీలు రైతుల సంక్షేమాన్ని గాలికి వదిలేశాయి. సాగు నీటిపై ఏనాడూ ఆలోచించలేదు. కానీ… సీఎం కేసీఆర్ మాత్రం… సాగునీటి సమస్యను పరిష్కరించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు తెలంగాణలోని ప్రతి ఎకరాన్ని సస్యశ్యామలం చేయడం కోసం ఎన్నో పథకాలను రచించారు. కాళేశ్వరం ప్రాజెక్టును రీడిజైన్ చేశారు. కాళేశ్వరం నుంచి నీటిని ఎత్తిపోసి రాష్ట్రంలోని 40 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించడం కోసం బృహత్ ప్రణాళికను తయారు చేశారు. దీని కోసం సీఎం కేసీఆర్ ఎంతో కష్టపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు రూపకల్పన కోసం చాలా కష్టపడ్డారు. ఇంజినీర్లు, అధికారులు విదేశాలకు వెళ్లారు. అక్కడి ప్రాజెక్టులను పరిశీలించారు. రక్షణ శాఖ అనుమతి తీసుకొని… కేంద్ర ప్రభుత్వం సంస్థ లైడార్ సర్వే నిర్వహించారు. పక్కా అంచనాతో కాళేశ్వరం ప్రాజెక్టు రూపకల్పన జరిగింది.

40 ఏళ్ల పాటు పాలించిన కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇటువంటి ప్రాజెక్టులకు రూపకల్పన చేయలేకపోయింది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ఇటువంటి ప్రాజెక్టులకు రూపకల్పన జరిగేదా? 40 ఏళ్ల పాటు పాలించి ఒక్క ప్రాజెక్టూ కట్టలేకపోయింది కాంగ్రెస్. ఇది కేవలం సీఎం కేసీఆర్ పట్టుదల, కృషి వల్లే జరిగింది. తెలంగాణ రైతుల అరిగోసలు పోవాలని, వాళ్లు భవిష్యత్తు బంగారం కావాలని.. వాళ్లు ఇంకెప్పుడూ సాగునీటి కోసం అల్లాడకూడదన్న సదుద్దేశంతో రూపొందుతున్నదే కాళేశ్వరం ప్రాజెక్టు.

Top