You are here
Home > Latest News > కాళోజీ,దాశరథి లను కూడా వదలని కంచ ఐలయ్య.

కాళోజీ,దాశరథి లను కూడా వదలని కంచ ఐలయ్య.

Spread the love

కాళోజీ,దాశరథి లను కూడా వదలని కంచ ఐలయ్య.

ఐలయ్యా,దాశరథి,కాలోజి ఏమి  చేసారో,ఏమి చేయలేదో తెలంగాణ ప్రజలకు స్పష్టంగా తెలుసు.అయితే వాళ్ళు  నీలాగా సమాజాన్ని కులాలవారీగా,వర్గాల వారిగా చీల్చి,వర్గవిభేదాలు సృష్టించలేదు.సమాజాన్ని సామాజిక కోణంలోనే చూసారే తప్ప,తెలంగాణ జన సమూహంగా నే చూసారే తప్ప కుల కోణం లో చూడలేదు. అలాగే చాకలి ఐలమ్మ,దొడ్డి కొమురయ్య,కుమ్రం భీం చేసిన పోరాటం కూడా తెలుసు.ఈ రోజు నువ్వు కొత్తగా వచ్చి మాకు జ్ఞాన బోధ చేయాల్సిన పనిలేదు.నీకు దాశరథి,కాళోజీ ల్లో వాళ్ళ కలం కన్నా వాళ్ళ కులం నీకు కనిపించడం నీ కురచబుద్ధికి తార్కాణం.వీళ్ళందరూ తెలంగాణ వాదులు,వివక్షను,అన్యాయాన్ని ప్రశ్నించిన వారు.వారు నిఖార్సైన తెలంగాణ వాదులు,మాకు స్ఫూర్తి ప్రదాతలు.మేము వాళ్ళ పోరాట స్పూర్తినే ఆదర్శంగా తీసుకున్నాము,వాళ్ళ కులాన్ని ఏనాడు పరిగణంలోకి తీసుకోలేదు.పద్నాలుగేళ్ళ ఉద్యమం మాకు చాలా విషయాలను నేర్పింది.

దేశ విభజనను సమర్థించిన కమ్యునిస్టు లు,ఎమర్జెన్సీ ని సమర్థించిన కమ్యునిస్టు లు,మన దేశ విచ్చిన్నానికి అనేక ప్రయత్నాలు చేసి ,మనతో యుద్ధం కూడా చేసిన చైనా,మన దేశం లో ఉగ్రవాదులను పంపి నరమేధాన్ని సృష్టిస్తూ,నకిలీ నోట్లను ముద్రించి మన దేశ ఆర్ధిక వ్యవస్థను కూల్చే ప్రయత్నం చేస్తున్న పాకిస్తాన్ కు అన్నిరకాల సహాయ సహకారాలు అందిస్తున్న చైనా ను పొగిడే,చైనాకు వత్తాసు పలికే కామ్రేడులు ఈ రోజు నిన్ను సమర్థిస్తున్నారు.నువ్వు ఎవరి సృష్టో స్పష్టంగా తెలిసిపోయింది.తెలంగాణ సమాజంలో ఏనాడూ కుల రాజకీయాలు,పోరాటాలు,కుల ఘర్షణలు,కులం పేరుతో రక్తపాతం ఏనాడూ లేదు.ఉండి ఉంటె చుండూరు,కారం చెడు,లక్ష్మి పేట,లాంటి సంఘటనలు ఈ నేల మీద జరిగేవి.కాని అలా జరగలేదు.అదీ ఈ సమాజపు గొప్ప లక్షణం.తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును సహించలేని కొన్ని దుష్ట శక్తులు,కేసీఆర్ ను ముఖాముఖిగా పోరాడి గెలవలేని కొన్ని తెలంగాణ వ్యతిరేక శక్తులు,ఈ రాష్ట్రంలో కులాల కుంపటి రాజేయడానికి,ఈ సమాజంలో ఒక అస్థిరత సృష్టించె మహత్తర కార్యాన్ని నీ భుజాలపై వేసారు.

లెఫ్టిస్ట్  భావజాలం గల పౌర సంఘాలు,అలాగే సి.పీ.ఎం నీకు అన్ని విధాలా సహకరిస్తున్నాయి..ఏ సి.పీ.ఎం అయితే పశ్చిమ బెంగాల్ లో దళితులను,ఊచకోత కోసిందో ,వాళ్ళ హక్కులను కాలరాసిందో అదే పార్టీ ఇక్కడ కుల రహిత సమాజం గురించి లెక్చర్లు దంచుతున్నది..వాళ్ళెం చేసారు,?వీళ్ళెం చేసారు? కాదు ఐలయ్య నువ్వేం చేసావో చెప్పు.తెలంగాణ ఉద్యమంలో నీ పాత్ర ఏమిటో చెప్పు? ఈ ప్రకృతిని,ఈ మనిషిని  దేవుడు సృష్టిస్తే,మనిషి మతాన్ని సృష్టించాడు.దేవుడి సృష్టిలో ఎలాంటి పక్షపాతం కనిపించదు.కాని మనిషి సృష్టించిన మతాలే,కాల పరీక్షకు తట్టుకోలేక చీలికలు,పేలికలు అవుతూ వచ్చాయి.నువ్వు అనుసరిస్తున్న మతం క్రైస్తవం  క్యాథలిక్కులుగా,ప్రోటేస్టెంట్ లుగా,మేథాడిస్ట్ లుగా చీలిపోలేదా?నల్ల జాతీయుల మీద శ్వేత జాతీయులు వివక్ష చూపలేదా?వాళ్ళను హింసించలేదా?వాళ్ళ హక్కులను కాలరాయలేదా?మార్టిన్ లూథర్ కింగ్ ఎవరి కోసం పోరాడాడు?ఎవరి హక్కులకోసం ఉద్యమించాడు?నీకు తెలియదా?మంచి చెడూ అన్ని మతాల్లోనూ ఉంటాయి.

Top