You are here
Home > Latest News > కుట్రలు ఛేదించే.. తెలంగాణ తెచ్చిన చరిత్ర కేసీఆర్ ది!

కుట్రలు ఛేదించే.. తెలంగాణ తెచ్చిన చరిత్ర కేసీఆర్ ది!

Spread the love

ఎన్నికుట్రలు ఎదుర్కొన్నారు? ఎన్ని ఎదురుదెబ్బలు తిన్నారు? అయినా.. రక్తం బొట్టు చిందకుండా.. పధ్నాలుగేళ్లపాటు పోరాటం చేసి.. స్వరాష్ట్రాన్ని సాధించిన ఘనత.. మన ముఖ్యమంత్రి కేసీఆర్ ది. అలాంటి కేసీఆర్ పై కుట్రలు జరుగుతున్నాయంటూ.. లేనిపోని ఆరోపణలు చేస్తున్న మోత్కుపల్లి.. ఓ విషయం మరిచిపోతున్నాడు. కుట్ర అంటూ చేస్తే.. అధికారం దక్కని వాళ్లు.. టీఆర్ఎస్ ను తప్ప.. మిగతా శక్తులందరినీ పోగేయడం మినహా మరేదే ఉండదన్న వాస్తవాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాడు.

ఈ అయోమయంలోనే.. తన మాటలను అప్రయత్నంగా జారేస్తున్నాడు.. మోత్కుపల్లి. మంద కృష్ణ అరెస్టును తప్పుబడుతూ తను చేసిన కామెంట్ల పరంపరలో భాగంగానే కేసీఆర్ పై కుట్రలంటూ కొత్త వాదన లేవనెత్తాడు. పబ్లిసిటీ కావాలంటే.. మీడియాలో ఇంత చోటు కావాలనుకుంటే.. మోత్కుపల్లి నర్సింహులు ఇప్పటికైనా ఇలాంటి పిచ్చిపనులు ఆపాల్సి ఉంది. ఎవరెన్ని కుట్రలు చేసినా.. ప్రజల ఆదరణ, మద్దతు ఉన్నంతవరకూ.. కేసీఆర్ పై ప్రత్యర్థులు చెడు పనులు ఏవీ పని చేయవన్న వాస్తవాన్ని ఆయన తెలుసుకోవాలి.

అంతే కాదు.. మందకృష్ణు బేషరతుగా విడుదల చేయాలని అని కోరుతున్న మోత్కుపల్లి.. విధ్వంసాన్ని సమర్థిస్తున్నట్టా? లేనట్టా? అన్నది స్పష్టం చేయాలి. శాంతియుత సభ అన్న పేరుతో.. విధ్వంసానికి దిగుతున్న మంద కృష్ణ మాదిగను అలాగే వదిలేయాలా? తప్పు చేస్తుంటే పోలీసులు అడ్డుకోవద్దా? అది వారి విధి నిర్వహణలో భాగం కాదా? ఈ ప్రశ్నలకు మోత్కుపల్లి సమాధానం చెప్పాకే.. వేరే విషయాలపై మాట్లాడితే బాగుంటుంది.

Top