You are here
Home > Latest News > కుట్ర కేంద్రానిదైతే.. రాష్ట్రాన్ని తప్పుబడుతున్న బీజేపీ!

కుట్ర కేంద్రానిదైతే.. రాష్ట్రాన్ని తప్పుబడుతున్న బీజేపీ!

Spread the love

తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం. రాష్ట్రాన్ని కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఎలా తిప్పలు పెడుతోందో. మన దగ్గర్నుంచి దబాయించి మరీ పన్నులు వసూలు చేస్తారు. కానీ.. తీసుకున్నదానికి సమానంగా నిధులు మాత్రం ఇవ్వరు. అయినా.. అభివృద్ధి కొనసాగాలంటే.. నమ్ముకున్న ప్రజలకు సంక్షేమం ఆగకూడదంటే.. జనాల ఆదాయం పెరగాలంటే.. ప్రభుత్వం అప్పులు చేయక తప్పదు.

ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం కూడా అదే చేసింది. కేంద్రం చేసిన కుట్రను ఛేదించేందుకు.. అప్పులే మార్గంగా కనిపించడంతో.. ఎలాగోలా కష్టపడి డబ్బులు సమకూర్చుకుంది. వాటితో సంక్షేమాన్ని బ్రహ్మాండంగా అమలు చేస్తోంది. ఇది చూసి.. బీజేపీ నేతలే నమ్మలేకపోతున్నారు. కాగ్ లో వచ్చిన విషయాలను పక్కదారి పట్టిస్తూ.. జనానికి తప్పుడు విషయాలను ప్రచారం చేస్తున్నారు.

తెచ్చుకున్న అప్పులను ఆదాయంగా చూపించేందుకు ప్రభుత్వం ప్రయత్నించిందంటూ.. అడ్డగోలు ఆరోపణలు చేస్తున్నారు. బడ్జెట్ లెక్కలు చూస్తే.. అప్పులేంటో.. ఆదాయాలేంటో అర్థమైపోతుంది. ఈ చిన్న విషయాన్ని పక్కన పెట్టి.. కాగ్ చెప్పిన విషయాన్న రాంగ్ ట్రాక్ లో జనానికి చేరవేస్తున్న బీజేపీ నేతలే అసలైన కుట్రదారులు. అక్కడితో ఆగకుండా.. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు.. ఇతర పథకాల అమలు తీరుపైనా లక్ష్మణ్ లాంటి వాళ్లు పదే పదే అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు.

బీజేపీ నేతలూ.. మారండి. ఇప్పటికైనా వాస్తవాలు చెప్పండి. లేదంటే.. కుట్రకు కేరాఫ్ నిలిచిన మీరు.. రేపు చరిత్రలో కలిసిపోవడం ఖాయం.

Top