You are here
Home > Latest News > కుడితిలో పడ్డ ఎలుక.. బీజేపీ

కుడితిలో పడ్డ ఎలుక.. బీజేపీ

Spread the love

కక్కలేక మింగలేక చస్తున్నరు తెలంగాణా బీజేపి నాయకులు …

పాపం. రాష్ట్ర బీజేపీ నాయకులను చూస్తే.. ఏమనాలో అర్థం కావడం లేదు. ఓ వైపు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని నాయకులు, మంత్రులు వచ్చి కేసీఆర్ పాలనను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. వాస్తవాలు మాట్లాడుతూ.. కేసీఆర్ పనితీరును అద్భుతమని ప్రశంసిస్తున్నారు. కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలను.. తమ రాష్ట్రాల్లోనూ అమలు చేస్తామని.. అవి దేశానికే ఆదర్శంగా ఉన్నాయని అభినందిస్తున్నారు.

దీంతో.. రాష్ట్ర బీజేపీ నాయకులు మాత్రం కుడితిలో పడ్డ ఎలుకలా మారిపోయారు. వాళ్లు కేసీఆర్ సర్కార్ ను బజారును పడేసే ప్రయత్నం చేస్తుంటే.. బీజేపీ జాతీయ, వేరే రాష్ట్రాల నాయకులు మాత్రం.. అందుకు విరుద్ధంగా నిజాలు మాట్లాడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో.. జనంలోకి ఎలా వెళ్లాలో అర్థం కాక.. బీజేపీ రాష్ట్ర నాయకత్వం తల పట్టుకుంటోంది. ఓ వైపు.. పార్టీకి బలం తెచ్చేందుకు చర్యలు తీసుకోండి అని.. చీఫ్ అమిత్ షా ఆదేశాలు పాటిస్తూ.. జనంలోకి వెళ్తున్నా.. తగిన స్పందన రాకపోవడంతో.. నాయకత్వం తెగ భయపడిపోతోంది.

కేసీఆర్ ను ఎంత తిడితే.. తమకు అంత మైలేజ్ అనుకున్న పరిస్థితుల నుంచి.. కేసీఆర్ ను, ఆయన పథకాలను ఎంతి తిడితే.. తమకు పొలిటికల్ గా అంత డ్యామేజ్ అన్న వాస్తవాన్ని అర్థం చేసుకునే స్థితికి బీజేపీ నేతలు పడిపోయారు. దీంతో.. సెప్టెంబర్ 17ను అనవసరంగా రాజకీయం చేసి.. పార్టీకి తలవంపులు తీసుకొచ్చామే అన్న ఆవేదనకు గురవుతున్నారు. అలాగే.. పార్టీ సభకు హాజరు కానున్న కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్.. ప్రజలకు ఎలాంటి సందేశం ఇస్తారో తెలియక.. తెగ టెన్షన్ పడిపోతున్నారు.

ఓ వైపు.. వేరే పార్టీల నేతలు.. ఎమ్మెల్యేలు.. ఎంపీలు తమ పార్టీలో చేరబోతున్నారని ప్రచారం చేసుకుంటున్నా.. ఇప్పటివరకైతే అలాంటి సంకేతాలు కనిపించడం లేదు. ఎవరు వస్తారో తెలియదు.. ఎవరు చేరతారో తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో.. ఏం చేసినా బూమరాంగ్ అవుతోంది. జనంలో పరువు పోతోంది. కేడర్ బలహీనపడుతోంది. అధికార పార్టీ రోజురోజుకూ మరింతగా బలపడుతోంది. రాజ్ నాథ్ సభ సక్సెస్ అవుతుందో కాదో.. అన్న అనుమానం కూడా బలపడుతోంది. సభ ఏ మాత్రం తేడాగా జరిగినా.. అమిత్ షా నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో అన్న భయం పెరుగుతోంది.

ఇలా.. రకరకాలుగా.. బీజేపీ నాయకత్వం టెన్షన్ పడుతోంది. ఓ వైపు పార్టీ కార్యక్రమాలకు దత్తాత్రేయ దూరంగా ఉండడం.. కిషన్ రెడ్డి అంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తుండడం.. ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఎవరి దారిలోవారు రాజకీయాలు చేస్తూ కలిసి రాకపోవడం కూడా.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ కు తలనొప్పులు తెచ్చిపెడుతోంది. చూస్తుంటే.. బీజేపీ రాష్ట్ర నాయకత్వం.. సెప్టెంబర్ 17 విషయంలో.. కోరి కొరివితో తల గోక్కున్నట్టు అనిపిస్తోంది.

Top