You are here
Home > Uncategorized > కులవృత్తులను కించపరుస్తూ.. కొంద‌రు ఫేస్‌బుక్‌లో పిచ్చి ఆరోప‌ణ‌లు చేస్తున్నారు

కులవృత్తులను కించపరుస్తూ.. కొంద‌రు ఫేస్‌బుక్‌లో పిచ్చి ఆరోప‌ణ‌లు చేస్తున్నారు

Spread the love

 

  • గొర్లు మేపుకొని బ‌త‌కాలా? గొర్రెల తెలంగాణ చేస్తారా?గొర్రెల‌తో ఆదాయం ఏం వ‌స్త‌ది?
  • అంటూ కొంద‌రు ఫేస్‌బుక్‌లో పిచ్చి ఆరోప‌ణ‌లు చేస్తున్నారు.
  • తెలంగాణ సంప్ర‌దాయ వృత్లుల గొప్ప‌త‌నం తెలియ‌క చేసే చీప్ విమ‌ర్శ‌లివి.
  • నీతినిజాయ‌తీగా చేసే ఏ వృత్తిలోనైనా ఆనందం ఉంటుంది. తృప్తి ఉంటుంది.
  • ఏసీ గ‌దుల్లో ఉద్యోగం కంటే ఇలాంటి వాళ్లు హాయిగా బ‌తుకుతారు.
  • తెలివి చూపాలేగానీ గొర్రెల వ్యాపారంలోనూ బోలెడు లాభాలు సంపాదించ‌వ‌చ్చు.
  • అందుకే తెరాస ప్ర‌భుత్వం గొర్రెలు, మేక‌ల‌ను పంపిణీ చేసింది. వీటితో ఎన్నో లాభాలు ఉంటాయో తెల‌వాలంటే..
  • నెల్లూరుకు చెందిన వ్య‌క్తి ప్ర‌త్యేకంగా పార్క్ గురించి చ‌ద‌వాలి.
 
యాదవ, కురుమలకు గొర్రెల పెంపకం ఓ జీవనవిధానం. ఆ కులస్థులు నేటికీ దానిని తమ కులవృత్తిగానే భావిస్తున్నారు తప్ప వ్యాపార కోణంలో చూడటం లేదు. దీంతో రాష్ట్రంలో గొర్రెల పెంపకం గొర్రె తోక బెత్తెడు అనే చందంగానే ఉండిపోయింది. అలాంటి గొర్రెల పెంపకాన్ని ఒక పరిశ్రమగా తీర్చిదిద్దేందుకు నడుం బిగించారు ఏ లక్ష్మీనారాయణరెడ్డి. మాంసం ఎగుమతే లక్ష్యంగా.. స్థానిక యువతకు ఉపాధి మార్గంగా భారీ ఎత్తున గొర్రెల పెంపకం కోసం 200 ఎకరాల్లో ఒక పార్క్‌ను ఏర్పాటుచేశారు. ఇందులో ఔత్సాహికులను భాగస్వాములను చేసేందుకూ సిద్ధంగా ఉన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలోని దివిటిపల్లిలో ఏర్పాటైన ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ.. మాగ్నస్ షీప్ పార్క్
1980 దశకంలోనే సినిమారంగంలో డిస్ట్రిబ్యూటర్, ఫైనాన్షియర్‌గా హైదరాబాద్‌లో స్థిరపడిన నెల్లూరుకు చెందిన ఏ లక్ష్మీనారాయణరెడ్డి వ్యవసాయంపై మక్కువతో ఆ రంగంవైపు మళ్లారు. అయితే, అప్పటికే తన కుటుంబానికి గొర్రెల పెంపకంతో అనుబంధం ఉన్న నేపథ్యంలో వాటిపై దృష్టి సారించారు. మాంసానికి డిమాండ్ ఉండటం, ఉత్పత్తి తక్కువగా ఉండటం గమనించిన ఆయన రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి యాదవ, కురుమలు మాత్రమే గొర్రెల పెంపకంలో ఉండటంతో వాటి కొరత తీవ్రంగా ఉన్నదని గుర్తించారు. దీంతో ఈ రంగాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు దేశ, విదేశాల్లో విస్తృతంగా పర్యటించి అధ్యయనం చేశారు. గొర్రెల రకాలు, వాటికి వచ్చే వ్యాధులు, ఉపాధి, ఎగుమతి అవకాశాలు, పెంపకం ద్వారా వచ్చే ఆదాయ వివరాలను తెలుసుకున్నారు. ఉపాధి, ఆదాయమార్గాలు ఎక్కువగా ఉన్నాయని గుర్తించి మాగ్నస్ షీప్ పార్క్ పేరుతో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని ఏర్పాటుచేశారు. ఆహార, అనుబంధరంగాలుగా కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు గొర్రెల పెంపకానికి ప్రోత్సాహాన్ని అందిస్తున్న పలు పథకాల వివరాలను సేకరించారు. అదేవిధంగా బ్యాంకుల నుంచి అందే రుణాలను తెలుసుకున్నారు.
 
పెంపకం ఒక్కటే ఆదాయం కాదు..
గొర్రెల పెంపకానికి సంబంధించిన అంశాలను ఏఎల్‌ఎన్ రెడ్డి ఈ విధంగా వివరించారు. రాష్ట్రంతోపాటు, విదేశాల్లో కూడా హైదరాబాద్ దక్కనీ, నెల్లూరు జోడిపి జాతుల గొర్రెల మాంసానికి డిమాండ్ ఉంది. పెంపకందారులు సరైన మెళకువలు పాటించకపోవడంతో వారికి లాభం రావడంలేదు.. ఎగుమతి అవకాశాలు దక్కడంలేదు. ఈ నేపథ్యంలో 200 ఎకరాల్లో 1,500 మంది యువతకు ప్రత్యక్ష ఉపాధి అందించేందుకు మాగ్నస్ షీప్ పార్క్‌ను ఏర్పాటుచేశాం. ఇందులో 600 యూనిట్లు ఏర్పాటు చేయొచ్చు. ఒక్కో యూనిట్‌లో 200 గొర్రెలతోపాటు 10 పొట్టేళ్లు ఉంటాయి అని తెలిపారు. మాగ్నస్ షీప్ పార్క్‌లో పెట్టుబడి పెట్టేందుకు ఔత్సాహికులు ఎవరైనా ముందుకొస్తే వారు చెల్లించిన మొత్తానికి సరిపడా భూమిని వారి పేరుమీద రిజిస్టర్ చేస్తాం. మహిళా సభ్యులకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించాం. రెండోదశలో ప్రభుత్వ పథకాల ద్వారా బ్యాంక్ సబ్సిడీతో యూనిట్ నిర్మిస్తాం. ప్రభుత్వసంస్థ అయిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ (ఐసీఏఆర్), నాబార్డ్‌తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుని ఇన్సూరెన్స్ చేయించుకున్నాం. దీంతోపాటు దాదాపు 30-40% వరకు తీసుకున్న రుణం నుంచి సబ్సిడీ రూపంలో మినహాయింపు లభిస్తుంది. పెట్టుబడి పెట్టిన ఏడాది నుంచి ఫలితాలు రావడం మొదలువుతుంది.
 
ప్రత్యేకమైన పద్ధతిలో గొర్రెల వ్యర్థాలను వేరుచేసి వ్యవసాయ క్షేత్రాలకు ఎరువుగా ఉపయోగించడం వల్ల కూడా ఆదాయం వస్తుంది. వాటాదారులకు అదనపు ఆదాయం వచ్చేలా స్థలం చుట్టూ మలబారు వేప, టేకు, ఎర్రచందనం చెట్లను పెంచనున్నాం. షెడ్లపైన ఏర్పాటుచేసిన సోలార్ ప్యానెల్స్ వల్ల ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను ప్రభుత్వానికి అమ్మేలా ఏర్పాట్లుచేస్తున్నాం అని పేర్కొన్నారు. 4 ఏండ్లలోనే సభ్యుల ఆదాయం తిరిగి వస్తుందని, ఇప్పటికే హైదరాబాద్‌లోని మటన్‌షాపుల సంఘాలతో మాట్లాడామని, మాగ్నస్ పేరుతో బ్రాండెడ్ మటన్‌షాపులు ఏర్పాటు చేసేందుకు వారు ఉత్సాహం కనబరిచారని ఏఎల్‌ఎన్‌రెడ్డి వివరించారు. జీవాల ఎంపిక మొదలు వాటి సంరక్షణ, మాంసాన్ని అమ్మడం వరకు తామే బాధ్యత తీసుకుంటున్న నేపథ్యంలో కాంట్రాక్ట్ ఫార్మింగ్‌పై అనేకమంది ఆసక్తి చూపిస్తున్నారని ఆయన తెలిపారు.
కేసీఆర్ ఉత్సాహం నింపారు..
తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణయం తనలో ఎంతో ఉత్సాహాన్ని నింపిందని ఏఎల్‌ఎన్ రెడ్డి హర్షం వ్యక్తంచేశారు. గొర్రెల పెంపకం ఓ పారిశ్రామిక విధానం అన్నది సరైనదేనా అని మొదట్లో కొందరు సందేహం వ్యక్తంచేశారు. కానీ తెలంగాణ సీఎం కేసీఆర్ జీవాల పెంపకం ఆవశ్యకతను సవివరంగా వివరించిన తీరు, దాదాపు రూ.400 కోట్లు ఇందుకు కేటాయించడంతో సందేహం వ్యక్తంచేసిన వారే నా ప్రయత్నాన్ని అభినందించడం ప్రారంభించారు. ప్రఖ్యాత నాబార్డ్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ సంస్థ సాంకేతిక సహాయాన్ని అందిస్తామని వెల్లడించడం మనోధైర్యాన్ని మరింత పెంచింది. ఇంతేకాకుండా జెడ్డాకు చెందిన వాణిజ్య విభాగం ఉపాధ్యక్షుడు మా వ్యాపార ఫార్ములా నచ్చి మాంసాన్ని దిగుమతి చేసుకుంటామని ప్రకటించడంతో గొర్రెల పెంపకం ఒక సక్సెస్‌ఫుల్ ఫార్ములా అనే ధైర్యం వచ్చింది అని ఆయన వివరించారు.
 
స్థానిక అవసరాలే తీరడం లేదు..
ఓ సర్వే ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 98శాతం మాంసాహారులు ఉన్నారు. ఆదివారం వచ్చిందంటే ఒక్క హైదరాబాద్‌లోనే లక్ష కిలోలకు పైగా మటన్ విక్రయాలు జరుగుతున్నాయి. మాంసానికి ఏటా 8నుంచి 10శాతం డిమాండ్ పెరుగుతున్నది. ప్రస్తుత అవసరాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ఏటా 97.50 లక్షల గొర్రెలు, మేకలు కావాలి. కానీ అందుబాటులో ఉన్నది 35 లక్షలు మాత్రమే. గత ఏడాది నుంచి తెలంగాణ ప్రభుత్వం గొర్రెల పంపిణీ చేయడం వల్ల మరో 50 లక్షల గొర్రెలు అందుబాటులోకి వచ్చాయి. దాదాపు 15 లక్షల జీవాల డిమాండ్ ఇంకా ఉంది. మరోవైపు హైదరాబాద్‌కు చెందిన దక్కనీ రకం మటన్ ఎగుమతికి భారీ డిమాండ్ ఉంది. వివిధ దేశాల నుంచి మన వ్యాపారుల దగ్గర మటన్ కొనేందుకు ఆసక్తిని చూపిస్తున్నరు 
తెలంగాణ లో ఉన్న మన యాదవసోదరులు అందరు ఒక నారాయణ రెడ్డి లాగా తయారవ్వాలని కోరుకుందాం అంతే గాని పిచ్చి పోస్టులు పెట్టి పలుచన అవ్వడం తప్పా మరేం లేదు …అని మీకు చెబుతున్నాం …
Top