You are here
Home > Telangana > కేటీఆర్ కు వస్తున్న అవార్డులతో ఆగమవుతున్న రేవంత్…

కేటీఆర్ కు వస్తున్న అవార్డులతో ఆగమవుతున్న రేవంత్…

Spread the love

రేవంత్ రెడ్డీ అసూయ ఆరోగ్యానికి అంత మంచిది కాదు.అందులోనూ మగవాళ్ళలో ఈ లక్షణం ఉండడం చాలా ఎబ్బెట్టుగా ఏదోలా,..ఎలా చెప్పాలి,చాలా అసహ్యంగా ఉంటుంది.పని చేసేవాళ్ళకు అవార్డులు రావడం సహజం,అవార్డులు వాళ్ళను వదిలేసి,తారా చౌదరి రికమండ్ చేసినవాళ్ళకు,ఎం.ఎల్.ఏ.లను దొంగచాటుగా కొనే ప్రయత్నం చేసి  దొరికిపోయి జైలుకు పోయినవారికి వస్తాయా?అవార్డు రాడవడం వల్ల ప్రతిష్ట పెరగడం కామన్.ఇక్కడ నీకు ఇంకోమాట చెప్పాలి,ఇందులో అవార్డ్ ఇచ్చేవాళ్ళ ప్రతిష్ట ,ఆ సంస్థ యొక్క రెప్యుటేషన్ కూడా పెరుగుతుంది. అవార్డ్ కొరకు ఒక వ్యక్తిని  ఎంపిక చేయడానికి పాటించిన విధివిధానాలు,కూడా  లెక్కలోకి వస్తాయి.ఏ వ్యక్తికైతే అవార్డు ఇవ్వాలని అనుకున్నారో,ఆ రంగంలో ఆ వ్యక్తి  సాధించిన విజయాలు,ఆయన పడ్డ శ్రమ,చూయిస్తున్న  ఫలితాలు,వీటన్నింటినీ పరిగణంలోకి తీసుకుని ఇస్తారు.అంతేతప్ప నీలాంటి,నాలాంటి వారికి ఇస్తే వాళ్ళ సంస్థ పేరుప్రతిష్టలు నీ భాషలో చెప్పాలంటే సంకనాకిపోతాయి.

కేటీఆర్ ఆ అవార్డుకు అన్నివిధాలా సమర్థుడు.ఆయనేమీ ఆ అవార్డుకు దరఖాస్తు పెట్టుకోలేదు.ఇంకా చెప్పాలి అంటే, తెలంగాణలో ఐ.టీ.పరిశ్రమను తన వినూత్నమైన ఆలోచనలతో కొత్త పుంతలు తొక్కించాడు.విప్లవాత్మకపైన మార్పులు తేచ్చాడు .టీ.ఎస్.ఐ.పాస్ ఇదొక సంచలనం,పారిశ్రామిక వేత్తలకు పరిశ్రమలు నేలకోలపడానికి  అన్ని రకాల  అనుమతులను కేవలం పదిహేను రోజుల్లో ఇవ్వడం,దానివల్ల పారిశ్రామిక వేత్తకు  ప్రభుత్వ శాఖల చుట్టూ తిరగడం,వాడు పీడించడం,వీడు పీడించడం,డబ్బులు దండుకోవడం,కావాలని తిప్పించుకోవడం,లంచాలు ఇవ్వడం ఇవన్నీ తప్పిపోయాయి.దేశావిదేశాలు తిరిగి గూగుల్,అమెజాన్,ఊబర్  లాంటి పేరు మోసిన కంపెనీలను హైదరాబాద్ కు తీసుకురావడం,దానివల్ల ప్రైవేటు వ్యవస్థలో ఉద్యోగాల కల్పన జరిగింది.టీ,హబ్ పేరిట ఔత్సాహికులైన యువ పారిశ్రామిక వేత్తలకు అవకాశాలు కలిపించడం,ఇవన్నీ మన కళ్ళ ముందే జరిగాయి.అలాంటి వ్యక్తికి ఈ అవార్డు రాకపోతేనే ఆశ్చర్యపోవాలి.

నువ్వేమో వీటిని రవీంద్రభారతిలో ఇచ్చే ప్యాకేజీ అవార్డుల కింద జమ చేసావు.సరే,ఎవరి అనుభావాలు,ఎవరి పరిధి,ఎవరి మ్యాచురిటీ లెవల్స్ ప్రకారం వాళ్ళు మాట్లాడతారు.అందులో నీ తప్పేమీ లేదు.నీకు ఇంకా చాలా విషయాలు చెప్పాలి,భారతీయ చత్ర సంసద్ పేరు విన్నావా?అదే పూనే లో ఉంటుంది,ఆ సంస్థ చంద్రబాబునాయడు కు `ఆదర్శ ముఖ్యమంత్రి`,అవార్డ్ ఇచ్చింది,ఈయనా పుచ్చుకున్నాడు.పోనీ USIBS పేరు విన్నావా?అది మళ్ళీ మీ నాయకుడు చంద్రబాబు నాయుడుకు `ట్రాన్స్ఫర్ మేటివ్ చీఫ్ మినిస్టర్ `,అవార్డు తో సత్కరించింది.అలాగే ఏపీ.స్టేట్ ఆఫ్ ది ఈయర్ అవార్డ్ కూడా వచ్చింది,అంతేనా అంటే ఇంకా ఉంది చికాగో స్టేట్  యునివర్సిటీ చంద్రబాబునాయుడు కు డాక్టరేట్ అవార్డ్ ప్రదానం చేసింది.అయితే అసలు కథ ఇక్కడే మొదలయ్యింది,నిజానికి అక్కడ రెండు యూనివర్సిటీలు ఉన్నాయి,ఒకటి యునివర్సిటీ ఆఫ్ చికాగో,అది చాలా ప్రతిష్టాత్మకమైనది,మొదటి పది ర్యాంకుల్లో ఉంటుంది,రెండవది,చికాగో స్టేట్ యునివర్సిటీ ,ఇది సి గ్రేడ్ యునివర్సిటీ,పూర్తిగా అప్పుల్లోకి కూరుకుపోయి స్టాఫ్ జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లోకి చేరింది.ఇదిగో ఈ యునివర్సిటీ నే నాయుడు సార్ కు డాక్టరేట్ ఇచ్చింది.పోయి,పోయి చంద్రబాబుకే ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అంటే అందులో దేవిశ్రీ పొట్లూరి అని మీవోడే కీలక స్థానంలో ఉన్నాడు,చంద్రబాబు ఏమైనా ఆర్ధిక సహాయం చేయకపోతాడా దానితో యునివర్సిటీ దరిద్రం తీరిపోతుంది అని భావించి,చంద్రబాబు అనుమతితో ఇప్పించాడు.ఇదీ అసలు కథ.ఇప్పుడు చెప్పు రవీంద్రభారతి ప్యాకేజీ అవార్డుల  బ్యాచ్ ఏదో?

Top