You are here
Home > Latest News > కేసీఆర్‌.. దూకుడు తో బెంబేలెత్తుతున్న‌బాబు..

కేసీఆర్‌.. దూకుడు తో బెంబేలెత్తుతున్న‌బాబు..

Spread the love

 

  1. తెలంగాణాకు తీసుకొస్తున్న నిధుల‌ను చూసి కుళ్లు మోతుత‌నం..
  2. బాబు వైఖ‌రిపై ప్ర‌జ‌ల్లో తీవ్ర ఆగ్ర‌హం..
  3. రాబోయే ఎన్నిక‌ల్లో ఓడ‌గొడుతామ‌ని ప్ర‌తిజ్ఞ...

తెలంగాణలోని 17 ఎంపీ సీట్లలో గెలిచి ఏం సాధిస్తారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అపహాస్యం చేయడం ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాబోయే పార్ల‌మెంట్ ఎన్నికల్లో ఏపార్టీ కూడా స్ప‌ష్ట‌మైన మెజారిటీ రాదని, ఈక్ర‌మంలో  17 సీట్లు ఉన్నప్పటి కూడా చక్రం తిప్పే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల కర్ణాటకలో మనం చూశాం. జేడీఎస్ నేత‌ కుమారస్వామి కేవలం 35 సీట్లతో సీఎం సీటు పొంద‌డంతో అధికారం వ‌చ్చాడా లేదా అని ప్రశ్నిస్తున్నారు. సంకీర్ణ స‌ర్కార్లు  కేంద్రంలో ఏర్పడుతున్న క్ర‌మంలో ఇందులో ఎన్ని సీట్లు వ‌చ్చినా కూడా చక్రం తిప్పే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు. ఈ ఎన్డీఏ స‌ర్కార్‌లో కేవ‌లం ఒక్క‌సీట్‌తో మ‌హారాష్ట్ర‌కు చెందిన ఓ పార్టీ నేత కేంద్ర మంత్రి అయ్యాడ‌ని అభిప్రాయ ప‌డుతున్నారు.  కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ లో నువ్వు నాలుగు ఏళ్ల‌ పాటు అధికారంలో ఉండి ఏం పీకలేకపోయావ‌ని, అయితే  కేంద్రంలో అధికారంలో లేకున్నా ఇప్పటికి కూడా తెలంగాణ‌ సీఎం కేసీఆర్ రాష్ట్రానికి ఎన్నో పనులు, నిధులు తీసుకొచ్చార‌ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.

అసలు రాబోయే ఎన్నికల్లో ఏర్ప‌డే సంకీర్ణ సర్కారు  17 సీట్లకు కూడా ఎంతో ప్రాముఖ్యత లభించ నుందని గుర్తు చేస్తున్నారు. 1985లో కేవలం 35 సీట్లతో ఎన్టీరామారావు ప్రతిపక్ష హోదా సాధించలేదా అని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. కేంద్ర రాజకీయాల్లో ఏదైనా సాధ్యం అని ఇక్కడ నెంబర్ ముఖ్యం కాదని ఆత్మవిశ్వాసమే ముఖ్యమైన ఈ సందర్భంగా పేర్కొంటున్నారు. గ‌తంలో వీపీ సింగ్‌, ఐకే గుజ్రాల్‌, దేవేగౌడ‌లాంటి నేత‌లు ఎలా ప్ర‌ధానులు అయ్యార‌ని, వాళ్ల‌కు అప్పుడు వ‌చ్చిన సీట్లు ఎన్ని అని ఈ సంద‌ర్భంగా చంద్రబాబుకు గ‌డ్డిపెడుతున్నారు.  ఫెడ‌ర‌ల్‌ఫ్రంట్‌కు దేశవ్యాప్తంగా లభిస్తున్న ఆదరణ చూసి చంద్రబాబు నాయుడు కుళ్లుకుంటున్నారని ఈ సందర్భంగా అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ఒడిశా పశ్చిమ బెంగాల్ ఉత్తరప్రదేశ్, ఢిల్లీలో నేతలతో మంతనాలు జరిపి సానుకూల ఫలితాలు కేసీఆర్ పొందారని తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు. కెసిఆర్ కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పనున్నట్లు గ్రహించి తన కుల మీడియాలో బాబు ఈ సందర్భంగా కండ‌కావ‌రాన్ని ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తోంది.మరోవైపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో కేసీఆర్ clean sweep చేస్తారని అదేవిధంగా ఏపీలో చంద్రబాబు నాయుడు ఘోర పరాజయం పాలవుతారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ఈ క్రమంలోనే సహనం కోల్పోయిన చంద్రబాబు నాయుడు తన చిత్తానికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని తెలుస్తోంది.

Top