You are here
Home > Latest News > కేసీఆర్ మాత్రమే తెలంగాణ తెచ్చారని ఒప్పుకున్నట్టే కదా!

కేసీఆర్ మాత్రమే తెలంగాణ తెచ్చారని ఒప్పుకున్నట్టే కదా!

Spread the love

డీకే అరుణ కాంగ్రెస్ లో సీనియర్ నేత. మాజీ మంత్రి కూడా. అలాంటి ఆమె.. తన స్థాయికి తగిన మాటలు మాట్లాడితే బాగుండేది. కేసీఆర్ ను ఉద్యమంలో భాగంగా అరెస్ట్ చేయలేదని అబద్ధాలు చెబితే.. ఆమె ఉద్యమానికి ద్రోహం చేసినట్టే. ఎందుకంటే.. కాంగ్రెస్ ప్రభుత్వమే కేసీఆర్ దీక్షను అడ్డుకుంది.. అరెస్ట్ చేసింది.. జైల్లో పెట్టింది. అందుకే.. కేసీఆర్ ఆమరణ దీక్ష చేయాల్సి వచ్చింది. అదే.. ఆఖరికి తెలంగాణ సాధించి పెట్టింది.

ఇప్పుడు జరిగిన సంఘటన వేరు. అప్పుడు సబ్బండ వర్ణాలు ఏకమై తెలంగాణ కోసం కొట్లాడినయ. ఇప్పుడు.. కొన్ని దశాబ్దాల నుంచి పెండింగ్ లో ఉన్న డిమాండ్ ను సాధించుకునే క్రమంలో.. మాదిగ సోదర సోదరీమణులు ఉద్యమం చేస్తున్నారు. వారు ప్రశాంతంగా ఉన్నంత వరకూ ఎవరూ ఏమీ అనలేదు. కానీ.. ఉన్నఫళంగా విధ్వంసానికి దిగడంతోనే పోలీసులు నేతలను అదుపులోకి తీసుకున్నారు. నగరంలో ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతున్న వేళ.. అలా విధ్వంసం సృష్టించడం తప్పు. ఆ విషయం ఓ నాయకురాలిగా డీకే అరుణకూ తెలుసు.

అలాంటిది.. మందకృష్ణను అరెస్ట్ చేయడం తప్పు అని ఎలా మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే.. తామే తెలంగాణ తెచ్చామని.. సోనియానే తెలంగాణ ఇచ్చిందని అబద్ధాలు చెప్పుకునే కాంగ్రెస్ నేతలు.. ఇక్కడ నిజాలు మాట్లాడడాన్ని స్వాగతించాలి. అది ఏంటంటే.. మిలియన్ మార్చ్ సందర్భంగా కేసీఆర్ ను అరెస్ట్ చేసి ఉంటే.. తెలంగాణ వచ్చి ఉండేదా అని వారు ప్రశ్నిస్తున్నారు. అంటే.. కేసీఆర్ పోరాటం కారణంగానే తెలంగాణ సాధ్యమైందని వారు ఒప్పుకున్నట్టే కదా.

అందుకే.. ఇలా ఏది పడితే అది నోటికి వచ్చినట్టు మాట్లాడితే.. డ్యామేజ్ అయ్యేది కాంగ్రెస్ నేతలకే. ఈ వాస్తవం.. వారికి ఎప్పుడు అరథమవుతుందో.. ఏమో.

Top