You are here
Home > Latest News > కోదండరాం.. అధికార దాహంతో పార్టీ పెట్టిన నువ్వా తెలంగాణ సంక్షేమం గురించి మాట్లాడేది..?

కోదండరాం.. అధికార దాహంతో పార్టీ పెట్టిన నువ్వా తెలంగాణ సంక్షేమం గురించి మాట్లాడేది..?

Spread the love

 

  • అడ్డగోలుగా మాట్లాడేది నువ్వు…
  • ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాల్సింది నువ్వు..
  • ఏ ఉద్దేశంతో నువ్వు పార్టీ పెట్టావో తెలంగాణ సమాజానికి తెలుసు..

కోదండరాం.. కష్టపడి సాధించుకున్న తెలంగాణను ఇష్టపడి అభివృద్ధి చేసుకుంటున్నం. ఎందుకు కోదండరాం.. తెలంగాణ అభివృద్ధిలో వేలు పెడుతున్నావు. తెలంగాణను సాధించుకున్నది ఎందుకు. మన ప్రాంతాన్ని దశాబ్దాల పాటు పాలించిన కాంగ్రెస్ పార్టీ నట్టేట ముంచింది. అభివృద్ధి అంటేనే తెలియకుండా చేసింది. అలా జరగకూడదనే తెలంగాణను సాధించుకున్నాం. ఇప్పుడు అభివృద్ధి చేసుకుంటున్నాం. తెలంగాణ నాలుగేండ్ల క్రితం ఎలా ఉంది.. ఇప్పుడెలా ఉందో నీకు తెలియకపోవచ్చు కాని తెలంగాణ సమాజానికి తెలుసు.

నువ్వు పార్టీ ఎందుకు పెట్టావో ఎవరికి తెలియదు. స్వంత లాభం కోసం, తెలంగాణలో అధికారం కోసం నువ్వు పార్టీ పెట్టావు. పార్టీ పెట్టిన వాడివి అధికారం కోసం పాకులాడవా? తెలంగాణ ప్రజల్లో టీఆర్ఎస్ ప్రభుత్వంపై వ్యతిరేకత తీసుకువచ్చి తెలంగాణలో పాగా వేద్దామనుకుంటున్నావా? తెలంగాణ ప్రజలేమన్నా అమాయకులు అనుకుంటున్నావా? వాళ్లకు తెలియదా ఎవరు ఎటువంటి వాళ్లో? ఎవరిని గెలిపించాలో వాళ్లే డిసైడ్ చేస్తరు?

తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన నాలుగేండ్లలోనే తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా ఎదిగింది. ఇదంతా ఎలా సాధ్యమయింది. సీఎం కేసీఆర్ దూరదృష్టి వల్ల, తెలంగాణలో ప్రవేశపెట్టిన పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయి. తెలంగాణ ప్రభుత్వాన్ని, సీఎం కేసీఆర్ ను ప్రపంచం పొగుడుతున్నది. అయినప్పటికీ.. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి మీకు కానొస్తలేదంటే ఏమనాలి మిమ్మల్ని. తెలంగాణ ద్రోహిగా మిగిలిపోతున్నావు నువ్వు కోదండరాం. నీలాంటి వాళ్లు తెలంగాణకు అవసరం లేదు. తెలంగాణ అభివృద్ధిని కోరుకోని వాళ్లకు తెలంగాణలో ఉండే హక్కు లేదు. నువ్వు, నీ పార్టీ గంగలో కలిసిపోయే రోజు తొందరలోనే ఉంది.

Top