You are here
Home > Latest News > కోదండరాం కుట్ర.. కొత్త దారికి మళ్లింది!

కోదండరాం కుట్ర.. కొత్త దారికి మళ్లింది!

Spread the love

కుట్రల కోదండరాం.. తన దృష్టిని మరల్చాడు. అమరుల స్ఫూర్తి యాత్ర అన్నాడు. అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. కొలువుల కొట్లాట అన్నాడు. నిరుద్యోగుల ఆగ్రహంలో కొట్టుకుపోయాడు. ఇప్పుడు.. కొత్త సచివాలయ నిర్మాణంపై పడ్డాడు.. త్వరలో నిర్మాణానికి సిద్ధమవుతున్న ఆ భవన పునాదుల్లో తన రాజకీయ భవిష్యత్తును కూరుకుపోయేలా చేసేందుకు సిద్ధమయ్యాడు. పాత సచివాలయ భవనాన్ని కూడా ప్రభుత్వ అవసరాలకే వాడుకుంటామని ముఖ్యమంత్రి చెబుతున్నా కూడా పట్టించుకోకుండా.. పాత భవనంపై సీఎం కన్నుపడిందంటూ తప్పుడు కూతలు కూస్తున్నాడు.

సీపీఐ రాష్ట్ర కమిటీ చేస్తున్న పోరుబాట యాత్ర బహిరంగ సభ.. కొత్తగూడెంలో జరిగితే.. అక్కడికి వెళ్లి ఈ మాటలన్నీ మాట్లాడాడు. హైదరాబాద్ లో మాట్లాడితే ఎవరూ పట్టించుకోవడం లేదు కాబట్టి.. అలా పిలవగానే ఇలా కొత్తగూడెం వెళ్లి.. అక్కడ తన నోటి ప్రతాపాన్ని చూపించాడు. దీంతో.. ఒకప్పుడు పాఠాలు చెప్పిన పంతులేనా.. ఇప్పుడిలా అబద్ధాలు మాట్లాడుతున్నదీ.. అనుకుంటూ.. ప్రజలు తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు.

ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలనూ అభివృద్ధి బాటలో నడిపిస్తున్నా.. అదేదీ పట్టించుకోకుండా.. తానేదో మంచి చేస్తున్నట్టుగా.. ప్రభుత్వానికి సుద్దులు చెబుతున్నా పట్టించుకోనట్టుగా.. ఓ మాష్టారు పాఠం చెబితే వినకుండా ఫెయిలైన విద్యార్థిలా ప్రభుత్వం వ్యవహరిస్తున్నట్టుగా.. రకరకాల భాషణాలు అల్లుతూ.. తన ప్రసంగ ప్రావీణ్యాన్ని అనేక రకాలుగా చూపించుకునే ప్రయత్నం చేసి.. ఘోరంగా ఫెయిలైపోయాడు.

ఇదంతా చూసి.. ఎప్పటిలాగే.. జనం నవ్వుకున్నారు. కోదండరాం ఇంతే… అనుకుంటూ తమ పనిలో తాము మునిగిపోయారు. సభ నిర్వహించిన సీపీఐ నేతలు చెప్పిన మాటలనైతే.. అసలు పట్టించుకోవాల్సిన అవసరమే లేదని తేల్చి చెబుతున్నారు.

Top