You are here
Home > Uncategorized > కోదండరాం తాడూ బొంగరం లేనోడు.. నిజమే కదా!

కోదండరాం తాడూ బొంగరం లేనోడు.. నిజమే కదా!

Spread the love

కోదండరాం తాడూ బొంగరం లేనోడు.. నిజమే కదా!
అవును. నిజమే కదా. ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నదాంట్లో తప్పేముంది? తాడూ బొంగరం లేనోడు.. ఇవాళ తప్పుడు కూతలు కూస్తుంటే.. నిజాలు చెప్పిన ముఖ్యమంత్రిని తప్పుబడతారా? ఓ సారి చరిత్రను తెలుసుకోండి. దిక్కూ దివానం లేని కోదండరాంను పిలిచి మరీ గౌరవించి.. నాయకుడిని చేసింది.. మన ముఖ్యమంత్రి కేసీఆర్.

అసలు.. పొలిటికల్ జేఏసీ అనే సంస్థను ఏర్పాటు చేయించి.. దాని వెనక ఉండి తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటాన్ని నడిపించిన మన ముఖ్యమంత్రి కేసీఆర్.. గతంలో కోదండరాంను పిలిచి.. పొలిటికల్ జేఏసీ చైర్మన్ పదవిని ఇప్పించారు.

తర్వాత.. వరంగల్ గర్జన సభ. తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో ఓ మైలు రాయి. పది లక్షలకు పైగా జనాలు హాజరై.. తెలంగాణ కోరికను ఎలుగెత్తిన మరపురాని సందర్భం. అప్పుడు కూడా.. కోదండరాం అంటే ఎవరో తెలియదు. ఆయన ఎక్కడున్నాడు.. అసలు ఏం చేస్తున్నాడన్నదీ జనం ఆలోచనలోనే లేదు. అప్పుడు కూడా.. కోదండరాంను పిలిపించి.. నాయకుడిని చేసి.. రాజకీయంగా ఓ జీవితాన్ని ప్రసాదించిన నేత.. మన కేసీఆర్.

అంతెందుకు.. ఇప్పుడు.. తెలంగాణ వచ్చిన తర్వాత.. కాంగ్రెస్ కుట్రలకు పావులా మారుతున్నది కోదండరాం అన్నదాంట్లో ఏమైనా అబద్ధం ఉందా? కోదండరాం సహాయం లేకుండానే.. ఆయన కొడుకు కాంగ్రెస్ లో నాయకుడిగా ఎదుగుతున్నాడా? అమెరికాలో రాహుల్ గాంధీ పర్యటిస్తే.. ఆయన పర్యటన ఏర్పాట్లు అన్నీ కోదండరాం కొడుకు దగ్గరుండి చూసుకున్నది నిజం కాదా?

ఇవన్నీ.. కాంగ్రెస్ అండతో చేసుకుంటున్న కోదండరాం.. తనకు తాడూ బొంగరం లేకనే.. కదా.. కొడుకును రాజకీయంగా ఎదిగేలా చేసి.. తనకు రాజకీయంగా ఓ అండ చూసుకుంటున్నది. ఇన్ని నిజాలు కళ్ల ముందు కదలాడుతున్నాయి కాబట్టే.. కోదండరాం గురించి.. ముఖ్యమంత్రి కేసీఆర్ నిజాలు మాట్లాడారు. నాయకుడి స్థాయికి తగని వాడిని తెచ్చి నెత్తిన పెట్టుకున్నారు.

కానీ.. కనకపు సింహాసనమున అన్నట్టు.. కోదండరాం తన తోక వంకర అని నిరూపించుకుంటూనే ఉన్నారు. తెలంగాణ వ్యతిరేకులకు, అభివృద్ధిని అడ్డుకుంటున్నవారికి వంత పాడుతూ.. చరిత్రహీనుడిగా మిగులుతున్నారు. మంచి చేయరా బాబూ.. అండగా ఉంటామని చెబుతూ.. తాడూ బొంగారాన్ని అందిస్తే.. అవి వద్దు నాకు నేనే తిరుగుతా అంటూ బొక్కబోర్లా పడుతున్నాడు.. కోదండరాం.

ఇవన్నీ చూశారు కాబట్టే.. ఇప్పుడు కోదండరాం తాడూ బొంగరం లేనోడు అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఇంకా చాలా ఉంది. కోదండరాం.. ఎన్నడూ రాష్ట్ర సంక్షేమం కోసం పని చేయలేదు. ఉద్యమంలో కూడా.. ఢిల్లీకి వెళ్లి.. తెలంగాణను అడ్డుకుంన్న.. పదేళ్లుగా తెలంగాణ ఏర్పాటును ఆలస్యం చేసిన కాంగ్రెస్ కు, ఆ పార్టీ అధినేత్రికి దొంగచాటుగా రిపోర్టులు ఇచ్చుకుంటూ వచ్చాడు. చరిత్రలో మాయని మచ్చలా నిలిచిపోయే ఈ విషయం నిజం కాదు అని కోదండరాం కానీ.. ఆయన పక్కన ఉన్న దొంగల బ్యాచ్ కానీ చెప్పగలరా?

వరుసగా తప్పులు చేస్తూ.. ఏ అండా లేక దిక్కూ మొక్కూ లేక ఇబ్బంది పడుతున్న కోదండరాం.. తన పక్కన ఓ యాభై మంది సో జీతగాళ్లను వెంటబెట్టుకుని.. తప్పుడు మాటలు మాట్లాడిస్తూ.. తను కూడా తప్పులు చేస్తూ.. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్నది.. సంక్షేమ కాముక ప్రభుత్వానికి సమస్యలు సృష్టిస్తున్నదీ నిజం కాదా?

అందుకే.. తనకు తానుగా తాడూ బొంగరం లేనోడు కాబట్టే.. ఇట్లాంటి కుట్రలు చేస్తూ.. తనకు ఓ ఇమేజ్ ను బిల్డప్ చేసుకునేందుకు కోదండరాం ప్రయత్నిస్తున్నట్టు.. ముఖ్యమంత్రికే కాదు.. సామాన్య జనానికి కూడా అర్థం అవుతోంది. పైకి.. కాంగ్రెస్ ను వాడుకుంటూ.. తనకు తాను విష రాజకీయాలు చేస్తూ.. జనంలోదోషిగా మిగులుతూ.. చరిత్రహీనుడిగా పేరు తెచ్చుకుంటున్నాడు కాబట్టే.. కోదండరాంను ముఖ్యమంత్రి కేసీఆర్ అలా అన్నారు.

ఇవన్నీ వింటుంటే.. నిజంగా కేసీఆర్ తాడూ బొంగరం లేనోడే అన్న వాస్తవం మిగిలిన ఆ కొద్ది మందికీ అర్థమైపోతుంది. ఇన్నాళ్లూ.. పొలిటికల్ జేఏసీ చైర్మన్ అనిపించుకున్న కోదండరాం.. కొన్నాళ్లుగా ఏజెంట్ కోదండరాం అయిపోయాడు. కాంగ్రెస్ కు నీడలా నడుస్తూ.. తనకు తాను నాయకుడిగా ఎదిగే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు.. తన చేతలతోనే ఇలా తాడూ బొంగరం లేనోడుగా.. చరిత్ర హీనుడిగా మిగిలిపోతున్నాడు.

Top