You are here
Home > Latest News > కోదండరాం నిజ స్వరూపాన్ని బయటపెట్టుకున్నాడు

కోదండరాం నిజ స్వరూపాన్ని బయటపెట్టుకున్నాడు

Spread the love

వారసత్వ ఉద్యోగాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ తన చిత్తశుద్ధిని నిరూపించుకుంటుంటే.. దాన్ని పదే పదే తప్పుబడుతూ.. ఏజెంట్ కోదండరాం తన బుద్ధిని బయటపెట్టుకుంటున్నాడు. సింగరేణి కార్మికులకు సంక్షేమ ఫలాలు అందించేందుకు ఓ వైపు ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతుంటే.. గనులను ప్రయివేటు పరం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ కార్మికుల మనసుల్లో విషం నింపే ప్రయత్నం చేస్తున్నాడు.

కార్మికులకు భరోసా ఇచ్చేందుకు తనే స్వయంగా ప్రకటనలు చేస్తుంటే.. సీఎం కేసీఆర్ ఎందుకు జోక్యం చేసుకుంటున్నాడు.. అంటూ తప్పులు వెతుకుతున్నాడు. సింగరేణి తల్లి లేకుంటే.. జీవితంలో అణిచివేయబడేవాళ్లం అంటూ.. మాట్లాడుతున్న కోదండరాం.. ఆ సింగరేణి గనులకు ఏం చేశాడన్నదీ చెప్పలేకపోయాడు. ఏదో ఆశిస్తూ.. ఏదో కోరుకుంటూ.. కొందరి తప్పుడు ప్రయత్నాలకు మద్దతుగా ఉంటూ.. కేవలం టీఆర్ఎస్ కు మాత్రమే వ్యతిరేకంగా మాట్లాడాడు.

గతంలో కాంగ్రెస్ నాయకులు చేసిన తప్పిదాలను మాట కూడా ప్రస్తావించడం లేదు. కార్మికులకు మందు పోసి.. మాయ చేసి టీఆర్ఎస్ నేతలు కుట్ర చేస్తున్నారని అన్నాడు. ఈ మాటతో.. కార్మికుల ఆత్మాభిమానాన్ని దెబ్బ తీశాడు. మందుకు, ముక్కకూ, చుక్కకూ అమ్ముడుపోయేవాళ్లమా మేము.. మా గురించి ఇంతగా తప్పుడు కూతలు కూస్తారా అంటూ.. ఆవేదన చెందుతున్నారు. మాట మాటకూ.. అధికార పక్షాన్ని ఓడిద్దాం.. అంటూ మాట్లాడుతున్న కోదండరాం.. మరి ఎవరికి ఓటు వేయాలన్న మాటను ప్రస్తావించే సాహసం కూడా చేయలేకపోతున్నాడు.

బహిరంగంగా కాంగ్రెస్ కు మద్దతు పలకలేక.. బహిరంగంగా కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్న సంస్థకు ఓటు వేయండి అని చెప్పలేక.. కేవలం అధికార పక్షాన్ని మాత్రమే తప్పుబడుతూ కార్మికులకు తప్పుడు పిలుపులు ఇస్తున్నాడు కోదండరాం. ఇదొక్కటి చాలదా.. ఆయన కాంగ్రెస్ ఏజెంట్ అనేందుకు? ఇదొక్కటి చాలదా.. కోదండరాం పని ప్రభుత్వానికి వ్యతిరేకంగా పని చేయడమే అని చెప్పేందుకు?

అందుకే.. కోదండరాంకు ప్రజలు, సింగరేణి కార్మికులు ఓ మాట స్పష్టం చేస్తున్నారు. తన నిజస్వరూపాన్ని తనే బయటపెట్టుకున్న కోదండరాం.. ఇప్పటికైనా తీరు మార్చుకోకుంటే.. తగిన శాస్తి అనుభవించడం తప్పదని హెచ్చరిస్తున్నారు.

Top