You are here
Home > Latest News > కోమటిరెడ్డి తలపెట్టిన `చలో అసెంబ్లీ`,జస్ట్ ఒక ఎన్నికల స్టంట్.

కోమటిరెడ్డి తలపెట్టిన `చలో అసెంబ్లీ`,జస్ట్ ఒక ఎన్నికల స్టంట్.

Spread the love

ఏమిటో కోమటిరేడ్డీ నువ్వెప్పుడు ఎలా మాట్లాడతావో,ఎవరిని పోగుడుతావో,ఎవరిని తిడతావో ఎవ్వరికీ అర్థం కాదు,అప్పుడే కేసీఆర్ లాంటి గొప్ప నాయకుడు ఎవరూ లేరు,కేసీఆర్ ది చాలా పెద్ద మనసు.అడిగిన వెంటనే SLBC,ఉదయసముద్రం ప్రాజెక్టు ల నిర్మాణానికి నిధులను విడుదల చేసాడు. సిఎం కెసిఆర్ సహకారంతో నల్గొండ జిల్లాను అభివృద్ధిలో ముందంజలో ఉంచుతానని అని ఒకసారి,అసెంబ్లీలో ప్రాజెక్టులపై కేసీఆర్ ఇచ్చిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అద్భుతమని,ప్రాజెక్ట్ లపై కేసీఆర్ కు ఉన్న అవగాహన చూసి మేమందరమూ ఆశ్చర్యపోయాము,ఆయనకు అభినందించకుండా ఉండలేక పోతున్నాను అని మరోసారి.ఇప్పుడేమో రైతుల గోడు పట్టని సర్కార్ అని యు టర్న్ తీసుకున్నావు.ఎన్నో దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న నల్లగొండ బత్తాయి మార్కెట్ ను కు శంఖుస్థాపన చేసింది కేసీఆర్ సర్కార్,ఆ రోజు నువ్వు చేసిన హంగామా అంతా ఇంతా కాదు,అది ఏళ్ల తరబడి నానుతున్న రైతు గోడు కాదా?దానికి కేసీఆర్ ప్రభుత్వం వెంటనే స్పందిన్చలేదా?నువ్వు ఊటంకించిన ప్రాజెక్టు ల నిర్మాణానికి విడుదల చేసిన నిధులు ఎవరికోసం,రైతుల కోసం కాదా?

వీటిలో రైతుల కొరకు చేసిన పనులే తప్ప వ్యక్తుల కొరకు చేసినవి ఏవీ లేవు?ప్రభుత్వ ఉద్యోగులకు,అడగక ముండే వేతనాలను పెంచిన సర్కార్ రైతు గోడును పట్టించుకోవడం లేదు అని ఆరోపిస్తున్నావు.వచ్చే ఏడాది నుండి ఎకరాకు నాలుగువేలు చొప్పున రెండు పంటలకు కలిపి ఎకరాకు ఎనిమిదివేల పెట్టుబడి ప్రభుత్వమే రైతులకు ఇస్తుంది అని ప్రకటించలేదా?ఉద్యోగుల జీతాల పెంపు ఒక్కసారికే అయిపోతుంది,కాని రైతులకు మాత్రం ప్రతీ ఏడాది ఠంచనుగా ఎనిమిదివేల రూపాయలు వాళ్ళ అకౌంట్ లో వచ్చి పడతాయి కదా.ఇది రైతులకు ఇస్తున్న ఇన్సెంటివ్ కాదా?దీనితో పాటే నిరంతరాయ కరంట్ ఇస్తున్నాడు,సకాలం లో విత్తనాలు ఎరువులను అందుబాటులో ఉంచుతున్నాడు,మైనర్ ఇరిగేషన్ ను మిషన్ కాకతీయ ద్వారా పటిష్టపరుస్తున్నాడు.రైతు సమన్వయ సంఘాలను ఏర్పరిచి,అయిదు వందల కోట్లతో నిధిని సమకూర్చి విపత్తులు,గిట్టుబాటు ధర రాక నష్టపోయిన రైతులకు ఆదుకోవడానికి చేయాల్సిన పనులన్నీ చేస్తూనే ఉన్నాడు కదా.

ఇందులో నీకు గోడు కనిపిస్తుందా?రైతుల మీద అంతగా ప్రేమ ఉన్నోనివే అయితే పదేళ్ళ మీ ప్రభుత్వ హయాములోనే నల్లగొండకు బత్తాయి మార్కెట్ వచ్చేది,ఒక మార్కెట్ యార్డును తేలేకపోయిన నువ్వు కేసీఆర్ ను విమర్శించడం ఒక వింత అయితే,రైతుల మీద చూయిస్తున్న నీ ప్రేమ మరో వింత.కేసీఆర్ మీద నువ్వు అప్పుడే  అతి ప్రేమ ప్రేమ చూయిస్తావు వెంటనే అతి ద్వేషం ప్రదర్శిస్తావు.దీని వెనకాల మిషన్ భగీరథ కాంట్రాక్ట్ ఫిట్టింగ్ ఉందని జనాలు చెవులు కొరుక్కుంటున్నారు.మిషన్ భగీరథ పైపుల సరఫరా కాంట్రాక్ట్ ఇస్తాడేమో అని పోగిడావు,అది వచ్చే అవకాశం లేదు అని తెలియగానే తిడుతున్నావు అని నీ జిల్లా వాసులే అంటున్నారు.ఈ `చలో అసెంబ్లీ`,ఒక ఎన్నికల స్టంట్ తప్ప అందులో ఏమాత్రం నిజాయితీ లేదు అన్న విషయం అందరికీ తెలుసు.

Top