You are here
Home > Latest News > ఖండాంతరాలకు కాళేశ్వరం ఖ్యాతి న్యూయార్క్​ టైమ్స్​లో ప్రత్యేక కథనం

ఖండాంతరాలకు కాళేశ్వరం ఖ్యాతి న్యూయార్క్​ టైమ్స్​లో ప్రత్యేక కథనం

Spread the love

ఖండాంతరాలకు కాళేశ్వరం ఖ్యాతి

న్యూయార్క్​ టైమ్స్​లో ప్రత్యేక కథనం

ప్రాజెక్టుపై ప్రశంసల వర్షం

తలలో కాస్తంత మెదడు కూడా లేని మన కాంగ్రెస్​, బీజేపీ నాయకులు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి పిచ్చిపిచ్చిమాటలు మాట్లాడుతారు. ప్రపంచంలోనే అతిపెద్దది అయిన ఈ ప్రాజెక్టు విశిష్టతలను అంతర్జాతీయ మీడియా కూడా గుర్తించింది. న్యూయార్క్​టైమ్స్​ పత్రిక కాళేశ్వరంపై శనివారం స్పెషల్​ స్టోరీ రాసింది. ఈ  బృహత్తర ప్రాజెక్ట్ ఇప్పుడు ప్రపంచాన్నే అబ్బురపరుస్తోందని, కనివినీ ఎరుగని ఈ ఇంజినీరింగ్ అద్భుతం చాలా తక్కువ సమయంలోనే సిద్ధం కావడం ఒక రికార్డు అని ప్రశసించింది. ప్రపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌గా సరికొత్త రికార్డును కూడా సొంతం చేసుకోడానికి సిద్ధమవుతోందని తెలిపింది. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ ‘గూగుల్’ సెర్చ్‌లో అతి పెద్ద  లిఫ్ట్​ ఇరిగేషన్​ ప్రాజెక్టుగా టాప్‌ స్థానంలో నిలిచింది. ఇంతకీ ఈ ప్రాజెక్టుకు ఎందుకింత ప్రాధాన్యం ఇస్తున్నారో చూద్దాం.  కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా గోదావరిలో 3 బ్యారేజీలు, 19 పంప్ హౌజ్‌లు నిర్మించారు. వందల కిలోమీటర్ల పొడవున కాలువలు నిర్మించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే 13 జిల్లాల్లో 18,25,000 ఎకరాలకు నీరందించవచ్చు. ఈ ప్రాజెక్టు ద్వారా మొత్తం 1,832 కిమీలు నీటి సరఫరా జరగనుంది. 1,531 కిమీల పొడవున కాలువలు, 203 కిమీల పొడవున సొరంగ కాలువలను నిర్మించారు. మరో 98 కిమీలు పైపులైన్లు ఏర్పాటు చేశారు. 19 పంపు హౌస్‌లు, 20 లిఫ్టులతో ఈ పథకాన్ని నిర్వహిస్తారు. ఈ ప్రాజెక్టు కోసం కొత్తగా 20 జలాశయాలు నిర్మిస్తున్నారు.

ప్రాజెక్టులో మొత్తం 225 టీఎంసీల నీటిని వినియోగిస్తారు. మొత్తం 70 వేల ఎకరాల్లో ఈ ప్రాజెక్టును చేపడుతున్నారు. నీటిని చేరవేసేందుకు నిర్మించిన సొరంగాలు, కాలువలను చెరువులు, జలాశయాలకు అనుసంధించారు.ఈ పనులను 7 లింకులు, 28 ప్యాకేజీలుగా విభజించారు.ఇది పూర్తయితే దక్షిణ తెలంగాణ వరకు గోదావరి నీరు అందుతుంది. తాగు, సాగు, పారిశ్రామిక అవసరాలు తీరుతాయి. హైదరాబాద్, షామీర్‌పేట, చిట్యాల వరకు నీళ్లు వస్తాయి. గోదావరిలో మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం ప్రాంతాల్లో బ్యారేజీలు నిర్మించారు. దిగువ ఉండే మేడిగడ్డ బ్యారేజ్ నుంచి నీటి తోడి ఎగువున ఉన్న బ్యారేజీలోకి వదులుతారు. ఈ మూడు బ్యారేజీల వల్ల గోదావ‌రిలో దాదాపు 130 కిలోమీటర్ల వరకు నిత్యం నీరు ఉంటుంది. ఈ పనుల పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ లిమిటెడ్‌ను ఏర్పాటు చేశారు.

భువిపైకి గంగమ్మ..

గోదావ‌రి నీరు వృథా కాకుండా సద్వినియోగం చేసుకునే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టును చేపట్టారు. ఇందులో భాగంగా 100 మీట‌ర్ల నుంచి 623 మీట‌ర్ల వ‌ర‌కు నీటిని ఎగువ గోదావరిపై నిర్మించిన బ్యారేజీలోకి ఎత్తిపోయనున్నారు.ఈ ప్రాజెక్టులో నీటి ఎత్తిపోసే పంపుల నిర్వహణకు 4,600 మెగావాట్ల విద్యుత్ అవసరం. ఈ ప్రాజెక్టులో నిర్మించిన సొరంగాలు, సర్జ్‌పూల్ (నీటి అడుగు జలాశయం), గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్‌స్టేషన్‌లు, భారీ పంపులు కీలక పాత్ర పోషించనున్నాయి. ఈ పథకం కోసం భూమి అడుగున పది మీటర్ల వ్యాసంతో 203 కిలోమీటర్ల మేర సొరంగాలు నిర్మించారు. నీటి తరలింపునకు ఇప్పటి వరకు ఇలాంటి సొరంగం ఎక్కడా లేకపోవడం గమనార్హం. ఈ ప్రాజెక్టులో మోటార్లు భారీ అంతస్తులను తలపిస్తాయి. వాటికి అమర్చే పంపులు చిన్న సైజు భవనాల్లా ఉంటాయి. 139 మెగావాట్ల సామర్థ్యం గల ఏడు పంపులను ఇందులో వాడుతున్నారు. ఈ ప్రాజెక్టును మొత్తం రూ.80,500 కోట్ల వ్యయంతో చేపట్టారు.గోదావరిపై అత్యంత వేగంగా పూర్తి చేసిన బ్యారేజీలుగా ఈ ప్రాజెక్టుకు గుర్తింపు లభించనుంది.

Top