You are here
Home > Latest News > గట్టు ఎత్తిపోతల పూర్తయితే నడిగడ్డలో 1.20లక్షల ఎకరాలు సస్యశ్యామలం : కేసీఆర్

గట్టు ఎత్తిపోతల పూర్తయితే నడిగడ్డలో 1.20లక్షల ఎకరాలు సస్యశ్యామలం : కేసీఆర్

Spread the love
  • గట్టు ఎత్తిపోతల పూర్తయితే నడిగడ్డలో 1.20లక్షల ఎకరాలు సస్యశ్యామలం చేస్తామని సీఎం కేసీఆర్ అన్నారు.
  • జూరాలను పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేస్తాం : సీఎం కేసీఆర్
  • నడిగడ్డ ప్రగతిసభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ..
 
జూరాల, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ ప్రాజెక్టుల తాగునీరందిస్తామన్నారు. ఇంకా ఎన్ని రిజర్వాయర్లు అవసరమో ప్రతిపాదనలు రూపొందించాలన్నారు. అవసరమైన పంప్ హౌజ్ లు, కాల్వల నిర్మాణం పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. రెండో దశలో మల్లమ్మకుంట, జూలకల్, వల్లూరు రిజర్వాయర్లు నిర్మిస్తామన్నారు.
 
జూరాలను పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేస్తామని సీఎం కేసీఆర్ అన్నారు.
తెలంగాణ వస్తే కరెంట్ కోతలు ఎక్కువ అవుతాయని గత సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అన్నారన్నారు. ఇప్పుడు కరెంట్ పోతే వార్త అవుతుందన్నారు. రైతులకు 24గంటలు ఉచితంగా కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం మనదేనన్నారు. రైతు పెట్టుబడి పథకంపై కాంగ్రెస్ వి చిల్లర రాజకీయాలన్నారు.
 
గద్వాల అభివృద్ది కోసం రూ.100 కోట్లు మంజూరు చేస్తానని సీఎం కేసీఆర్ అన్నారు. వచ్చే ఏడాది కూడా మరో 119 బీసీ గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేస్తామన్నారు. గద్వాల బస్టాండ్ అభివృద్ది కోసం రూ.2కోట్లు మంజూరు చేస్తానన్నారు. జూరాల వద్ద బృందావనం ఏర్పాటు కోసం రూ.15కోట్లు మంజూరు చేస్తామన్నారు
 
జోగులాంబగద్వాల జిల్లాల ఆస్పత్రిని 300 పడకల ఆస్పత్రిగా మారుస్తామని సీఎం కేసీఆర్ అన్నారు గద్వాల జిల్లాకు ఎస్సీ స్టడీ సర్కిల్, రెసిడెన్షియల్ పాఠశాల మంజూరు చేస్తామన్నారు. 584 మండలాల్లో బీసీ గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేస్తామన్నారు.
 
తెలంగాణకు ద్రోహం చేసిన పార్టీతో నేడు కాంగ్రెస్ నేతలు కలుస్తున్నారని మంత్రి హరీశ్ రావు అన్నారు. గత పాలకులు తెలుగుగంగ పథకం పెట్టి మద్రాసుకు నీరిచ్చారన్నారు. పాలమూరు ప్రాజెక్టుకు అడ్డుపడుతున్న చంద్రబాబుతో కాంగ్రెస్ నేతలు కలుస్తున్నారన్నారు.
అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందాలని సీఎం కేసీఆర్ అన్నారు, రాష్ట్రాన్ని పంటల కాలనీలుగా మార్చేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. మిగతా 28 రాష్ట్రాల రైతులు తెలంగాణను చూసి నేర్చుకునేలా ఎదగాలన్నారు. పరిపాలన సౌలభ్యం కోసం 10 జిల్లాలను 31 జిల్లాలుగా విభజించామన్నారు. కేసీఆర్ కిట్ల వల్ల ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు పెరిగాయన్నారు. పేదింటి ఆడపిల్లల పెళ్లికి రూ.లక్ష 116లు ఇస్తున్నామన్నారు.
దేశం మొత్తం తెలంగాణ వచ్చి అధ్యయనం చేసేలా అభివృద్ది చేస్తాం రైతులకు గిట్టుబాటు ధర రావాలంటే డిమాండ్ ఉన్న పంటనే వేయాలన్నారు. రాష్ట్రంలో విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా చేశామన్నారు. రైతులు మిగులు డబ్బులు చూసే రోజు రావాలన్నారు. రైతు సమన్వయ సమితుల ద్వారా సాగుసమాచారం పూర్తిగా ఉందన్నారు.
Top