You are here
Home > Latest News > గఫూర్.. ముస్లింలను పట్టించుకున్నదే తెలంగాణ ప్రభుత్వం..

గఫూర్.. ముస్లింలను పట్టించుకున్నదే తెలంగాణ ప్రభుత్వం..

Spread the love

 

  • గత పాలకులే ముస్లింల అభివృద్ధిని గాలికొదిలేశారు..
  • ముస్లింల అభివృద్ధి, జీవన స్థితిగతులు, సంక్షేమం, భద్రత.. అన్నింటినీ పట్టించుకున్నది సీఎం కేసీఆర్ మాత్రమే..
  • నువ్విప్పుడొచ్చి మైకు ముందు వాగితే అయిపోయిందా?

ముస్లింల అభివృద్ధి, జీవన స్థితిగతులు, సంక్షేమ, భద్రత… ఈ అంశంపై ఆవాజ్ జిల్లా కార్యదర్శి ఎస్కే లతీఫ్ అధ్యక్షతన సెమినార్ జరిగిందట. ఆ సమావేశంలో కర్నూల్ మాజీ ఎమ్మెల్యే గఫూర్ మాట్లాడాడు. ఆయనేమంటాడంటే.. ముస్లిములు అభివృద్ధి కాకపోవడానికి కారణం టీఆర్ఎస్ పాలకులు అనుసరిస్తున్న విధానాలేనట. గఫూర్.. ఒక్కసారి మనం గతంలోని వెళ్దాం. ఆ తర్వాత ప్రస్తుతంలోకి వద్దాం. మిస్టర్ గఫూర్.. గత ప్రభుత్వాలు ముస్లింల అభివృద్ధిని ఏ పాటి పట్టించుకున్నాయి? అవి ముస్లింలను గాలికి వదిలేశాయి. మరి.. నువ్వు గత ప్రభుత్వాలను ఎందుకు నిలదీయలేదు. నీకు చేతగాలేదా అప్పుడు. లేక ఇప్పుడు రెక్కలొచ్చాయా? గత ప్రభుత్వాలు ముస్లింలను ఏవిధంగా ఆదుకున్నాయో నువ్వు చెప్పాలి. వాళ్ల హయాంలో ముస్లింలు ఎంత మేర అభివృద్ధి చెందారో నువ్వు చెప్పాలి.

ఇక.. ప్రస్తుతం గురించి మాట్లాడుకుంటే.. గత అరవై ఏళ్లలో ముస్లిముల అభివృద్ధి చేతగాలేదు గత ప్రభుత్వాలకు. కానీ.. కేవలం నాలుగేళ్లలోనే తెలంగాణ ప్రభుత్వం ముస్లింలకు ఎన్నో సంక్షేమ పథకాలను ప్రారంభించింది. మచ్చుకు కొన్ని తెలుసుకుంటావా గఫూర్. అన్నింటి గురించి రాయాలంటే ఎన్ని పేజీలు రాసినా సరిపోదు గఫూర్.

ముస్లింలు సామాజికంగా, విద్యా పరంగా అభివృద్ధి చెందడానికి తెలంగాణ మైనార్టీ స్కూళ్లను ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీని ఏర్పాటు చేసి దానికి ఒక చైర్మన్ ను ఏర్పాటు చేసి నిరుపేద పిల్లలకు ఉన్నత ప్రమాణాలతో ఇంగ్లీష్ మీడియం విద్యాబోధన అందించాన్న ఉద్దేశంతో ఏర్పాటైందే ఆ సొసైటీ. ఇది అభివృద్ధి కాదా మిస్టర్ గఫూర్. గత ప్రభుత్వాలు ఏనాడైనా ముస్లిం పిల్లల విద్య గురించి ఆలోచించాయా చెప్పు? ఇంకా ఉంది..

ముస్లింల అభివృద్ధి కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలను కేటాయించింది. ఇంకా కేటాయిస్తూనే ఉంటుంది. రంజాన్ పండుగకు పేద ముస్లింలకు కొత్త బట్టలు, కిట్స్ అందిస్తున్నది ప్రభుత్వం. రంజాన్ పండుగను తెలంగాణ పండుగగా గుర్తించి ప్రతి ఏరియాలో ఇఫ్తార్ విందును ప్రభుత్వం తరుపున ఏర్పాటు చేస్తోంది ప్రభుత్వం. ఇదంతా ముస్లింల అభివృద్ధి కాదా గఫూర్.

నిరుద్యోగ ముస్లిం యువతకు లక్ష నుంచి రెండున్నర లక్షల వరకు బ్యాంకులతో సంబంధం లేకుండా వంద శాతం సబ్సిడీతో యూనిట్లు, డబుల్ బెడ్ రూం ఇళ్లలో 10 శాతం ఇస్తోంది. ఎస్సీ, ఎస్టీల కంటే కూడా అన్ని రంగాల్లో వెనుకబడ్డ ముస్లింలను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అభివృద్ధి చెందే విధంగా సీఎం కేసీఆర్ కృషి చేస్తుంటే ముస్లింలు అభివృద్ధి చెందట్లేదని ఎలా మాట్లాడుతున్నావు నువ్వు. నీ మాటలు ముస్లిం సోదరులు ఉంటే నిన్ను కర్నూలుకు తరిమి తరిమి కొడుతరు జాగ్రత్త.

 

 

Top