You are here
Home > Latest News > గవర్నర్ గిరి చేయాలని చూస్తున్న బీజేపీ.

గవర్నర్ గిరి చేయాలని చూస్తున్న బీజేపీ.

Spread the love
  1. గవర్నర్ గిరి చేయాలని చూస్తున్న బీజేపీ.
  2. ఒక బీజేపీ నాయకురాలిని తీసుకొచ్చి గవర్నర్ ను చేశారు.
  3. ఏ సమస్య వచ్చినా నేరుగా గవర్నర్ కు కంప్లైంట్ చేయడం ఏంటి.
  4. నరసింహన్ ఉన్నప్పుడు ఇలా జరిగిందా?.
  5. ఎందుకు ప్రతి ఒక్కరికీ అపాయింట్ మెంట్స్ ఇచ్చి…
  6. అంతా తాను చూసుకుంటానని గవర్నర్ మాట్లాడుతోంది.

గవర్నర్ ద్వారా తెలంగాణను హస్తం గతం చేసుకోవాలని భారీ ప్లాన్ తో.. బీజేపీ ఉన్నట్లు తెలుస్తోంది. కానీ.. కమలం నేతల పప్పులు తెలంగాణలో ఉడకవు. సీఎం కేసీఆర్ ముందు మీ ఆటలు సాగవు. గవర్నర్ ఒక రబ్బర్ స్టాంప్ మాత్రమే. ప్రభుత్వం చెప్పేవి ఆమోద ముద్ర వేయాలని ఒక మౌన ముని మాత్రమే. కానీ.. ప్రభుత్వాన్ని శాసించి రూల్స్ పాస్ చేసేంత పరిస్థితి ఉండదు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఉండగా.. అలా జరగదు. బీజేపీ వాళ్లు ఏమైనా భ్రమల్లో ఉంటే అవి తొలగించుకోండి.

ఆర్టీసీ వాళ్లని, అఖిలపక్షం వాళ్లను ఊ అంటే పిలిపించుకుని మాట్లాడుతున్న గవర్నర్ తన హుందా తనాన్ని పోగొట్టుకుంటోంది. క్యాబ్ డ్రైవర్లతో కూడా గవర్నర్ చర్చలు జరపడం అంటే.. ఎంత దిగజారి ప్రవర్తిస్తున్నారు. రాజకీయాల కోసం రాజ్యాంగ హోదాను కూడా బీజేపీ భ్రష్టుపట్టిస్తోంది. ఆర్టీసీ కార్మికుల సమ్మెను గవర్నర్ చూసుకుంటుందట. ప్రభుత్వంతో మాట్లాడుతుందట. ఇదంతా బానే ఉన్నా.. అసలు కార్మికులకు, ప్రభుత్వానికి జరిగే విషయంలో మీరెందుకు మాటిమాటికి ఇన్వాల్వ్ అవుతున్నారన్నదే మా ప్రశ్న.

ప్రజలకు గానీ.. ప్రభుత్వ సంస్థలకు గానీ ఏవైనా సమస్యలు వస్తే.. ప్రభుత్వం చూసుకుంటుంది. అయినా హైకోర్ట్ ఆర్డర్ కాపీ అందగానే కార్మికులతో చర్చలు జరిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. హైకోర్ట్ ఏం చెప్పిందన్నది ముందు తెలియాలి కదా?. కొత్త గవర్నర్ ప్రభుత్వ విధుల్లో జోక్యం చేసుకోవడం తగ్గించుకుంటే మంచిది. రాజ్యాంగ హోదాలో గవర్నర్ లాగా వ్యవహరిస్తే బాగుంటుంది. బీజేపీ కార్యకర్తలా, కేంద్ర ఏజెంట్ లా పనిచేస్తే.. ప్రజలు ఎవ్వరూ హర్షించరు.

 

 

Top