You are here
Home > Latest News > గెలుపు కోసం గుడ్డిగా ఆరోపణలు చేస్తున్న ఉత్తమ్.

గెలుపు కోసం గుడ్డిగా ఆరోపణలు చేస్తున్న ఉత్తమ్.

Spread the love

 

  • గెలుపు కోసం గుడ్డిగా ఆరోపణలు చేస్తున్న ఉత్తమ్.
  • కాంగ్రెస్ కార్యకర్తలను జైలుకు పంపుతున్నారట.
  • మీ పార్టీ వాళ్లను జైళ్లో పెట్టి టీఆర్ఎస్ గెలవాలని చూస్తుందా?.
  • మీకు అంత సీన్ లేదు ఉత్తమ్.. టీఆర్ఎస్ కు ప్రజాధరణ ఉంది.
  • గెలవలేమనే భయంతోనే బీజేపీతో కుమ్మక్కయ్యారు.
  • వామపక్షాలు, టీడీపీ మద్దతు కోరుతున్నారు ఉత్తమ్.

ఉత్తమ్ తన సొంత ఇలాకాలో ఓడాల్సి వస్తుందన్న భయంతో టీఆర్ఎస్ పై లేని పోని నిందలు వేస్తున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపుతున్నారట. తప్పుడు కేసులు పెడితే కోర్టుల్లో నిరూపించు కదా ఉత్తమ్. మీ పార్టీ కార్యకర్తలు చేసిన తప్పులకే జైలుకు వెళ్తున్నారు తప్ప.. సర్కార్ కొత్తగా ఏమీ కేసులు పెట్టడం లేదు. ప్రచారంలో ప్రజల నుంచి కాంగ్రెస్ కు తగిన ఆదరణ లభించకపోవడంతో.. ఉత్తమ్ కు పిచ్చి పట్టినట్లుంది. అందుకే ఏదేదో మాట్లాడుతున్నాడు. పనికిమాలిన ఆరోపణలు చేస్తున్నాడు.

టీఆర్ఎస్ కు ఓట్లేస్తేనే అభివృద్ధి అని ఎక్కడా చెప్పలేదు ఉత్తమ్. అధికార పార్టీని గెలిపించుకుంటే ఎక్కువ నిధులు వస్తాయి. అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని టీఆర్ఎస్ చెబుతుంది. ప్రతిపక్షంలో ఉన్న నువ్వు గెలవడం కన్నా.. అధికార పక్షంలో ఉన్న పార్టీ గెలిస్తేనే ప్రజలకు లాభం కదా?. 10ఏళ్లు హుజూర్ నగర్ ఎమ్మెల్యేగా ఉన్నావ్ ఏం చేశావ్ ఉత్తమ్. కనీసం బస్టాండులో రోడ్డు కూడా వేయలేకపోయావ్. నువ్వు అభివృద్ధి చేశావా?. హుజూర్ నగర్ నియోజకవర్గంలో వేసిన రోడ్లన్నీ టీఆర్ఎస్ శాంక్షన్ చేసినవే. హుజూర్ నగర్ మున్సిపాలిటీ సైతం టీఆర్ఎస్సే చేసింది. నువ్వు నీ భార్య హుజూర్ నగర్ కు చేసిందేమీ లేదు ఉత్తమ్.

ఓడిపోతామన్న భయంతో బీజేపీతో కుమ్మక్కయ్యావ్. రహస్యంగా బీజేపీ కేంద్ర పెద్దలను కలిసి.. టీఆర్ఎస్ ను ఓడించాలని కుట్ర పన్నావ్. అధికార దుర్వినియోగం అని నువ్వు, బీజేపీ వాళ్లు కంప్లైంట్ చేశారు. ఫలితంగా కేంద్రం కనుసన్నల్లో నడిచే ఈసీ.. హుజూర్ నగర్ లో ప్రత్యేక అబ్జర్వర్ ను పెట్టింది. ఎస్పీని మార్చింది. ఆఖరికి జనాన్ని కన్ఫ్యూజ్ చేయడానికి టీఆర్ఎస్ గుర్తును పోలిన గుర్తులను స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించింది. ఇవి చాలవా కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కయ్యారు అనడానికి ఉత్తమ్. ఇప్పుడేమో.. వామపక్షాలు, టీడీపీ తమతో కలిసి రావాలని బతిమాలుకుంటున్నావ్. ఇవన్నీ చూస్తుంటే ఓటమి భయం నీలో స్పష్టంగా కనిపిస్తుంది ఉత్తమ్.

Top