You are here
Home > Latest News > చంద్రబాబుకు.. విపక్షాల నాశనకారి శాఖ బాగుంటది

చంద్రబాబుకు.. విపక్షాల నాశనకారి శాఖ బాగుంటది

Spread the love

టీడీపీలో కొత్త గొంతులు మొరుగుతున్నాయి. ఒకప్పుడు.. చంద్రబాబు చుట్టూ తిరిగిన సీనియర్లంతా.. ఇప్పుడు పక్కలు వెతుక్కుని వెళ్లిపోతుండడంతో.. ఏం చేయాలో అర్థం కాని కొన్ని గొంతులు.. కొత్తగా మొరగడం మొదలు పెట్టాయి. స్థాయి, అర్హత మరిచి మరీ.. మొరుగుతున్నాయి.

పెంపుడు గొంతులకు, అరువు తెచ్చుకున్న గొంతులకు కూడా.. ఈ మధ్య టీడీపీ ఆఫీసులోకి వెళ్లగానే.. అరవడం మానేసి మొరగడం మొదలు పెడుతున్నాయి. మంత్రి కేటీఆర్ నే విమర్శించేంతగా.. అర్హత లేని మాటలు మాట్లాడుతున్నాయి. కానీ.. జనం మాత్రం ఆ మొరుగుతున్న గొంతులను తరిమికొట్టాలని చూస్తున్నారు.

ఓ వైపు.. ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్షాలను నిర్వీర్యం చేస్తూ.. బెదిరింపులతో.. పక్క పార్టీల ఎమ్మెల్యేలందరినీ చంద్రబాబు గుంజేస్తుంటే.. ప్రతిపక్షాల ఆయువు పట్టు మీద కొట్టే ప్రయత్నం చేస్తుంటే.. మన దగ్గర ఎవరూ గొంతు ఎత్తలేదు. ఇప్పుడు మాత్రం.. చిన్న విషయాలను పట్టించుకుంటూ.. కేటీఆర్ ను బజారుకీడ్చే ప్రయత్నం చేస్తున్నారు.

ఇక్కడ సొంతంగా టీడీపీని వీడి టీఆర్ఎస్ లో చేరుతున్న నేతల సంగతిని ఆ పార్టీలో మొరుగుతున్న గొంతులు పట్టించుకోవడం లేదు. భువనగిరిలో సాక్షాత్తూ మాజీ హోం మంత్రి భార్య, సీనియర్ నాయకురాలు ఎలిమినేటి మాధవరెడ్డి లాంటి టీడీపీ సీనియర్లు కూడా టీఆర్ఎస్ పై సానుకూలంగా మాట్లాడుతుంటే.. అది పట్టించుకోవడం లేదు.

ఇవన్నీ మరిచిపోతూ.. కేటీఆర్ కు పార్టీ ఫిరాయింపుల మంత్రిత్వ శాఖ ఇవ్వాలంటూ.. నోటికొచ్చింది మొరుగుతూనే ఉన్నారు. అలాంటివాళ్లను.. రాజకీయంగా బొంద పెట్టేందుకు ప్రజలు కూడా సదా.. సిద్ధంగానే ఉన్నారు. తగిన సమయం కోసం జనం ఎదురుచూస్తున్నారు.

Top