You are here
Home > Latest News > చంద్రబాబు కుట్రలు ..7 మండలాలతో మొదలుపెట్టి.. 88 ఫిర్యాదుల వరకు!!

చంద్రబాబు కుట్రలు ..7 మండలాలతో మొదలుపెట్టి.. 88 ఫిర్యాదుల వరకు!!

Spread the love

– తెలంగాణ ద్రోహి చంద్రబాబు పైశాచికత్వం
– విభజనకు ముందూ వెనకా కుట్రల మీద కుట్రలు
– ఇప్పుడు కాంగ్రెస్ తో జట్టు కట్టి మరోసారి విషం చల్లుతున్న ఏపీ సీఎం

నోరు తెరిస్తే చాలు. తెలుగు రాష్ట్రాలు తనకు రెండు కళ్ళని చెబుతాడు. చేసే పనులు మాత్రం ఆ రెండు కళ్ళలో ఒకదాన్ని తనకు తానుగా పొడిచేసినట్టుగా వ్యవహరిస్తాడు. ఆయనే.. ప్రపంచానికి రెండు కళ్ళ సిద్దాంతాన్ని పరిచయం చేసిన చంద్రబాబు అని మనం కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. తెలంగాణ అన్న పదాన్నే నిషేధించిన హీనమైన చరిత్ర చంద్రబాబు నాయుడుది. ఆ వ్యతిరేకతతోనే రాష్ట్ర ఏర్పాటును వీలైనంతగా అడ్డుకున్నాడు. చేయరాని ద్రోహం చేశాడు. తెలంగాణ ద్రోహిగా ముద్ర పడ్డాడు.

తెలంగాణ ఏర్పాటు సమయంలో కూడా.. పోలవరం ప్రాజెక్టు పేరుతో.. అన్యాయంగా మన ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ఏడు మండలాలను బలవంతంగా ఆంధ్రప్రదేశ్ లో విలీనం చేయించుకున్నాడు. మన పొట్ట కొట్టి మన భూమి గుంజుకుని మన ప్రజలపై దౌర్జన్యం చేశాడు. అక్కడితో ఆగకుండా.. తెలంగాణ సమాజాన్ని మరిన్ని ఇబ్బందులకు గురి చేసింది కూడా చంద్రబాబే.

ఉత్తర తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టును కూడా చంద్రబాబు వదల్లేదు. తెర వెనుక మంత్రాంగం నడిపిస్తూ.. కాళేశ్వరం ప్రాజెక్టుతో ఆంధ్రప్రదేశ్ కు నష్టం జరుగుతుందని ప్రచారం చేశాడు. తెలంగాణ రైతుల కష్టాలు తీర్చే ప్రాజెక్టు అని తెలిసి కూడా.. ఏకంగా 88 కేసులు వేయించాడు. ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకునేందుకు శాయశక్తులా కుట్రలు పన్నాడు. అయినా.. తెలంగాణ రైతుల సంకల్పం నెరవేరుతూ.. కేసీఆర్ ప్రభుత్వ శ్రమ ఫలిస్తూ.. కాళేశ్వరం ప్రాజెక్టు వడివడిగా పూర్తవుతోంది.

ఇది కూడా భరించలేకపోతున్న చంద్రబాబు.. ఇప్పుడు ఎన్నికల తరుణంలో కాంగ్రెస్ అవసరాన్ని తనకు అనుకూలంగా మలుచుకున్నాడు. పొత్తు కుదుర్చుకుని మరోసారి తెలంగాణపై దండెత్తి వస్తున్నాడు. కుట్రల మీద కుట్రలు చేస్తూ.. మన రాష్ట్రంపై కాలకూట విషాన్ని చల్లే ఈ దుర్మార్గుడు మనకు అవసరమా?? చంద్రబాబు మళ్ళీ వస్తే తెలంగాణ ఆగం అవదా??

ఓటరు మహాశయా.. ఒక్క క్షణం ఆలోచించు. ఆ తర్వాతే నిర్ణయం తీసుకో. కేసీఆర్ నాయకత్వానికి జై కొట్టి సంక్షేమాన్ని అందుకో.

Top