You are here
Home > Latest News > చంద్రబాబు రాధాకృష్ణ.. తోడు దొంగలు

చంద్రబాబు రాధాకృష్ణ.. తోడు దొంగలు

Spread the love

 

 

  • బాబు, ఆర్కేల స్ట్రాటజీలు దేనికో..
  • కేసీఆర్ ను డైరెక్ట్ గా ఎదుర్కోలేక పనికిమాలిన కథనాలతో వడ్డిస్తున్నాడు..

ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ.. చంద్రబాబు తొత్తని.. పేపరు, చానెల్ పచ్చ మీడియా అని ఎవరికి తెలియదు చెప్పండి. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశమంతా తెలుసు. రాధాకృష్ణ.. చంద్రబాబు ఏది చెబితే అది చేస్తాడు.. అసలు.. పేపరు, న్యూస్ చానెల్ ఉన్నదే చంద్రబాబును అందలం ఎక్కించడానికి. ఇవన్నీ ఏపీ ప్రజలకు తెలియదా? తెలంగాణ ప్రజలకు తెలియదా? చంద్రబాబును ఆర్కే తిడుతూ కథనం రాస్తే అప్పుడు ఆలోచించాలి కానీ.. చంద్రబాబును పొగుడుతూ రాయడంలో ఆశ్చర్యమేముంది. అలాంటిదే ఓ కథనం..

ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్.. చంద్రబాబు ఏర్పాటు చేస్తున్న కూటమి వైపే ఉంటాను అన్ని అన్నాడట. సీఎం కేసీఆర్ ఆయన్ను కలిసిన రెండు రోజులకే బీజేపీయేతర కూటమికే తన మద్దతు అని చంద్రబాబుకు తన ఎంపీ ద్వారా వర్తమానం పంపించాడట. ఇది ఆంధ్రజ్యోతి వండి వార్చిన కథనం. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, సీఎం కేసీఆర్ ఇద్దరూ మీడియాతో మాట్లాడి స్పష్టంగా చెప్పారు. ఇద్దరూ కలిసి ఫెడరల్ ఫ్రంట్ దిశగా అడుగులు వేస్తున్నట్టు వెల్లడించారు. బీజేపీ, కాంగ్రెస్ యేతర కూటమి కోసం తాము ఖచ్చితంగా పోరాడుతామని చెప్పారు.

మళ్లీ ఇప్పుడు బీజేడీ ఎంపీ ద్వారా బాబుకు లేఖ రాశారని.. కేంద్రంలో బీజేపీ దిగిపోవాలని.. అందుకే.. బీజేపీయేతర కూటమివైపు మొగ్గు చూపుతున్నట్టు నవీన్ పట్నాయక్ స్పష్టం చేశాడు. ఇది ఆంధ్రజ్యోతి కల్పించిన కథనం. ఒకవేళ బీజేడీ ఎంపీ చంద్రబాబును కలిసినా.. అది ఫ్రంట్ గురించి కాకపోవచ్చు. అది పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి అయి ఉండొచ్చు. ఒకవేళ నిజంగానే నవీన్ పట్నాయక్.. చంద్రబాబు ఫ్రంట్ కు సపోర్ట్ ఇవ్వాలనుకుంటే.. వాళ్ల ఎంపీ ద్వారా ఎందుకు వర్తమానం పంపించాలి.. ఆయనే డైరెక్ట్ గా చంద్రబాబును కలిసి తన మద్దతు పలకొచ్చు కదా. బీజేపీయేతర ఫ్రంట్ కోసం బాబుతో కలుస్తున్నట్టు ప్రకటించొచ్చు కదా. అలా నవీన్ చేయలేదు అంటే అర్థం ఏంటి. ఆయన చంద్రబాబుతో కలిసి పనిచేయట్లేదు అనే అర్థం. ఆంధ్రజ్యోతికి కొంచెం ఉబ్బు ఎక్కువ కదా. ఆగదు కదా. బీజేడీ ఎంపీ దేనికి కలిశారో  కూడా తెలుసుకోకుండా.. చంద్రబాబును పైకి లేపాలని ఓ పనికిమాలిన కథనాన్ని వడ్డించింది. అది కూడా సీఎం కేసీఆర్.. నవీన్ పట్నాయక్ ను కలిసి వచ్చిన రెండు మూడు రోజులకే. ఇదంతా సీఎం కేసీఆర్ మీద కావాలని బురద జల్లే ప్రయత్నం అని అర్థమయితలేదా? ఎవ్వరికైనా అర్థమవుతుంది. ఇది.. కేసీఆర్ ను డైరెక్ట్ గా ఎదుర్కోలేక.. ఇలా వెనుక నుంచి ఆయన మీద బురద జల్లుతున్నారు చంద్రబాబు, ఆర్కే. ఆయ్యా.. బాబులూ.. మీరు ఎంత బురద జల్లినా.. అది మళ్లీ మీమీదే పడుతుంది గుర్తుంచుకోండి. మీరే అడ్డంగా బుక్కయిపోతారు.

Top