You are here
Home > Uncategorized > చత్తీస్ గఢ్ కరెంటుపై నీ ముచ్చట్లు పచ్చి అబద్ధాలు..

చత్తీస్ గఢ్ కరెంటుపై నీ ముచ్చట్లు పచ్చి అబద్ధాలు..

Spread the love

 

24 గంటల కరెంట్ కోసం ప్రభుత్వం తాపత్రయ పడుతుంటే ఈ కాకమ్మ లెక్కలు ఎందుకు?

దేశంలో ఏ రాష్ట్రమయినా 24 గంటల కరెంట్ ఇస్తున్నదా?

ఆనాడు కిరణ్‌కుమార్ రెడ్డి తెలంగాణ రాష్ట్రం వస్తే.. తెలంగాణ చిమ్మచీకటిగా మారుతుందన్నడు.

నీ టమాటాలతో కరెంట్‌ను బాగానే పోల్చావు కాని.. అసలు ఒక రాష్ట్రంలో 24 గంటల కరెంట్ ఇవ్వాలంటే ఎంత ప్రయాసకూర్చాలి. ఎంతమంది అధికారులు దానిపై పని చేస్తున్నరు. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ ఇవ్వడం అనేది మామూలు విషయమా? దేశ చరిత్రలోనే ఇది కొత్త చరిత్ర. ఇప్పటి వరకు ఈ ఘనతను ఏ రాష్ట్రం కూడా సాధించలేదు. అది కూడా ఉచితంగా ఇవ్వడం అనేది ఓ సంచలనం.

తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడే డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తి ప్రణాళికలు వేసి.. దానికి అనుగుణంగా సరఫరా చేయడమనేది సాధ్యమయ్యే విషయమా? అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు సీఎం కేసీఆర్. డిమాండ్‌కు తగ్గ సరఫరా చేయాంటే పంపిణీ వ్యవస్థ పటిష్టంగా ఉండాలని భావించి కొత్త సబ్ స్టేషన్లు, లైన్లు, పవర్ ట్రాన్స్ ఫార్మర్లు వేశారు. ఇప్పుడు దాదాపుగా 9500 మెగావాట్ల గరిష్ట డిమాండ్ ఏర్పడుతుండగా.. వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇవ్వడంతో పాటు.. ఎత్తిపోతల పథకాలకు, మిషన్ భగీరథకు, పరిశ్రమలకు కరెంట్ సరఫరా చేస్తే మరో 50 శాతం అదనంగా విద్యుత్ సరఫరా చేయాల్సి ఉంటుంది.

తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్రంలో స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఎంతో తెలుసా? కేవలం 6574 మెగావాట్లు. అది ఎటూ చాలని కరెంట్. దీంతో పవర్ హాలీడేలు ప్రకటించడం ఇదంతా ఏంటిది మరి. గడిచిన మూడున్నరేండ్లలో ప్రభుత్వం, విద్యుత్ సంస్థలు చేసిన ఏర్పాట్ల ఫలితంగా అదనంగా 8271 మెగావాట్ల విద్యుత్‌ను తెలంగాణ సమకూర్చుకున్నది. దీంతో ప్రస్తుతం 14,845 మెగావాట్ల స్థాపిత విద్యుత్ ఉత్పత్తి అందుబాటులో ఉంది. భవిష్యత్తులో మరో 13 వేల మెగావాట్ల విద్యుత్ సమకూర్చుకోవడం కోసం కొత్త ఉత్పతి కేంద్రాలను కూడా నిర్మిస్తున్నారు. మొత్తానికి 2022 నాటికి తెలంగాణలో 28 వేల మెగావాట్ల విద్యుత్‌ను అందుబాటులోకి తేవడమే లక్ష్యం.

నిజంగా ఛత్తీస్‌గఢ్ ద్వారా వచ్చే కరెంట్ వల్లనే ఇప్పుడు తెలంగాణలో విద్యుత్ కాంతులు వెదజిమ్ముతున్నాయి. అది ఎంత ధరకు వచ్చింది.. ప్రభుత్వం ఎంత ఖర్చు పెడుతున్నది అనే విషయాలు పక్కన బెడితే.. నిజంగా క్షేత్రస్థాయిలో సగటు రైతుకు, తెలంగాణ ప్రజలకు లబ్ధి చేకూరుతున్నదా అనే కోణంలోనే చూడటం బెటర్. ఎందుకంటే.. 24 గంటల విద్యుత్‌ను తీసుకురావడానికి టీఆర్‌ఎస్ ప్రభుత్వం, విద్యుత్ సంస్థలు పడుతున్న కష్టం అంతా ఇంతా కాదు. వీలైతే.. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తున్న తెలంగాణ ప్రభుత్వాన్ని పొగుడుదాం. ఈ కాకి లెక్కల గొడవ మనకెందుకు.. మీరు.. ఈ లెక్కలన్నీ చెప్పి ఏం సాధిస్తారు. తెలంగాణలో 24 గంటల కరెంట్ రావడం నిజమే కదా? మరి.. ఇంకా ఈ పనికి మాలిన చర్చలన్నీ ఎందుకు.

Top