You are here
Home > Latest News > చరిత్ర తెలియకుండా చెత్తవాగుడు

చరిత్ర తెలియకుండా చెత్తవాగుడు

Spread the love
  • చరిత్ర తెలియకుండా చెత్తవాగుడు
  • సెప్టెంబరు 17పై విభిన్న అభిప్రాయాలు
  • అన్ని అభిప్రాయాలనూ గౌరవిస్తున్న కేసీఆర్ ప్రభుత్వం
  • ఈ విషయాన్ని రాజకీయం చేస్తున్న బీజేపీ

తెలంగాణకు నిధులు ఇమ్మంటే చేతకాదు. కొత్త ప్రాజెక్టులు మంజూరు చేయమంటే వినరు. కాళేశ్వరాన్ని జాతీయ ప్రాజెక్టు ప్రకటించండి బాబూ అంటే కేంద్ర ప్రభుత్వం చెవికెక్కించుకోదు. తెలంగాణపై సవతి తల్లి ప్రేమ చూపించడాన్ని మానదు. సెప్టెంబరు 17పై రాజకీయాలు చేయడానికి మాత్రం బీజేపీ రెడీ. తెలంగాణ సర్కార్ ఆధ్వర్యంలో ఆ రోజు విమోచన దినాన్ని నిర్వహించడం లేదంటూ గుండెలు బాదుకుంటున్నది. బీజేపీయే ఊరూరా విమోచ‌న దినం నిర్వహిస్తుందట. నిజానికి టీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఏటా విమోచ‌న దినం నిర్వ‌హిస్తున్నది. నిజాం పాల‌న‌పై ప్ర‌జ‌ల్లో భిన్నాభిప్రాయాలు ఉండ‌టం, కొన్ని వ‌ర్గాల‌కు అసంతృప్తి క‌ల‌గ‌వ‌చ్చ‌నే ఆలోచ‌న‌తో ప్ర‌బుత్వ‌ప‌రంగా ఈ కార్య‌క్ర‌మం జ‌ర‌ప‌డం లేదు.

 

సెప్టెంబర్ 17ను తెలంగాణకు విద్రోహ దినమా? విలీన దినమా? విమోచన దినమా? దాన్ని ఏ విధంగా పరిగణించాలి అనే చర్చ మలిదశ తెలంగాణ ఉద్యమం ఊపందుకున్న కాలంలో ప్రారంభమైంది. అంతముందు ఈ చర్చ అంతగా లేదు. ఈ చర్చను ప్రధానంగా తెరపైకి తెచ్చింది అతివాద వామపక్ష భావవాదులు. అతివాద వామపక్ష భావవాదులు సెప్టెంబరు 17ను విద్రోహ దినంగా పరిగణించాలని వ్యాఖ్యానిస్తే మితవాదులు దాన్ని విమోచన దినంగా పాటించాలనడం మధ్యేయవాదులు దాన్ని విలీన దినంగా పరిగణించా లనడం జరుగుతుంది. ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా సెప్టెంబరు 17కు భాష్యం చెబుతున్నారు. అందుకే ఈ వివాదాన్ని మ‌రింత పెద్ద‌ది చేయ‌డం ఇష్టం లేక తెరాస ప్ర‌భుత్వం మిన్న‌కుంది. ఏదేమైనా ఆ రోజు న అప్పటివరకు స్వతంత్ర సంస్థానంగా ఉన్న హైదరాబాద్ రాజ్యం భార త యూనియన్‌లో విలీనమైందనేది కాదనలేని సత్యం. విమోచన, విముక్తి అనేటువంటి వ్యక్తీకరణలు సెప్టెంబర్ 17కు ఆపాదించడం సరైంది కాదనేది తెలంగాణలోని చాలామంది చరిత్రకారుల, మేధావుల అభిప్రాయం.

 

నిజానికి సమకాలీన చరిత్రకారులు, వ్యాఖ్యాతలు, భారత ప్రభు త్వం, భారత సైన్యం ఎవరూ కూడా ఆ సంఘటనను విమోచనగా, విముక్తిగా పేర్కొనలేదు. 1962లో పోర్చుగీస్ పాలనలో ఉన్న గోవాను భారత యూనియన్‌లో విలీనం చేసే చర్యను భారత ప్రభుత్వం గోవా విముక్తిగానే పేర్కొన్నది. 1972లో బంగ్లాదేశ్‌ను పాకిస్థాన్ చెర నుంచి విడిపించడానికి చేసిన సైనిక చర్యను భారత ప్రభుత్వం బంగ్లాదేశ్ విముక్తిగానే పేర్కొన్నది. కానీ, 1948 సెప్టెంబర్ 13న ప్రారంభమైన ఆపరేష న్ పోలో పేరిట సాగిన సైనికచర్యను భారత ప్రభుత్వం పోలీస్ చర్యగా పేర్కొన్నది తప్ప ఎక్కడా విమోచన, విముక్తి అన్న పదాలను వాడలేదు. పోలీస్ యాక్షన్‌గా పిలువబడిన సైనికచర్య లక్ష్యం హైదరాబాద్ రాజ్యం లో బలపడుతున్న కమ్యూనిస్టులను అణిచివేయడం, రజాకార్లను అణిచివేసే పేరు మీద అమాయక ముస్లింలను ఊచకోతకు గురిచేయడమే అయ్యింది తప్ప నాడు హైదరాబాద్ రాజ్య ప్రజలు అనుభవిస్తున్నటువంటి భూస్వామ్య దోపిడీ నుంచి విముక్తి మాత్రం లభించలేదు.

 

సెప్టెంబర్ 17 అనంతరం బ్రిటిష్ సామ్రాజ్యవాదుల కేంద్రీకృత ఆధిపత్యానికి లోబడి స్వతంత్రంగా కొనసాగుతున్న హైదరాబాద్ రాజ్యం భారత యూనియన్‌లో విలీనమైంది. వెంటనే కాకున్నప్పటికీ రాచరిక పాలన అంతమై ప్రజాస్వామ్య పాలనకు మార్గం సుగమమైంది. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం వల్ల మూడు వేల గ్రామాల్లో భూస్వాముల అధీనంలోని 10 లక్షల ఎకరాల భూమి విముక్తమై రైతుకూలీల పరమైం ది. సైనికచర్య తర్వాత ఈ భూములు తిరిగి భూస్వాములపరమైనాయి. తెలంగాణ సాయుధ రైతంగ పోరాటం సాధించిన విముక్తి ఫలాలను సైని కచర్య తిరగదోడింది. సైనికచర్యలో రైతాంగ పోరాటానికి నాయక త్వం వహించిన కమ్యూనిస్టులను, పోరాటంలో పాల్గొన్న వేలాదిమంది రైతుకూలీలు ఊచకోతకు గురైనారు. హైదరాబాద్ రాజ్యంలో ముఖ్యం గా మరాట్వాడాలో వేలాదిమంది ముస్లింలు రజాకార్ల పేరుమీద సైన్యం ఊచకోతకు బలైనారు. ఈ ప‌రిణామాల‌ను ప‌రిశీలిస్తే సెప్టెంబ‌రు 17ను విమోచ‌న‌ దినోత్స‌వంగా పిల‌వ‌డం సాధ్యం కానేకాదు.

Top