You are here
Home > Latest News > చర్చ పెడితే.. మీరే పారిపోతారమ్మా.. అరుణమ్మా!

చర్చ పెడితే.. మీరే పారిపోతారమ్మా.. అరుణమ్మా!

Spread the love

రాష్ట్రంలోని ఖనిజ సంపదను.. ఆంధ్రాకు తరలిస్తున్నారని.. ఇసుక రవాణా తీరుపై చర్చకు సిద్ధమా అనీ.. ప్రభుత్వంపై కాంగ్రెస్ నాయకురాలు డీకే అరుణ.. ఏదోదో సవాళ్లు విసురుతున్నారు కానీ.. తమ పాలన తీరులో చేసిన నిర్వాకాలు ఏంటి? తాము ఎలాంటి ఫలితాలు సాధించాము? తాము ఎలా జనం సంపదను దోచుకున్నాము అన్న విషయాలు గుర్తుంచుకుంటే.. ఇలాంటి మాటలు మాట్లాడి ఉండేవారు కాదు.

ఎందుకంటే.. ఇప్పుడు కేసీఆర్ సర్కారు వచ్చాక.. ఇసుక పాలసీలో పారదర్శకత అద్భుతంగా అమల్లోకి వచ్చింది. ప్రతిపక్షాలు ఎన్ని ఆరోపణలు చేసినా.. ఏ మాత్రం పసలేకుండా పోయాయి. ఒక్కటంటే ఒక్కదాన్ని కూడా ఎవరూ నిరూపించలేకపోయారు. అందుకే.. జనాలు కూడా.. కేసీఆర్ ప్రభుత్వ విధానాలకు పట్టం కడుతూ.. ప్రతి ఎన్నికల్లో అద్భుత విజయాలు అందిస్తున్నారు.

ఇసుక పాలసీ ఒక్కటని మాత్రమే కాదు. ముఖ్యమంత్రి ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినా.. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు.. పార్టీలకు అతీతంగా నాయకులు మనసారా ఆశీర్వదిస్తున్నారు. అభినందిస్తున్నారు. అందుకే.. అరుణమ్మా.. అనవసరంగా అవాకులు చెవాకులు పేలకండి. మీ నిర్వాకాలు బయటపెడితే.. మరోసారి ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా భయపడి పారిపోతారు.

ఒక వేళ.. అన్నీ వదిలేసి ఎన్నికల్లో పోటీ చేసినా.. మీ భరతం పట్టేందుకు జనం ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. అందుకే.. ప్రభుత్వంపై.. మంత్రి జూపల్లిపై అనవసర విమర్శలు  చేయకండి జాగ్రత్త.

Top