You are here
Home > Latest News > చాడా… నోరు జాగ్రత్త!!

చాడా… నోరు జాగ్రత్త!!

Spread the love

 

  • – ఆర్టీసీని బాగు చేస్తున్న తీరు గుర్తించని సీపీఐ
  • – నోరుంది కదా అని విమర్శిస్తున్న తీరు
  • – కార్మిక సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డికి రాజకీయంగా రోజులు దగ్గర పడ్డాయి. నోరుంది కదా అని ఏది పడితే అది మాట్లాడుతున్న ఆయనకు.. జనాలు గట్టి బుద్ధి చెప్పే సమయం కూడా దగ్గర్లోనే ఉంది. ఆర్టీసీకి చెందిన కొందరు నాయకులతో సమావేశమై అదేదో అంతర్జాతీయ స్థాయి సమావేశమైనట్టుగా గప్పాలు కొడుతున్న చాడ వెంకట్ రెడ్డి తీరు.. కార్మిక వర్గాల్లోనూ తీవ్ర వ్యతిరేకతకు కారణమవుతోంది.

అధికారంలోకి రాగానే.. ఆర్టీసీ కార్మికులకు 43 శాతానికి పైగా ఫిట్ మెంట్ ఇచ్చిన ఘనత కేసీఆర్ ది. తర్వాత ఎంతో మంది కార్మికులను రెగ్యులరైజ్ చేసి వారి జీవితాలకు, కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించిన ఘనత కేసీఆర్ ది. కొత్త బస్సులు తెప్పిస్తూ సంస్థను మరింత దృఢంగా మార్చిన ఘనత కేసీఆర్ ది. కార్మికులను ఆదుకునేందుకు అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్న ఘనత కూడా కేసీఆర్ దే.

అలాంటి ముఖ్యమంత్రిని పట్టుకుని.. ఆర్టీసీ నీ అయ్య జాగీర్ కాదు.. అని చాడ వెంకట్ రెడ్డి వ్యాఖ్యానించడమే పెద్ద తప్పిదంగా మారిపోయింది. మంచి చేస్తున్న కేసీఆర్ ను ఏమైనా అంటే ఊరుకునేది లేదని కూడా కార్మిక వర్గాల నుంచి అనధికారికంగా చాడాకు సమాచారం వెళ్లినట్టు తెలుస్తోంది. ఎన్నికల్లో లబ్ధి పొందాలనుకుంటే నేరుగా అదే విషయం చెప్పాలని.. అంతే కానీ ఇలాంటి పనికిమాలిన మాటలతో తమ సమయం వృథా చేయొద్దని చాడాకు కాస్త గట్టిగానే జనాలు తేల్చి చెబుతున్నారు.

తీరు మార్చుకోకుంటే.. వచ్చే ఎన్నికల్లోనే తగిన శాస్తి చేస్తామని కూడా సీపీఐ నేతలను హెచ్చరిస్తున్నారు.

Top