You are here
Home > Uncategorized > చార్మినార్ హమారా షాన్ …

చార్మినార్ హమారా షాన్ …

Spread the love

హైదరాబాద్‌కే తలమానికం అయిన చార్మినార్‌కు అరుదైన గౌరవం దక్కింది. స్వచ్ఛ భారత్‌ మిషన్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం 10 ప్రముఖ స్థలాలు స్వచ్ఛతకు గుర్తింపు చిహ్నాలుగా ప్రకటించింది. వీటిలో చార్మినార్‌ను కూడా చేర్చింది. అంతర్జాతీయ ప్రాముఖ్యత ఉన్న సుప్రసిద్ధ ప్రాంతాలను సుందరంగా, పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం పూనుకుంది. ఈ మేరకు స్వచ్ఛభారత్‌ మిషన్‌ ఆధ్వర్యంలో మంగళవారం ఢిల్లీలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో చార్మినార్‌ను స్వచ్ఛతకు గుర్తింపు చిహ్నంగా ప్రకటించింది.

దేశంలోని 100 ప్రముఖ ఐకాన్ నగరాలను స్వచ్ఛతకు మోడల్‌గా తీర్చి దిద్దడానికి స్వచ్ఛ భారత్ మిషన్ సంకల్పించింది. దీనిలో భాగంగా మొదటి దశలో అమృతసర్‌తో సహా పది ప్రాంతాలను స్వచ్ఛ ఐకాన్‌గా గుర్తించింది. రెండవ దశలో చార్మినార్‌తో సహా 10 నగరాలను స్వచ్ఛతకు గుర్తింపు చిహ్నాలుగా స్వచ్ఛ భారత్ మిషన్ ప్రకటించింది. కార్పొరేట్‌ సామాజిక బాధ్యత కింద ఆయా ప్రాంతాల అభివృద్ధి బాధ్యతలను ప్రభుత్వం పలు ప్రభుత్వరంగ సంస్థలకు అప్పగిస్తుంది. ఆ ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచడానికి కావాల్సిన ఆర్థిక, సాంకేతిక సహకారాలను అవి అందిస్తాయి. చార్మినార్‌ బాధ్యతను కేంద్ర ప్రభుత్వం ఎన్టీపీసీకి అప్పగించింది.

రెండో దశ స్వచ్ఛ ఐకానిక్ ప్రాంతాల జాబితా
1. చార్మినార్, 2. గంగోత్రి, 3. యమునోత్రి, 4. ఉజ్జయిని మహకాళేశ్వర్‌ దేవాలయం, 5. గోవాలోని చర్చ్‌ అండ్‌ కాన్వెంట్‌ ఆఫ్‌ సెయింట్‌ ఫ్రాన్సిస్‌ ఆఫ్‌ ఎస్సిస్సి, 6. ఎర్నాకులంలోని ఆదిశంకరాచార్య కలాది, 7. శ్రావణబెలగోలలోని గోమటేశ్వర క్షేత్రం, 8. దేవ్‌గఢ్‌లోని బైద్యనాథ్‌ జ్యోతిర్లింగ ఆలయం (జార్ఖండ్), 9. బిహార్‌లోని గయాతీర్థ్‌, 10.గుజరాత్‌లోని సోమనాథ్‌ మందిరం

Top