You are here
Home > Latest News > చివరకు బీబీసీ కూడా చంద్రబాబుకు అమ్ముడుపోయింది…

చివరకు బీబీసీ కూడా చంద్రబాబుకు అమ్ముడుపోయింది…

Spread the love

 

  1. బీబీసీ క్రెడిబిలిటీని ఇటువంటి వార్తలతో దెబ్బతీసుకున్నారు కదా..
  2. క్యాబినేట్ ఏర్పాటు చేయకపోయినంత మాత్రాన రాష్ట్రంలో అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతుందా?
  3. హర్రీబర్రీగా క్యాబినేట్ ను విస్తరించినంత మాత్రాన ఒరిగేదేమన్నా ఉందా?

ఎప్పుడైనా మనం నిజాలు మాట్లాడుకోవాలి. తెలంగాణలో క్యాబినేట్ ఏర్పాటు కానంత మాత్రాన తెలంగాణ అభివృద్ధి ఏమన్నా ఆగిపోయిందా? అసెంబ్లీని సమావేశ పరచకపోయినంత మాత్రాన రాష్ట్రంలో పరిపాలన సాగట్లేదా? ఎక్కడ పనులు ఆగిపోయాయి. గత ప్రభుత్వాలు తమ 60 ఏళ్ల పాలనలో క్యాబినేట్ ను ఏర్పాటు చేసి మాత్రం ఏం పీకారు. తెలంగాణలో అభివృద్ధి ఏం జరిగింది. తెలంగాణ ఏపాటి బాగైంది. తెలంగాణలోని అణగారిన వర్గాలను ఏపాటి ఆదుకున్నారో తెలంగాణ ప్రజలకు తెలియదా? కేవలం కేబినేట్ ఏర్పాటు చేసినంత మాత్రాన.. ఆసెంబ్లీని సమావేశ పరిచినంత మాత్రాన అభివృద్ధి జరుగుతుందా? అస్సలే కాదు.. అనడానికి గత 60 ఏళ్ల పాలనే నిదర్శనం.

అభివృద్ధి జరగాలంటే నాయకుల్లో చిత్తశుద్ధి ఉండాలె. ఏదైనా చేయాలనే ఆరాటం ఉండాలె. కసి ఉండాలే.. సాహసం ఉండాలె.. దైర్యం ఉండాలె… ఇవి ఉంటే చాలు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లొచ్చు. ఇప్పుడు సీఎం కేసీఆర్ కూడా చేసేది అదే. అంతే కానీ.. కచ్చితంగా అసెంబ్లీ సమావేశాలు జరగాల్సిందే. క్యాబినేట్ ఏర్పాటు చేయాల్సిందే.. అలా అయితేనే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంది.. ఇదేం ప్రజాస్వామ్యం… ఎక్కువ మెజారిటీ వస్తే ప్రభుత్వాలు ఇలానే ఉంటాయి.. అంటూ బీబీసీ కొత్త భాష్యాలు చెప్పడం దేనికి నిదర్శనం. ఇలా ఓ రాష్ట్రంపై నిందలు వేయడం ఏ ప్రజాస్వామ్యమో.. దీనికి బీబీసీయే సమాధానం చెప్పాలి. బీబీసీ చంద్రబాబుకు అమ్ముడుపోయిందని.. చంద్రబాబుకు తొత్తులా వ్యవహరిస్తోందని చెప్పడానికి ఈ ఉదాహరణ చాలదూ.

కరెక్టే… ప్రభుత్వం ఏర్పడగానే మంత్రివర్గ విస్తరణ చేయాలి.. అసెంబ్లీని సమావేశపరచాలి. కానీ.. ప్రభుత్వం ఏర్పడి సంవత్సరాలు కాలేదు కదా. కేవలం నెల అయింది అంతే. అందునా.. ఒక్కొక్కరిని నియమిస్తూనే ఉన్నారు. హోమంత్రిని నియమించారు. ప్రొటెం స్పీకర్ ను నియమించారు. ప్రభుత్వమేమీ చేతులు కాళ్లు కట్టేసుకొని కూర్చుంటున్నదా? రాష్ట్రంలోని ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. ప్రాజెక్టులపై సమీక్ష జరుగుతూనే ఉన్నది. అసెంబ్లీ సమావేశాలు కూడా కచ్చితంగా జరుగుతాయి. కేబినేట్ విస్తరణ కూడా ఉంటది. కేబినేట్ విస్తరణ లేకుండా… ప్రజాస్వామ్యంలో కొత్త విధానాలు.. అంటూ అప్పుడే పిచ్చి కూతలు కూయడం ఎందుకు. తెలంగాణ ప్రజలకు లేని బాధ నీకెందుకో. ఓహో.. మీ చంద్రబాబు రాయించాడా మీతో. మీరు కాదు రాసింది.. చంద్రబాబు ఆత్మ మీతో అలా రాయించిందా? ఆ చంద్రబాబుకు మెదడు కాళ్లలో ఉంది సరే.. మీకేమైంది. ఇంటర్నేషన్ మీడియా.. ప్రజల్లో ఓ విశ్వాసం ఉన్న మీడియా ఇలా ప్రవర్తించడాన్ని ఏమనాలి. ఇది ప్రజాస్వామ్యాన్ని భంగపరచడం కాదా? ఇలా అయితే.. తెలంగాణ ప్రజలు బీబీసీని నమ్మడం కాదు.. తెలంగాణ నుంచే తరిమేస్తారు జాగ్రత్త. చంద్రబాబు ప్రపంచంలోని అన్ని మీడియాలను కొనేసి… తనకు అనుకూలంగా… తనకు వ్యతిరేకంగా ఉన్నవాళ్లకు వ్యతిరేకంగా రాయించుకుంటూ ఏం సాధిస్తాడో చూద్దాం. ఈ పచ్చ మీడియా పీడ ఎప్పుడు విరగడ అవుద్దో ఏమో. చంద్రబాబును ఏపీ ప్రజలు ఘోరాతి ఘోరంగా ఓడిస్తే కానీ.. పచ్చ మీడియా నామరూపాలు లేకుండా పోతుంది. అంతే.. అదే వీటి అంతానికి సరైన సమాధానం.

Top