You are here
Home > Latest News > చూస్తారుగా మీరే… జన ప్రభంజనం ఎటువైపో!!

చూస్తారుగా మీరే… జన ప్రభంజనం ఎటువైపో!!

Spread the love

 

 

  • – సర్వేలపై తప్పుడు ఫలితాలు ప్రచురిస్తున్న ప్రజాస్వామ్య వ్యతిరేకులు
  • – ఓటమి భయంతో అడ్డగోలు రాతలు రాయిస్తున్న విపక్షాలు
  • – టీఆర్ఎస్ ను నేరుగా ఎదుర్కోలేక దుర్మార్గపు రాజకీయాలు

అనుకున్నదొకటట… అయ్యింది మరోటట. నియోజకవర్గాల్లో అభ్యర్థుల బలాబలాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ చేయించిన సర్వే గురించి నవ తెలంగాణలో రాసిన కథనంలో చెప్పిన మాటలివి. మామూలుగా అయితే నిఘా వర్గాలు ప్రభుత్వానికి నివేదికలు ఇస్తాయి. కానీ… తమ చేతికే నిఘా వర్గాలు నివేదికలు ఇచ్చాయి అన్నంతగా కలరింగ్ ఇస్తూ ఆ పత్రిక రాసిన రాతలు.. జుగుప్స కలిగిస్తున్నాయి.

సర్వేలు అన్నది… టీఆర్ఎస్ అంతర్గత విషయం. నిఘా వర్గాలు అన్నది ప్రభుత్వానికి సంబంధించిన అంతర్గత విషయం. ఆ మాత్రం కూడా ఇంగితం లేకుండా ఈ రాతగాళ్లు ఎందుకు వార్తలు రాస్తున్నట్టో వారికే అర్థం కావాలి. ఇది వదిలేస్తే… సర్వేల్లో అనుకున్నదొకటి అయిందొకటి అని నవ తెలంగాణ చేస్తున్న ప్రచారం వెనక విపక్షాలు ఉన్నట్టు స్పష్టమవుతోంది. సభల్లో, మీడియా సమావేశాల్లో కాంగ్రెస్, టీడీపీ, ఇతర పార్టీల నేతలు మాట్లాడుతున్న విషయాలనే ఈ కథనంలో ఆ పత్రిక ప్రచురించింది.

విపక్షాలు మాట్లాడిన మాటలకు మించి ఒక్క మాట కూడా అదనంగా లేకపోవడమే ఈ కథనాన్ని తేలిపోయేలా చేసింది. ఏ మాత్రం బలం లేని వాదనలు, ఏ మాత్రం అర్థం లేని వివరణలు చేస్తూ.. అడ్డగోలు రాతలు రాసిన నవ తెలంగాణ పత్రికను ఏం చేస్తే బాగుంటుందో జనాలే నిర్ణయించాలి. మరోసారి ఇలాంటి తప్పులు జరగకుండా… టీఆర్ఎస్ కు బ్రహ్మాండమైన మెజారిటీ అందించి… ఇలాంటి అసాంఘిక శక్తుల నోళ్లు మూయాలి.

Top