You are here
Home > Latest News > చెప్తున్నారు.. చేసి చూపిస్తున్నారు!

చెప్తున్నారు.. చేసి చూపిస్తున్నారు!

Spread the love
  • ఇదీ.. మాట నిలబెట్టుకోవడం అంటె. ఇదీ..
  • పాలన చేసే విధానం అంటె.
  • ఎన్నికల్లో హామీలు ఇవ్వడమే కాదు..

వాటిని ఎలా అమలు చేసి చూపడం అనేది మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకే సాధ్యమవుతోంది.ఇచ్చిన హామీలు తీర్చకుంటే.. మళ్లీ ఎన్నికల్లో ఓట్లు అడిగేది లేదని చెప్పిన ఏకైన ముఖ్యమంత్రి మన కేసీఆర్. అందుకే.. ఆయన అడుగుజాడల్లో.. మార్గదర్శకత్వంలో.. రాష్ట్ర సంక్షేమ అభివృద్ధి రంగాలు రంగం పరుగులు పెడుతోంది. అన్ని వర్గాల ప్రజలకు.. అభివృద్ధి ఫలాలు అందుతున్నయ్.

కొత్తగా ఆరు మండలాల ఏర్పాటుకు సీఎం కేసీఆర్ ఆదేశాలు,

 

 తెలంగాణలో కొత్తగా ఆరు మండలాలను ఏర్పాటు చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ ప్రగతిభవన్‌లో పంచాయతీరాజ్ అంశాలతో పాటు, ఎన్నికల హామీలపై అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి, ఎమ్మెల్యేలు సి.లక్ష్మారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, ఆరూరి రమేశ్, చల్లా ధర్మారెడ్డి, సీనియర్ అధికారులు ఎస్.నర్సింగ్ రావు, రాజేశ్వర్ తివారి, రామకృష్ణారావు, వికాస్ రాజ్, స్మితా సభర్వాల్, నీతూ ప్రసాద్, రఘునందన్ రావు, పౌసమి బసు తదితరులు హాజరయ్యారు.

కొత్తగా ఏర్పడిన మండలాలివే..

నల్గొండ జిల్లాలో గట్టుప్పల్‌, భూపాలపల్లి జిల్లాలో మల్లంపల్లి, బాన్సువాడలోని చందూరు, మోస్ర, మహబూబాద్‌లో ఇనుగుర్తి, సిద్దిపేటలో నారాయణరావు పేటను మండలాలుగా ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు.

Top