You are here
Home > Latest News > చేజేతులా శిక్ష వేయించుకుని.. ప్రభుత్వాన్ని తప్పుబడితే ఎలా?

చేజేతులా శిక్ష వేయించుకుని.. ప్రభుత్వాన్ని తప్పుబడితే ఎలా?

Spread the love

కాంగ్రెస్ నేతలు అసెంబ్లీలో పక్కా ప్లాన్ ప్రకారమే.. గవర్నర్ పై.. మండలి చైర్మన్ పై దాడి చేశారు. తర్వాత శిక్ష వేయించుకున్నారు. సభ నుంచి తమకు తాముగానే బయటికి వెళ్లిపోయే మార్గాన్ని కల్పించుకున్నారు. ఆ పరిణామాన్ని ప్రభుత్వ తప్పిదంగా చూపేందుకు ఇప్పుడు విష ప్రచారం చేస్తున్నారు. వాళ్లకు వంత పాడుతూ.. ఆ విష ప్రచారంలో టీడీపీ నేతలు కూడా భాగమయ్యారు.

ప్రధాన ప్రతిపక్షం లేకుండా సభ నిర్వహిస్తారా.. అని ప్రశ్నిస్తున్న టీడీపీ ఎమ్మల్యే సండ్ర వెంకట వీరయ్య.. మరి గవర్నర్ ను దాదాపు హత్య చేసినంత పని చేసిన కోమటిరెడ్డి గురించి ఏమంటాడు? ఈ ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పడు. ఇక.. ఊకదంపుడు ఉపన్యాసాలతోనే.. సభ జరిగిందంటున్న బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి.. సభలో ప్రశ్నోత్తరాల్లో తాము అడిగిన ప్రశ్నలకు.. ప్రభుత్వం ఇచ్చిన సమాధానాల గురించి మాత్రం మాట్లాడడు.

అంతే కాదు.. తెలంగాణ నుంచి భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఎదిగి.. మన తెలంగాణ నీళ్లను సీమాంధ్ర నేతలకు దోచి పెట్టిన పొన్నాల లక్ష్మయ్య కూడా.. కాగ్ నివేదిక గురించి మాట్లాడుతుంటే.. దయ్యాలు వేదాలు వల్లించినట్టే ఉందన్న మాట అక్షర సత్యమన్న అభిప్రాయం అంతటా వ్యక్తమవుతోంది. రాజకీయాల నుంచి జనాలు బహిష్కరించినా ఇప్పటికీ పొన్నాల మారలేదనేందుకు ఇదే నిదర్శనమన్న మాట కూడా వినిపిస్తోంది.

అందుకే.. ప్రతిపక్ష నేతలు వారి పరిమితులు తెలుసుకోవాల్సిన అవసరమైతే.. ఇప్పటికిప్పుడు అత్యవసరం. లేదంటే.. వారికి రాజకీయ బహిష్కరణ శిక్ష పడడం ఖాయం. ఇది తథ్యం.

Top