You are here
Home > Latest News > జగ్గారెడ్డికి నోటి దురదెక్కువ! ఇది జనం మాట..!

జగ్గారెడ్డికి నోటి దురదెక్కువ! ఇది జనం మాట..!

Spread the love

ముఖ్యమంత్రి కేసీఆర్ అంటే.. సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి మొదటి నుంచి పడదు. అందుకే ఆయన.. నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటారు. ఇష్టం వచ్చినట్టుగా పిచ్చిపిచ్చిగా ఆరోపణలు చేస్తూ ఉంటారు. ఆయన ఎప్పుడు కాంగ్రెస్ లో ఉంటారో.. ఎప్పుడు బీజేపీలో ఉంటారో.. ఎప్పుడు ఏ పార్టీ నుంచి ఏ పార్టీకి మారుతుంటారో ఆయనకే తెలియదు. అందుకే.. ఆయనకు జనాల్లో కూడా విలువ లేదు.

గూండాగిరీకి.. రాజకీయ దౌర్జన్యానికి కేరాఫ్ గా నిలిచే జగ్గారెడ్డి.. కేసీఆర్ తీరును విమర్శిస్తుంటే జనం చూసి నవ్వుకుంటున్నారు. రిజర్వేషన్ల విషయంలో చిత్తశుద్ధిని చూపించడమే కాదు.. అసెంబ్లీ తీర్మానాన్ని కూడా ఆమోదించి పంపిన ఘనమైన చరిత్ర కేసీఆర్ ది అన్న వాస్తవాన్ని జగ్గారెడ్డి మరిచిపోతున్నారంటూ ఛీ కొడుతున్నారు. కేంద్రం పరిధిలోని విషయాన్ని.. రాష్ట్రానికి ముడిపెట్టడమే కాదు. అనవసరంగా ముఖ్యమంత్రిని వివాదంలోకి లాగుతున్నాడంటూ మైనారిటీలు కూడా సీరియస్ అవుతున్నారు.

నిజంగా జగ్గారెడ్డికి చిత్తశుద్ధే ఉంటే.. మైనారిటీల సంక్షేమానికి కేసీఆర్ అడుగులు వేస్తున్న మార్గంలో.. జగ్గారెడ్డి కూడా పయనించాలని సంబంధిత వర్గం ప్రజలు కోరుకుంటున్నారు. ఇలా ఒకరోజు దీక్ష చేసే బదులు.. తమ కోసం వాస్తవిక దృక్పథంతో పోరాడితే సహకరిస్తామని కూడా మైనారిటీలు జగ్గారెడ్డికి సూచిస్తున్నారు. కానీ.. తమ మాటను పట్టించుకోకుండా.. తప్పుడు ఆరోపణలు చేస్తున్న జగ్గారెడ్డిని.. ఇకపై ఎలా నమ్ముతామని జనం ప్రశ్నిస్తున్నారు. జగ్గారెడ్డికి నోటి దురద ఉందనీ.. అలాంటి వ్యక్తి తమకేం మేలు చేస్తాడని భావిస్తున్నారు.

Top