You are here
Home > Latest News > జగ్గారెడ్డి కాదు… జగ్గూ దాదా!!

జగ్గారెడ్డి కాదు… జగ్గూ దాదా!!

Spread the love

– మనుషుల్ని అక్రమంగా తరలించారు

– తప్పుడు పాస్ పోర్టులు పొందారు

– అరెస్ట్ కావడంతో బయటికొచ్చిన అక్రమాలు

– సిగ్గు పడుతున్న సంగారెడ్డి ప్రజలు

జగ్గారెడ్డి. కఠినాత్ముడు. దుర్మార్గుడు. నీతి నియమం లేనివాడు. ఇన్నాళ్లూ రాజకీయాలను అడ్డు పెట్టుకుని… బెదిరింపులకు పాల్పడుతూ… సంగారెడ్డితో పాటు ఇతర ప్రాంతాల్లోనూ సంఘ విద్రోహ శక్తిగా తయారయ్యాడు. ఇన్నాళ్లూ సంగారెడ్డి ప్రజల నీడలో పైకి అమాయకుడిలా నటిస్తూ అంతర్గతంగా తన రాక్షసత్వాన్ని చాటుకున్న జగ్గారెడ్డి తప్పుడు చర్యలు ఇన్నాళ్లకు బయటపడ్డాయి.

తప్పుడు పేర్లతో అమెరికాకు మనుషుల అక్రమ రవాణా… తన కుటుంబ సభ్యుల పేర్లతో పాసుపోర్టులు సంపాదించడం… ఈ పని చేసినందుకు పదిహేను లక్షల రూపాయలు లంచం తీసుకోవడం లాంటి దుర్మార్గమైన చర్యలకు పాల్పడిన జగ్గారెడ్డి… ఇంకా తానో సత్తెపూస అని చెప్పుకోవడం కంటే మూర్ఖత్వం ఇంకోటి లేదు. ఆయన్ను చూసి సంగారెడ్డి ప్రజలు ఛీత్కరిస్తున్నారు. ఉమ్మేస్తున్నారు. జగ్గారెడ్డి గురించి విన్నాం, చూశాం కానీ… మరీ ఇంతటి చిల్లరగాడా… అని అసహ్యించుకుంటున్నారు.

జగ్గారెడ్డి లీలలను బయటపెట్టిన పోలీసులను సంగారెడ్డి ప్రజలు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు. ఓ నర రూప రాక్షసుడి వ్యవహారాన్ని ఇప్పుడైనా అంతా అర్థం చేసుకోవాలని పిలుపునిస్తున్నారు. ఇలాంటి వాళ్ల బారి నుంచి రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలను, పాలనను ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. జగ్గారెడ్డి ఏ పార్టీలో ఉన్నా సరే. ఓడించి తగిన ప్రతీకారం తీర్చుకుంటామని కూడా సవాల్ విసురుతున్నారు.

Top