You are here
Home > Latest News > జానారెడ్డి.. ఉస్మానియా యూనివర్సిటీకి, టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఏమైనా సంబంధం ఉందా?

జానారెడ్డి.. ఉస్మానియా యూనివర్సిటీకి, టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఏమైనా సంబంధం ఉందా?

Spread the love
  • ఉస్మానియా యూనివర్సిటీ అటానమస్ బాడీ..
  • దానికి సంబంధించిన నిర్ణయాలు వీసీ తీసుకుంటారు.. టీఆర్ఎస్ ప్రభుత్వం కాదు..
  • తెలంగాణ ప్రభుత్వంపై బురద జల్లి ఏం సాధిస్తావు జానా?

జానారెడ్డి.. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నవారు. కాస్తో కూస్తో తెలంగాణ గురించి కూడా ఎక్కువ అవగాహన ఉన్నవారనుకున్నాం. కానీ… ఏమాత్రం రాజకీయ అవగాహన లేని వ్యక్తిగా మాట్లాడటం నిజంగా విస్మయానికి గురి చేస్తున్నది. ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన విషయాలను టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎందుకు లింక్ చేస్తున్నావు నువ్వు? దశాబ్దాలు తెలంగాణను పాలించిన కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నావు కదా. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా చేసిన అనుభవం ఉంది. అయినా ఈ బురద జల్లుడు వ్యవహారాలు, బట్ట కాల్చి మీదేసుడు ఎందుకు జానా? దేనికోసం జానా? అధికారం కోసం వెంపర్లాడటమా?

ఉస్మానియా యూనివర్సిటీ అటానమస్ బాడీ. యూనివర్సిటీకి సంబంధించిన విషయాలను వీసీ చూసుకుంటారు. ఏ నిర్ణయాలైనా వీసీ తీసుకోవాల్సిందే. దానికి టీఆర్ఎస్ పార్టీకి ఏంటి సంబంధం? వీసీ యూనివర్సిటీ నిబంధనలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటారు. అది పూర్తిగా పక్షపాతంగా ఉంటుంది. అది నీకు తెలియనిదా జానా రెడ్డి. మరి.. ఎందుకు నువ్వు రాహుల్ గాంధీ ఉస్మానియా యూనివర్సిటీ పర్యటనపై టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిందిస్తున్నావు. రాష్ట్రంలో నిర్బంధ పాలన కొనసాగుతున్నదా జానారెడ్డి.

ఉస్మానియా విద్యార్థులను రాహుల్ గాంధీ కలిస్తే రాష్ట్ర ప్రభుత్వానికి కలిగే నష్టం ఏంలేదు.. లాభం అంతకన్నా లేదు. అసలు రాహుల్ గాంధీ ఎవరిని కలిస్తే తెలంగాణ ప్రభుత్వానికేంది జానా రెడ్డి. తెలంగాణ ప్రభుత్వం అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోదు. ఎవరి నిర్ణయాలు వారివి. ప్రతి దానికి తెలంగాణ ప్రభుత్వాన్ని నిందించడం పరిపాటైంది కాంగ్రెస్ పార్టీ నాయకులకు. సిగ్గుండాలి. మీరు సక్కగ పరిపాలిస్తే తెలంగాణలో సమస్యలు ఇంకా ఎందుకుంటాయి. ఇప్పుడు తెలంగాణ ప్రజల దుస్థితిని చూసి రాహుల్ గాంధీ బాధపడుతున్నారా? రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలో ఉండి ఏం చేశారు నాయనా? అప్పుడు తెలంగాణ బాధలు పట్టలేదా మీకు? అప్పుడు మీరు తెలంగాణను బాగు చేసి ఉంటే.. ఇప్పుడు ఇన్ని సమస్యలు ఉండేవి కాదు కదా జానా రెడ్డి. తెలంగాణ ప్రజలు అంతా గమనిస్తున్నరు. ఎవరు ఎటువంటి వాళ్లో తెలంగాణ ప్రజలకు బాగా తెలుసు. ఎవరిని గెలిపించాలో.. ఎవరిని ఓడించాలో కూడా వాళ్లకు తెలుసు. ఎవరు అభివృద్ధి చేస్తున్నారో.. ఎవరు తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్నారో కూడా వాళ్లు గమనిస్తున్నారు జానారెడ్డి. తినబోతూ రుచి ఎందుకు?

Top