You are here
Home > Latest News > టీఆర్ఎస్ గెలుపును జీర్ణించుకోలేకపోతున్న కోరా!!

టీఆర్ఎస్ గెలుపును జీర్ణించుకోలేకపోతున్న కోరా!!

Spread the love

 

– ఎన్నికలకు ముందే ఖాయమైన టీఆర్ఎస్ గెలుపు

– సర్వేలు చెబుతున్న సత్యంపై కోదండరాం కినుకు

– పొత్తులతో ఏదో సాధిస్తామంటూ అతి విశ్వాసం

తెలంగాణ జన సమితి నాయకుడు కోదండరాం ఆశలు, ఆలోచనలు హద్దులు మీరుతున్నాయి. త్వరలో జరగబోయే ఎన్నికల్లో కేసీఆర్ దే గెలుపు అని సర్వేలు కోడై కూస్తుంటే… ఆయనలో ఆందోళన పెరుగుతోందని.. అందుకే ఇలాంటి చర్యలకు దిగుతున్నారని స్పష్టమవుతోంది. సర్వేలన్నీ రాజకీయ ప్రచార అస్త్రాలుగా మారిపోతున్నాయని కోరా చెబుతున్న తీరు.. ఆయనలో రాబోయే ఓటమిని గుర్తించిన తీరును ప్రతిబింబిస్తోంది.

టీవీ5, ఫ్లాష్ టీమ్ ను.. ఎవరూ సర్వే చేయండి అని అడగలేదు. వాళ్లంతట వాళ్లే చేశారు. ప్రజల మనోభావాలను జనానికి తెలియజేశారు. దాన్ని కూడా తప్పుబట్టినట్టుగా మాట్లాడితే… కోదండరాం ఓ రకంగా ప్రజాస్వామ్యాన్నే తప్పుబడుతున్నట్టు లెక్క. అంతే కాదు. కేసీఆర్ నాయకత్వాన్ని ఓడించేందుకు పొత్తులతో అంగీకారానికి వస్తాం అని చెబుతున్నారు. అంటే.. ఒకప్పుడు తెలంగాణకు అడ్డంగా అడ్డుపడిన కాంగ్రెస్, టీడీపీ, సీపీఎంలతో అడ్డంగా రాజకీయ సంసారం చేస్తామని ఆయన చెబుతున్నట్టే కదా.

ఇలాంటి కోదండరాంనా మనం నమ్మాల్సింది? ఇలాంటి కుట్రల కోరా చెప్పే మాటలేనా మనం వినాల్సింది? కాంగ్రెస్ నీడలో ఎదిగి.. ఇప్పుడు టీడీపీ పంచన చేరుతూ… తెలంగాణ ద్రోహిగా మారుతున్న తీరును సిగ్గూ ఎగ్గూ లేకుండా చూపించేసుకుంటుంటే… సహిస్తూ కూర్చునేది లేదని జనం కుండబద్ధలు కొడుతున్నారు. ఏ మాత్రం ధైర్యం ఉన్నా… గతంలో చెప్పినట్టుగా ఒంటరిగా పోటీ చేసి తన బలాన్ని నిరూపించుకోవాలని కోదండరాంకు ప్రజలు సవాల్ విసురుతున్నారు.

పొత్తులకు సిద్ధపడ్డారు అంటేనే… కేసీఆర్ గెలుపును కాంగ్రెస్, టీడీపీ, కోదండరాంతో పాటు ఇతర చిన్నాచితకా పార్టీలు అంగీకరించినట్టు అని జనం స్పష్టం చేస్తున్నారు.

Top