You are here
Home > Latest News > టీఆర్ఎస్ లో ఉన్నప్పుడు ఎందుకు చెప్పలేదు రాములమ్మా?

టీఆర్ఎస్ లో ఉన్నప్పుడు ఎందుకు చెప్పలేదు రాములమ్మా?

Spread the love

 

 

 

  • – ఇన్నాళ్లూ మాయమైపోయింది.. సడన్ గా ప్రత్యక్షమైంది
  • – ప్రజల సంక్షేమమే లక్ష్యమైతే ఎందుకు మాయమైనట్టు?
  • – ఉన్న ఫళంగా వచ్చి ఇలా మాట్లాడితే మంచిది కాదంటున్న ఓటర్లు
  • తెలంగాణ వచ్చింది కాంగ్రెస్ తో కాదుః విజయశాంతి అసందర్భ ప్రేలాపన 

రాములమ్మ అలియాస్ విజయశాంతి నిద్ర లేచారు. ఇన్నాళ్లూ.. రాజకీయంగా గాఢ నిద్రలో ఉన్న ఆమె.. ఎన్ని కలలు కన్నారో.. తాను కాబోయే ముఖ్యమంత్రిని అని ఊహించుకున్నారో మనకు తెలియదు కానీ.. ఉన్న ఫళంగా కాంగ్రెస్ కు స్టార్ క్యాంపెయినర్ అయిపోయారు. అంతే.. మైకు దొరికిందే తడవుగా ముఖ్యమంత్రి కేసీఆర్ ను పట్టుకుని నానా మాటలు అనేస్తున్నారు. కాంగ్రెస్ అధిష్టానం దృష్టిలో పడేందుకు పడరాని పాట్లు పడుతున్నారు.

తెలంగాణ వచ్చింది కేసీఆర్ తో కాదు.. ప్రజల త్యాగాలను గుర్తించే సోనియాగాంధీ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చారని విజయశాంతి చెబుతున్నారు. ఇంకా.. బంగారు తెలంగాణను ఇస్తే అప్పులు మిగిల్చారని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. తనకు కేసీఆర్ వచ్చి చెవిలో చెప్పినట్టుగా.. కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేసేందుకే ముందస్తు ఎన్నికలు తీసుకొచ్చారని కూడా అనేశారు.

కానీ.. తాను ఏ పార్టీ కోసం మాట్లాడుతున్నారో.. అదే పార్టీ రాష్ట్రంలో ప్రాజెక్టులు అడ్డుకుందని.. నియామకాలు అడ్డుకుందని.. ప్రగతి నిరోధకంగా మారిందని విజయశాంతి అర్థం చేసుకోలేకపోతున్నారు. తాను టీఆర్ఎస్ లో ఉన్నప్పుడు తెలంగాణ జాతిపితగా కనిపించిన కేసీఆర్.. ఇప్పుడు కాంగ్రెస్ లో తాను నిద్ర లేవగానే దయ్యంగా కనిపిస్తున్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇన్నాళ్లూ అడ్రస్ లేకుండా పోయిన విజయశాంతి.. ఇప్పుడు సడన్ గా దయ్యం పట్టినట్టు మాట్లాడుతుండడాన్ని ప్రజలు ఎంత మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు.

విజయశాంతి ఎంత మొత్తుకున్నా.. తాము మాత్రం టీఆర్ఎస్ ఏ ఓట్లు వేస్తామని రాష్ట్ర ప్రజలు ఆత్మసాక్షిగా తీర్మానాలు చేసుకుంటున్నారు.

Top